Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
ఖరీదైన షాంపూ, ఆయిల్స్ అవసరం లేదు.. ఇదొక్కటి చేస్తే జుట్టు అరికాళ్ల వరకు పెరుగుతుంది!
ప్రస్తుత కాలంలో అన్ని వయసుల వ్యక్తులకు ఉన్న అతిపెద్ద, అతి ముఖ్యమైన సమస్య ఏదైనా ఉందంటే అది జుట్టు ఊడిపోవడం, బట్టతల రావడం. జుట్టు సమస్యల కారణంగా చాలా మంది మానసికంగా కూడా తీవ్రంగా కుంగిపోతుంటారు. అలాంటి వ్యక్తులు తమ జుట్టు ఆరోగ్యంగా ఉండేందుకు, కుదుళ్ళు బలంగా ఉండేందుకు సరైన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఇందులో భాగంగానే జుట్టును బలంగా మార్చుకునేందుకు చాలా మంది ఖరీదైన ఆయిల్స్, షాంపూలు, కండిషనర్లు వినియోగిస్తుంటారు. అయితే వీటితో పాటు జుట్టు బలంగా, మందంగా పెరిగేందుకు మసాజ్ చేయడం కూడా చాలా ముఖ్యమట. మసాజ్ చేయడం వలన జుట్టుకు అనేక విధాల ఉపయోగాలు ఉంటాయని చెబుతుంటారు. ఆ ఉపయోగాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కుదుళ్ళు బలంగా మారుతాయి
తలకు మసాజ్ చేయడం ద్వారా చాలా బెనిఫిట్ ఉంటుంది. అందులో ఒకటి కుదుళ్ళు బలంగా మారడం. అలాగే తల చర్మం మీద ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి. తద్వారా, జుట్టు పెరుగుదలకు అడ్డగించిన నూనెలు చర్మం లోపలికి చేరే అవకాశం ఉంటుంది. దీంతో కుదుళ్ళు బలంగా మారి, జుట్టు ధృడంగా తయారవుతుంది.

స్ట్రెస్ తగ్గించడం
కొబ్బరినూనె లేదా ఇతర నూనెలతో తల మసాజ్ చేయడం వల్ల స్ట్రెస్ తగ్గిపోతుంది. ఇది, జుట్టు కుదుళ్లను ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా, హెయిర్ ఫాల్‌ను తగ్గించి, మానసిక శాంతిని కలిగిస్తుంది. దీంతో ఎలాంటి పనులనైనా ప్రశాంతంగా చేసుకోవచ్చు. అలాగే ఆరోగ్యకరమైన జట్టు మీ సొంతం అవుతుంది.
పొడవాటి జుట్టు పెరుగుదల
తలపై మసాజ్ చేయడం వల్ల జుట్టు బాగా పెరుగుతుంది. ఎందుకంటే తలపై మసాజ్ చేయడం వల్ల హెయిర్ పోలికల్స్ బాగా బలపడతాయి. తద్వారా జుట్టు మందంగా, ఆరోగ్యంగా పెరుగుతుంది. దీంతో పాటు బలంగా తయారవుతుంది.
పొడవాటి జుట్టు
జుట్టు కుదుళ్లను క్రమంగా మసాజ్ చేస్తే, ఆరోగ్యకరమైన జుట్టును సాధించవచ్చు. అలాగే పొడవాటి జుట్టు మీ సొంతం అవుతుంది. మసాజ్ చేసేటప్పుడు ముఖ్యంగా కొబ్బరినూనె, ఆముదం, జోజోబా లేదా ఆర్గాన్ నూనెలు ఉపయోగించడం ఉత్తమం. ఇవి సహజ ఆయిల్స్ కావడంతో, జుట్టుకు విటమిన్లు, ఫ్యాటీ యాసిడ్స్ అందించి మంచి హైడ్రేషన్ అందిస్తాయి.
ఏ నూనె మంచిది?
కొబ్బరినూనె: ఇందులో ఉన్న కొవ్వు యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు జుట్టుకు మంచి హైడ్రేషన్ అందించి, స్ల్పిట్ ఎండ్ సమస్యను నివారిస్తుంది.
ఆముదం నూనె: రైసినోలిక్ యాసిడ్ వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది. జుట్టు పెరుగుదల కోసం అనుకూలంగా ఉంటుంది.
జోజోబా ఆయిల్: ఇది తలలో మాయిశ్చర్‌ను సమతుల్యం చేస్తుంది. చుండ్రు నివారణకు సహాయపడుతుంది.
ఆర్గాన్ ఆయిల్: ఇందులో ఉండే విటమిన్ E, ఫ్యాటీ యాసిడ్స్ జుట్టుకు సహజ మెరుపును కలిగిస్తాయి.
మసాజ్ ఎలా చేయాలి?
మసాజ్ సరిగ్గా చేయాలంటే, ముందుగా నూనెను గోరువెచ్చగా వేడి చేయాలి. తర్వాత, రెండు అరచేతుల్లో నూనె తీసుకుని, మృదువుగా కుదుళ్లను మసాజ్ చేయాలి. అధిక ఒత్తిడి చేయకుండా, నెమ్మదిగా, చేతి వేళ్లతో మసాజ్ చేయాలి. సర్క్యులర్ మోషన్‌లో, స్కాల్ప్‌పై నొక్కుతూ చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది. ఈ విధంగా పది నిమిషాలు మసాజ్ చేసిన తర్వాత, గోరువెచ్చని నీటిలో ముంచిన టవల్‌తో జుట్టును మూసుకొని, 30 నిమిషాలు ఉంచి, తర్వాత తలస్నానం చేయాలి. అంతే మంచి మసాజ్ సిద్ధమైనట్లే.



Click it and Unblock the Notifications