Latest Updates
-
ప్రేమ రాశిఫలాలు: ఏప్రిల్ 21న మీ భాగస్వామితో బంధం బలపడాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ 7 చిట్కాలు మీకోసమే! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్! -
ఆది శంకరాచార్య జయంతి: ఇంట్లో పూజలు చేస్తున్నారా? ఈ శుభ ముహూర్తాలు, నియమాలు మీకు తెలుసా? -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత యోగం.. మీ జాతకం ఎలా ఉంది? - మంగళవారం, 21 ఏప్రిల్ 2026 -
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి!
వర్షాకాలంలో వేధించే చర్మ, జుట్టు అలెర్జీలు.. వాటి పరిష్కారాలు
మండిపోయే ఎండాకాలం వెళ్లిపోయిన తర్వాత చల్లని చిరుజల్లుల వర్షాకాలం చాలా మందికి హాయినిస్తుంది. కానీ కొంత మందికి అనారోగ్య సమస్యలను మోసుకువస్తుంది. తడిగా ఉండే వాతావరణం వల్ల జుట్టు, చర్మ సమస్యలు తీవ్రంగా బాధిస్తాయి. దురద, దద్దుర్లు, జుట్టు రాలడం వంటి సమస్యలు వేధిస్తాయి. ఈ చర్మ సమస్యల నుంచి కాపాడుకోవడానికి కొన్ని చిట్కాలు పాటించాలంటున్నారు నిపుణులు. అసలు వర్షాకాలంలో వచ్చే చర్మ, జుట్టు అలెర్జీలు ఏంటి, ఆ సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో ఇప్పుడు చూద్దాం.
చర్మ అలెర్జీలు
డెర్మటైటిస్:
చర్మ వాపును డెర్మటైటిస్ గా వ్యవహరిస్తారు. ఇది అలెర్జీలు, చికాకులు, ఇన్ఫెక్షన్లతో సహా వివిధ కారణాల వల్ల సంభవిస్తుంది. వర్షాకాలంలో, తేమతో కూడిన వాతావరణంలో బూజు పెరగడం వల్ల చర్మ వ్యాధి వస్తుంది.

తామర:
ఇది దీర్ఘకాలిక చర్మ పరిస్థితి. దీని వల్ల దురద, ఎరుపు, మంట కలిగిస్తుంది. అధిక తేమ కారణంగా వర్షాకాలంలో తామర చాలా మందిని ఇబ్బంది పెడుతుంది.
దద్దుర్లు:
వివిధ చర్మ సమస్యల వల్ల దురద ఇబ్బంది పెడుతుంది. పుప్పొడి, మోల్డ్, ఆహారం వంటి వాటి వల్ల కలిగే అలెర్జీతో చర్మంపై దద్దుర్లు వస్తాయి.
జుట్టు అలెర్జీలు
చుండ్రు:
వర్షాకాలం వచ్చిందంటే చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్య చుండ్రు. నెత్తిపై దురద వల్ల పొలుసులుగా వస్తుంది. అధిక తేమ కారణంగా వర్షాకాలంలో చుండ్రు చాలా మందిని ఇబ్బందికి గురిచేస్తుంది.
ఫోలిక్యులిటిస్:
ఫోలిక్యులిటిస్ అంటే హెయిర్ ఫోలికల్స్ కు వచ్చే ఒకరకమైన ఇన్ఫెె7న్. ఈ ఇన్ఫెక్షన్ వల్ల తలపై అలాగే శరీరంపై చిన్న సైజులో ఉండే ఎర్రటి గడ్డలు వస్తాయి. బ్యాక్టీరియా లేదా ఫంగస్ వల్ల ఫోలిక్యులిటిస్ వస్తుంది.
టినియా కాపిటిస్:
ఇది తలపై వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్. ఇది దురద, ఎరుపు, చుండ్రు లాంటి స్కేలింగ్ కు కారణం అవుతుంది.
చర్మ, జుట్టు అలెర్జీల నుంచి దూరంగా ఉండాలంటే..
అలెర్జీ కారకాలను నివారించాలి :
వర్షాకాలంలో అలెర్జీ వస్తుందని మీకు ముందే తెలిస్తే.. అలెర్జీకి కారణమయ్యే వాటికి దూరంగా ఉండాలి. అది ఆహారమైనా కావొచ్చు లేదా పరిస్థితులు అయినా కావొచ్చు. వానలో తడిస్తే అలెర్జీ వస్తుందనుకుంటే తడవకుండా ఉండేలా జాగ్రత్త పడాలి.
హ్యూమిడిఫైయర్ వాడాలి:
హ్యూమిడిఫైయర్లు ఇంట్లోని గాలిని తేమగా ఉంచడంలో సహాయపడతాయి. ఇది చర్మం, జుట్టు పొడిబారకుండా ఉంచడంలో సహాయపడుతుంది.
మాయిశ్చరైజర్ వాడాలి:
చాలా మంది మాయిశ్చరైజర్ అంటే కేవలం ఎండాకాలంలో మాత్రమే వాడతారని అనుకుంటారు. కానీ వానాకాలంలో వచ్చే చాలా సమస్యలను మాయిశ్చరైజర్ దూరం చేస్తుంది. స్నానం చేసిన తర్వాత చర్మంపై మాయిశ్చరైజర్ రాసుకోవడ వల్ల చర్మం హైడ్రేట్ గా ఉంటుంది. ఇది పొడిబారడాన్ని నిరోధిస్తుంది.
యాంటీ-డాండ్రఫ్ షాంపూ:
చుండ్రును నియంత్రించడానికి యాంటీ డాండ్రఫ్ షాంపూలు చక్కగా పని చేస్తాయి. తరచుగా షాంపూ వాడుతూ నెత్తిని శుభ్రంగా ఎప్పటికప్పుడు చుండ్రు తొలగిపోయేలా చేసుకుంటే రోజంతా ఈ సమస్య వేధించదు.
- వదులుగా ఉండే దుస్తులు ధరించాలి.
- సింథటిక్ బట్టలు ధరించడం మానుకోవాలి. ఎందుకంటే అవి తేమను బయటకు వెళ్లకుండా బంధించి చర్మాన్ని చికాకు పెడతాయి.
- బట్టలను వేడి నీటితో ఉతుక్కోవాలి.
- దురద వస్తే అదే పనిగా గోకడాన్ని నివారించాలి.
- శరీరంపై దద్దుర్లు కనిపిస్తే వాటిని స్క్రాచ్ చేయవద్దు. దీని వల్ల పరిస్థితి మరింత దిగజారుతుంది.
- దురద నుంచి ఉపశమనం కోసం కోల్డ్ కంప్రెస్ ను వాడాలి.
- వాపు, దురద తగ్గించుకోవడానికి ఓవర్ ది కౌంటర్ యాంటిహిస్టామైన తీసుకోవాలి.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications











