Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
రాత్రి పడుకునేముందు ఇది పూసుకోండి..ఐశ్వర్యరాయ్ లా మెరిసిపోతారు
చాలామంది పగలంతా ఎండ, దుమ్ము, ధూళి,మేకప్ వంటి అనేక సవాళ్లను ఎదుర్కొంటారు. వీటన్నిటి ప్రభావంతో సున్నితమైన చర్మం అలసిపోతుంది, నిర్జీవంగా మారుతుంది. అటువంటి సమయంలో దానికి విశ్రాంతి, పునరుజ్జీవనం, సరైన పోషణ చాలా అవసరం. మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు మన చర్మం తనను తాను మరమ్మత్తు చేసుకునే ప్రక్రియలో నిమగ్నమవుతుంది. ఈ టైంలో సరైన ప్రొడక్ట్స్ ని ఫేస్ కి అప్లై చేస్తే చర్మం సహజంగానే ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా తయారవుతుంది. మీరు ప్రతి రాత్రి సులభంగా అనుసరించగలిగే, అద్భుతమైన ఫలితాలనిచ్చే కొన్ని చిట్కాలను ఇక్కడ చూడండి.
ఫేస్ ఆయిల్
మీ చర్మం పొడిగా, నిర్జీవంగా, కొన్నిసార్లు పగుళ్లతో ఇబ్బంది పెడుతుంటే ఫేస్ ఆయిల్ వాడండి. జోజోబా ఆయిల్, బాదం ఆయిల్ వంటివి అద్భుతంగా పనిచేస్తాయి. ఇవి చాలా తేలికగా ఉండటమే కాకుండా చర్మంలోకి త్వరగా ఇంకిపోయి, జిడ్డుగా అనిపించకుండా చూసుకుంటాయి. రాత్రి పడుకునే ముందు కేవలం రెండు మూడు చుక్కల ఆయిల్ ని ముఖం,మెడపై సున్నితంగా మసాజ్ చేయండి. ఇది మీ చర్మానికి లోతైన తేమను అందించడమే కాకుండా క్రమంగా ముడతలను తగ్గించి చర్మానికి నవయవ్వనాన్ని అందిస్తుంది.

పచ్చి పాలు
మీ ముఖాన్ని శుభ్రపరచుకోవడానికి సహజమైన కాంతిని తీసుకురావడానికి పచ్చి పాలు ఇంకా అత్యంత ప్రభావవంతమైన మార్గం. ఒక దూది ఉండను పచ్చిపాలలో ముంచి దాంతో మీ ముఖం, మెడను శుభ్రంగా తుడుచుకోండి. సుమారు 10-15 నిమిషాల పాటు ఆరనిచ్చి ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయండి. ఇది చర్మంలో పేరుకుపోయిన మురికిని, మృతకణాలను సున్నితంగా తొలగిస్తుంది. చర్మాన్ని మృదువుగా, కోమలంగా మార్చి ప్రతిరోజూ మీ ముఖం మరింత తాజాగా, ప్రకాశవంతంగా కనిపించేలా చేస్తుంది.
కలబంద జెల్
కలబంద జెల్ దాదాపు అన్ని రకాల చర్మ తత్వాల వారికి సరిపోయే అద్భుతమైనది. దీని ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. రాత్రి ముఖం శుభ్రంగా కడుక్కున్న తర్వాత స్వచ్ఛమైన కలబంద జెల్ ను ముఖానికి, మెడకు పట్టించి రాత్రంతా అలాగే వదిలేయండి. ఇది చర్మానికి చల్లదనాన్ని అందించి ఎటువంటి చికాకు, దద్దుర్లు లేదా మొటిమల సమస్యలున్నా వాటిని తగ్గిస్తుంది. ఎండవల్ల కలిగే చర్మ సమస్యలను కూడా ఇది నివారిస్తుంది. దీనిని క్రమం తప్పకుండా వాడితే మీ చర్మం శుభ్రంగా మారి సహజసిద్ధమైన మెరుపు వస్తుంది.
అమ్మమ్మల నాటి అమృతం
మన అమ్మమ్మల కాలం నుండే కొబ్బరి నూనె చర్మ సౌందర్యానికి పెట్టింది పేరు. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చర్మాన్ని ఇన్ఫెక్షన్ల నుండి కాపాడతాయి. ఇది చర్మానికి లోతైన తేమను అందించి పొడిబారకుండా చేస్తుంది. రాత్రి పడుకునే ముందు కొద్దిగా కొబ్బరి నూనెను అరచేతిలో తీసుకుని, ముఖంపై సున్నితంగా మసాజ్ చేయండి. ఇది మీ చర్మాన్ని మృదువుగా మార్చడమే కాకుండా, దాని సువాసన మీకు మంచి నిద్ర పట్టడానికి కూడా సహాయపడుతుంది.
మచ్చలేని అందం కోసం
మీ ముఖం మీద మొటిమల తాలూకు మచ్చలు, పిగ్మెంటేషన్ లేదా ఇతర నల్లటి మచ్చలతో ఇబ్బంది పడుతుంటే విటమిన్ సి సీరం మీకు చాలా హెల్ప్ అవతుంది. ఇందులో చర్మాన్ని రిపేర్ చేసి, కొత్త కాంతిని నింపే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహించి, చర్మానికి బిగుత్వాన్ని అందిస్తుంది. రాత్రి ముఖం శుభ్రం చేసుకున్న తర్వాత కేవలం రెండు మూడు చుక్కల సీరంను ముఖంపై రాసి సున్నితంగా అద్దండి. ఉదయం లేచేసరికి మీ చర్మం మరింత ప్రకాశవంతంగా మారడాన్ని గమనిస్తారు.



Click it and Unblock the Notifications