Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
చర్మ సౌందర్యానికి రాగి..ఇంట్లోనే ఇలా చేస్తే సహజ మెరుపు గ్యారెంటీ!
మిల్లెట్స్ లో ఒకటైన రాగులు మన ఆరోగ్యానికి చేలు మేలు అంతా ఇంతా కాదు. ఇవి పోషక విలువలు కలిగిన తృణధాన్యాలు.. రాగిని ఆహారంలో చేర్చడం ద్వారా ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయి. రాగులు కాల్షియం, ఐరన్, ఫైబర్, ప్రోటీన్, విటమిన్ బి వంటి పోషకాలకు గొప్ప మూలం. ఇందులో ఇతర తృణధాన్యాల కంటే ఎక్కువ కాల్షియం ఉంటుంది, ఇది ఎముకల ఆరోగ్యానికి చాలా అవసరం. రాగుల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. రాగులు అధిక రక్తపోటుతో బాధపడేవారికి మంచి టానిక్ లా పనిచేస్తాయి.
అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా రాగి అందిస్తుంది. సహజ మార్గాల్లో చర్మ సంరక్షణను కోరుకునే ప్రతి ఒక్కరికీ రాగి ఉత్తమమైన ఆప్షన్. రాగులను చర్మానికి కూడా ఉపయోగించవచ్చు. రాగి ఫేస్ ప్యాక్ చర్మానికి అనేక విధాలుగా సహాయపడుతుంది. రాగిలో యాంటీఆక్సిడెంట్లు, ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉండటంతో చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచి సహజమైన మెరుపుని అందిస్తాయి. ప్రత్యేకంగా రాగి పొడిని ఫేస్ ప్యాక్‌గా ఉపయోగించడం వల్ల మొటిమలు, మచ్చలు, చర్మం ఎండిపోవడం వంటి సమస్యలు తగ్గించుకోవచ్చంట.

రాగుల్లో యాంటీమైక్రోబయల్ లక్షణాలు మొటిమలను తగ్గించడంలో సహాయపడతాయి. రాగుల్లోని విటమిన్లు,ఖనిజాలు చర్మం మచ్చలను తగ్గించడంలో సహాయపడతాయి. రాగుల్లోని యాంటీఆక్సిడెంట్లు చర్మంపై ముడతలను తగ్గించడంలో సహాయపడతాయి. రాగుల్లోని ఫైబర్ చర్మం తేమను నిలుపుకోవడానికి సహాయపడుతుంది.
రాగి ఫేస్ ప్యాక్ ని ఇంట్లోనే ఎలా తయారుచేసుకోవాలి
రాగి ఫేస్ ప్యాక్ తయారీ కోసం 2 టేబుల్ స్పూన్లు రాగి పొడి, 1 టేబుల్ స్పూన్ తేనె, 1 టేబుల్ స్పూన్ పెరుగు, కొద్దిగా నిమ్మకాయ రసం కలిపి మెత్తగా పేస్ట్ చేయాలి. దీన్ని ముఖానికి అప్లై చేసి 15-20 నిమిషాల పాటు అలా వదిలేయాలి. తర్వాత గోరువెచ్చని నీటితో మృదువుగా కడిగితే చర్మం కాంతివంతంగా మారుతుంది.
రాగి ఫేస్ ప్యాక్ వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే
రాగి ఫేస్ ప్యాక్ మృతకణాలను తొలగించడంతో పాటు చర్మాన్ని మృదువుగా మార్చే సహజ ఎక్స్‌ఫోలియంట్‌గా పనిచేస్తుంది. రాగిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు ముడతలను తగ్గించి, యవ్వనాన్ని కాపాడతాయి. అంతేకాకుండా ఇది చర్మానికి తగినంత తేమను అందించి పొడిబారకుండా ఉంచుతుంది. చర్మాన్ని సహజంగా మెరుగుపర్చుకోవాలను కునేవారు రాగిని ఫేస్ ప్యాక్‌గా మాత్రమే కాకుండా తమ రోజువారీ ఆహారంలో భాగంగా కూడా తీసుకుంటే మరింత మెరుగైన ఫలితాలు పొందవచ్చు. రాగిని ఆహారంలో చేర్చడం ద్వారా కూడా చర్మ కాంతి పెరుగుతుంది. రాగి గంజి, రాగి దోస, రాగి చపాతీల వంటి ఆహార పదార్థాలు శరీరానికి అవసరమైన పోషకాలను అందించి చర్మాన్ని ఫ్రెష్ గా ఉంచుతాయి.
రాగి ఫేస్ ప్యాక్ ను వారానికి 2-3 సార్లు ఉపయోగించవచ్చు. అయితే మీకు రాగులు అలర్జీ ఉంటే ఈ ఫేస్ ప్యాక్ ను ఉపయోగించవద్దు. ఫేస్ ప్యాక్ ఉపయోగించే ముందు మీ చర్మానికి సరిపోతుందో లేదో తెలుసుకోవడానికి ఒక చిన్న ప్యాచ్ టెస్ట్ చేయడం బెటర్.



Click it and Unblock the Notifications