అందం కోసం ఖరీదైన క్రీములే వాడాలా? చాక్లెట్లు తింటే మొటిమలు వస్తాయా? ఇవన్నీ అపోహలా.. నిజాలా..

అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. దీనికి పురుషలకు, స్త్రీలు అనే తేడా అవసరం లేదు. మంచి ముఖం, ఆరోగ్యవంతమైన చర్మం, అందంగా, ఆకట్టుకునేలా, ముఖం కళగా కనిపించాలని అందరూ కోరుకుంటారు. అందుకోసం రకరకాల క్రీములు, లోషన్లు, ఫేస్ మాస్కులు కూడా వాడుతుంటారు. మహిళలు మరింత ఎక్కువగా వివిధ రకాల ఉత్పత్తులు వాడుతుంటారు.

Myths vs Facts About Skincare; Skincare myths and facts In Telugu

కొందరు ఖరీదైన క్రీములు వాడితేనే అందంగా కనిపిస్తారని, నాసిరకమైన ఉత్పత్తులకు అందం రాదని అంటారు.. అలాగే ముఖం మురికిగా ఉండటం వల్లే మొటిమలు వస్తాయంటారు.. ఇలాంటి చాలా మంది నమ్ముతుంటారు. మరి అసలు నిజాలేనా లేదా అపోహలా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.


1. ఖరీదైన క్రీములే వాడాలి, అప్పుడే స్కిన్ 'యంగ్'గా ఉంటుంది!

ఖరీదైన క్రీములే వాడాలని చాలా మంది అనుకుంటారు. మరికొంది అయితే ఖరీదైన క్రిములు వాడితేనే ముఖం అందంగా కనిపస్తుందని, స్కిన్ యంగ్‌గా ఉంటుందని కూడా అంటారు. అయితే ఎంత ఖరీదైన క్రీములు వాడినప్పటికీ ముఖం చర్మం వయస్సు తగ్గించడం సాధ్యం కాదు. అది కేవలం స్కిన్ క్రీము పరిశ్రమల మార్కెటింగ్ జిమ్మిక్కు మాత్రమే అంటున్నారు వైద్యులు. సమతుల్యమైన ఆహారం, చర్మ రక్షణ పద్ధతుల ద్వారా కొంత వరకు అందాన్ని కాపాడుకోవచ్చు. కానీ స్కిన్ వయస్సును తగ్గించుకోలేం. అలాగే ఖరీదైన వాటినే వాడాలన్నది కూడా కరెక్టు కాదు. అయితే ఉత్పత్తులు తీసుకునే ముందు అందులో ఏయే మోతాదులో రసాయనాలు వాడారో చూసుకోవడం కీలకం.


2. నీరు తాగితే చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవచ్చు!

ఇది కూడా పూర్తిగా నిజం కాదని అంటున్నారు వైద్య నిపుణులు. చర్మం శరీరంలోని అతిపెద్ద అవయవం. శరీరం అంతటిని కాపాడే కవచం. దుమ్ము ధూళి నుంచి, సూర్యరశ్మి నుంచి చర్మమే రక్షణ కల్పిస్తుంది. అయితే హీట్ స్ట్రోక్, తీవ్ర డీహైడ్రేషన్ వంటి విపరీతమైన సందర్భాల్లో తప్ప తాగు నీరు చర్మాన్ని నేరుగా ప్రభావితం చేస్తుంది అనడానికి ఎలాంటి ఆధారాలు లేవని వైద్యులు చెబుతున్నారు.


3. యాంటీ బ్యాక్టీరియల్ సోప్ చర్మాన్ని ఉత్తమం!

ఇది కేవలం అపోహ మాత్రమే. చర్మం యొక్క సహజ మైక్రోబయోమ్ ఆరోగ్యకరమైన చర్మాన్ని నిర్వహించడానికి చాలా ముఖ్యమైనది. యాంటీ బ్యాక్టీరియల్ సబ్బులను ఉపయోగించడం వల్ల ఆ సహజ సమతుల్యత దెబ్బతింటుంది అని చర్మ సంబంధిత నిపుణులు చెబుతున్నారు. అవి pH న్యూట్రల్ సబ్బుల కంటే చర్మంపై కఠినంగా ఉంటాయని అంటున్నారు. బ్యాక్టీరియాలో మంచివి, చెడువి ఉంటాయి. మంచి బ్యాక్టీరియాను కూడా తొలగించడం వల్ల నష్టమే తప్ప లాభం ఏమీ ఉండదని చెబుతున్నారు.


4. చాక్లెట్లు తింటే మొటిమలు వస్తాయి!

చాక్లెట్లు తింటే మొటిమలు వస్తాయని నమ్మడం అపోహే. చాక్లెట్లు తినడం వల్ల మొటిమలు వస్తాయన్నది ఎక్కడా నిరూపితం కాలేదని వైద్యులు చెబుతున్నారు.


5. సూర్యరశ్మి చర్మానికి హానికరం!

సూర్యరశ్మి వల్లే విటమిన్ డి అందుతుంది. ఇది ఎముక ఆరోగ్యానికి ముఖ్యం, రోగనిరోధక వ్యవస్థలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అయితే సూర్యుని యూవీ కిరణాల వల్ల చర్మానికి హాని జరుగుతుంది అనేది మాత్రం నిజం. అందుకే సూర్యోదయం సమయంలో లేదా సూర్యాస్తమయం సమయంలో లేలేత కిరణాలు మంచివని వైద్యులు చెబుతున్నారు.

Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.

Story first published: Friday, July 14, 2023, 19:54 [IST]
Desktop Bottom Promotion