Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
జుట్టుకు ఆనియన్ సీరమ్ ఇలా అప్లై చేస్తే.. దృఢమైన, షైనీ జుట్టు మీ సొంతమవుతుంది
ఆహార అలవాట్లు, జీవన శైలి, వాతావరణ మార్పుల వల్ల జుట్టుపై విపరీతమైన ప్రభావం పడుతుంది. తగిన పోషణ లేక జుట్టు చిట్లిపోవడం, రాలడం, పొడిబారడం, పెలుసుగా మారడం లాంటి సమస్యలు వస్తాయి. జుట్టు అందంగా, లావుడా, దృఢంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ అలా ఉండాలంటే కొన్ని చిట్కాలు తప్పకుండా పాటించాలన్న విషయాన్ని మర్చిపోతుంటారు.
ఉల్లిపాయల్లోని పోషకాలు జుట్టును లావుగా, దృఢంగా తయారు చేస్తాయి. ఆనియన్ సీరమ్‌ను తయారు చేసుకుని జుట్టుకు పట్టిస్తే మంచి ఫలితం ఉంటుంది.

జుట్టు పెరుగుదలకు ఉల్లిపాయ సీరం ఎలా పని చేస్తుందంటే..
ఉల్లిపాయ రసంలో ఉండే పోషకాలు జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తాయి. ఇందులో సల్ఫర్, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, మినర్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలకు, జుట్టు ఆరోగ్యాన్ని మెరగుపరచడానికి సహాయపడతాయి. ఆనియన్ సీరమ్ హెయిర్ ఫోలికల్స్ కు పోషణ అందిస్తుంది. జుట్టును బలోపేతం చేయడం, తలపై రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అలాగే..
1. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది:
జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి ముందు జుట్టు రాలకుండా ఉండాలి. మొదట చేయాల్సిన పని జుట్టు రాలడాన్ని తగ్గించడం. యాంటీ మైక్రోబయల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలతో నిండిన ఉల్లిపాయ సీరమ్ ఇన్ఫెక్షన్లను దూరం చేస్తుంది. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. చుండ్రు లేదా స్కాల్ప్ ఇన్ఫెక్షన్ల వంటి సమస్యలను పరిష్కరించడానికి కూడా సహాయపడుతుంది. ఇది జుట్టు మూలాలను బలపరుస్తుంది. జుట్టు రాలడాన్ని, చిట్లిపోవడాన్ని తగ్గిస్తుంది.
2. జుట్టుకు మెరుపును అందిస్తుంది:
ఉల్లిపాయ సీరమ్ ను క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల జుట్టు మెరుపును సంతరించుకుంటుంది. జుట్టు నునుపుగా, అందంగా తయారవుతుంది. ఆనియన్ సీరమ్ జుట్టు షాఫ్ట్ యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది జుట్టును సున్నితంగా మారుస్తుంది.
3. స్కాల్ప్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది:
బిల్డింగ్ నిలబడటానికి పునాది ఎంత ముఖ్యమో.. జుట్టు ఆరోగ్యాన్ని స్కాల్ప్ అంత ముఖ్యం. ఆనియన్ సీరమ్ ను అప్లై చేసుకోవడం వల్ల స్కాల్ప్ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇందులో యాంటీమైక్రోబయల్ లక్షణాలు ఉంటాయి. ఇది స్కాల్ప్ ను శుభ్రంగా, బ్యాక్టీరియా, ఫంగస్ లేకుండా ఉంచడంలో సహాయపడుతుంది. చుండ్రు, దురద వంటి సమస్యలను నివారిస్తుంది.
4. జుట్టు పెరుగుదలలో సహాయపడుతుంది:
ఉల్లిపాయ సీరమ్ లో సల్ఫర్ పుష్కలంగా ఉంటుంది. కొల్లాజెన్ ఉత్పత్తికి అవసరం - జుట్టు పెరుగుదలను ప్రేరేపించడానికి అవసరమైన ప్రోటీన్ ఇది. ఇది హెయిర్ ఫోలికల్స్ ను పోషిస్తుంది. స్కాల్ప్ కు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.
ఆనియల్ సీరమ్ ఎలా తయారు చేసుకోవాలి:
1. ఉల్లిపాయ పొట్టు తీసేసి కట్ చేసుకోవాలి.
2. బ్లెండర్ లో వేసి పేస్ట్ లా తయారు చేసుకోవాలి.
3. కాటన్ క్లాత్ తీసుకుని అందులో ఉల్లిపాయ పేస్ట్ వేసి రసాన్ని వేరు చేసుకోవాలి.
4. ఆ రసంలో కొబ్బరి నూనె, ఆముదం, ఇతర నూనెలను కొన్ని చుక్కలు వేసుకోవాలి.
5. బాగా కలిపి వేరే డబ్బాలోకి తీసుకోవాలి.
6. మసాజ్ చేసుకుంటూ ఈ సీరమ్ ను జుట్టుకు అప్లై చేసుకోవాలి.
7. ఓ అరగంట తర్వాత నీటితో కడిగేసుకోవాలి.
8. ఉల్లిపాయ వాసన పోవడానికి తేలికపాటి షాంపూ వాడాలి



Click it and Unblock the Notifications