Latest Updates
-
బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకునేలా క్రిస్పీ సొరకాయ బజ్జీలు.. టీ, కాఫీలోకి ఆ మజానే వేరు.! -
రిలేషన్షిప్లో ఉన్నారా.. మీపై ఉన్నది ప్రేమా లేక వ్యామోహమా.. ఎలా తెలుసుకోవాలంటే.! -
టేస్టీ మంచూరియానే కాదు, కరకరలాడే అప్పాలు సైతం రెడీ.. క్యాబేజ్తో ఇలా ఈజీగా చేసేయండి.! -
ఈ సారి రెండు తేదీల్లో వరలక్ష్మీ వ్రతం.. మహిళలు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన వ్రత ప్రాముఖ్యత.! -
ప్రెగ్నెన్సీలో వీటి లోపంతోనే విపరీతమైన క్రేవింగ్స్.. వీటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలంటే.! -
కుబేర మొక్క.. మనీ ప్లాంట్ అనుకుంటే పొరపాటే.. ఇది మీ ఇంట్లో ఉంటే కనకవర్షమే.! -
పైన కరకరలాడుతూ, లోపల జ్యూసీగా.. పొరలు పొరలుగా వచ్చే బెల్లం ఖాజా మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
కరకరలాడే చికెన్ ముక్కలు, ఘాటైన మసాలా.. చెట్టినాడ్ చికెన్ పాప్కార్న్తో ఈవెనింగ్ సూపర్! -
పోషకాల గని ఈ బీట్ రూట్ ఉప్మా..మజ్జిగతో కలిపి ఇలా చేస్తే టేస్ట్ కేక! -
చుండ్రు వల్ల జుట్టు రాలిపోతోందా? అయితే మీరు తెలుసుకోవాల్సిన షాకింగ్ నిజాలు
Skin care: చలికాలంలో అందవిహీనమైన ముఖాన్ని ఇలా కాంతివంతం చేసుకోండి
ముఖంపై మొటిమలు పోవాలన్నా, చలికాలంలో అందవిహీనంగా మారిన చర్మాన్ని కాంతివంతంగా మార్చుకోవాలన్న వాటికి బొప్పాయి ఒక్కటే పరిష్కారం. ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు చేకూర్చే బొప్పాయి.. అందానికీ ఎంతో మేలు చేస్తుంది.
Skin care: అందంగా కనిపించాలని, మెరిసిపోవాలని ఏ అమ్మాయికి అయినా ఉంటుంది. అందుకే రకరకాల క్రీములు, లోషన్లు రాస్తుంటారు, పార్లర్లకు వెళ్లి ఫేషియల్స్ చేయించుకుంటారు. ముఖంపై చిన్న మొటిమ కనిపించినా విలవిల్లాడిపోతారు. ఆ మొటిమ పోయే వరకు తల్లడిల్లిపోతారు. కొందరైతే ముఖంపై మొటిమలు వస్తే ఇంటి నుండి బయటకు వచ్చేందుకు కూడా జంకుతారు. చలికాలం వచ్చిందంటే చర్మ సమస్యలు మరింత ఇబ్బంది పెడుతుంటాయి. ఇప్పటికే మొటిమలు ఇబ్బంది పెడుతుంటే చలికాలంలో చర్మం పొడిబారడం, పేలిపోవడం, కాంతిహీనంగా కనిపించడం వల్ల రకరకాల క్రీమలు రాస్తూనే ఉంటారు.

ముఖంపై మొటిమలు పోవాలన్నా, చలికాలంలో అందవిహీనంగా మారిన చర్మాన్ని కాంతివంతంగా మార్చుకోవాలన్న వాటికి బొప్పాయి ఒక్కటే పరిష్కారం. ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు చేకూర్చే బొప్పాయి.. అందానికీ ఎంతో మేలు చేస్తుంది.

బొప్పాయిని ఎలా వాడాలంటే..
* కప్పు బొప్పాయి గుజ్జుకి పాలల్లో రాత్రంతా నానబెట్టిన ఓట్స్ కలపాలి. అందులో కొద్దిగా తేనె వేసి మెత్తగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై ఫేస్ ప్యాక్ లా రాసుకోవాలి. ఇలా చేస్తే కాంతి కోల్పోయిన చర్మానికి కొత్త నిగారింపు వస్తుంది.
* పావు కప్పు బొప్పాయి గుజ్జుకు కోడి గుడ్డులోని తెల్లసొన కొద్దిగా కలపాలి. రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం జోడించాలి. ఈ మిశ్రమాన్ని ఫేస్ పై రాసుకుని 15 నిమిషాలు అయ్యాక గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా చేస్తే మెటిమలు, నల్ల మచ్చలు తొలగిపోతాయి.
* బొప్పాయి గుజ్జు లో రెండు టేబుల్ స్పూన్ల్ తులసి ఆకుల పొడి, కొద్దిగా తేనె కలిపి రోజూ ముఖానికి పెట్టుకోవాలి. 10 నిమిషాలు అయ్యాక చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేస్తే ముఖం కాంతివంతంగా అవుతుంది. చర్మ మృత కణాలు తొలగిపోతాయి.

* బొప్పాయి గుజ్జులో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి ముఖం మొత్తం అప్లై చేయాలి. కొద్ది సేపు అలాగే ఉంచి తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఈ మాస్క్ వల్ల చర్మం రంగు మారడం మాత్రమే కాదు, చర్మంలో మంచి కాంతి రూపుదిద్దుకొంటుంది. స్కిన్ టోన్ లైట్ చేసి, స్కార్ మార్క్స్ ను తగ్గిస్తుంది.
* ఈ మాస్క్ స్కిన్ టోన్ మార్చుతుంది మరియు డార్క్ స్పాట్స్ తగ్గిస్తుంది . బొప్పాయి జ్యూస్ ను టమోటో జ్యూస్ తో మిక్స్ చేసి ముఖం మొత్తం అప్లై చేయాలి. అరగంట తర్వాత శుభ్రం చేయడం వల్ల గ్లోయింగ్ అండ్ క్లియర్ స్కిన్ పొందవచ్చు.
* బొప్పాయి గుజ్జులో అవొకాడో పేస్ట్ చేర్చి ముఖానికి అప్లై చేయాలి. దీన్ని అప్లైచేయడంవల్ల చర్మానికి తగిన పోషణను అందిస్తుంది. చర్మం తేమగా ఉంటుంది. దాంతో చర్మం చూడటానికి మంచిగా ఉంటుంది . బొప్పాయి, అవొకాడోను మిక్స్ లో వేసి బ్లెడ్ చేసి, ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేసి కొద్ది సేపటి తర్వాత శుభ్రం చేసుకోవాలి.



Click it and Unblock the Notifications