Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
Pimple Patches: మొటిమలు ఇబ్బంది పెడుతున్నాయా? ఈ పింపుల్ ప్యాచెస్ వాడితే మచ్చలు పడకుండా తొలగిపోతాయి
చాలా మంది అమ్మాయిలు ఎదుర్కొనే సౌందర్య సమస్య మొటిమలు. ఒక వయస్సు వచ్చాకా చాలా మంది మొటిమలు వస్తుంటాయి. దీనికి ఆడ, మగ తో సంబంధం లేదు. అయితే అబ్బాయిలు పెద్దగా పట్టించుకోరు. కానీ అమ్మాయిలు ఒక్క మొటిమ వచ్చినా ఆందోళన పడిపోతారు. ఆ ఒక్క మొటిమ పోయేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.
మొటిమల సమస్య నుండి ఉపశమనం పొందేందుకు రూపొందించినవే పింపుల్ ప్యాచెస్. వీటిని వాడటం వల్ల మొటిమలు తొలగిపోవడంతో పాటు ఆ ప్రాంతంలో మచ్చలు కూడా ఏర్పడవు. అందుకే వీటికి చాలా క్రేజ్ వచ్చింది. ముఖంపై పింపుల్స్ కనిపిస్తే.. ఆ ప్రాంతంలో ఈ ప్యాచెస్ వాడితే మొటిమలు తొలగిపోతాయి.

పింపుల్ ప్యాచెస్ వల్ల ప్రయోజనాలు:
టార్గెటెడ్ ట్రీట్‌మెంట్ ఇస్తాయి:
పింపుల్ ప్యాచెస్ ను ఎక్కడ మొటిమలు వచ్చాయో అక్కడ అప్లై చేసుకుంటే సరిపోతుంది. పింపుల్ పై ఈ ప్యాచెస్ ను పెట్టుకోవడం వల్ల రక్షణ కల్పిస్తుంది. చికాకును తగ్గిస్తుంది. వేగంగా మొటిమలు తొలగిపోయేందుకు సహాయం చేస్తుంది.
అదనపు సెబమ్‌ను గ్రహిస్తుంది:
మొటిమల నుండి అదనపు సెబమ్(ఆయిల్) శోషించడానికి పింపుల్ ప్యాచెస్ రూపొందించార. ఇది వాపు, బ్యాక్టీరియా సంక్రమణ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వేగంగా రిజల్యూషన్, ఎరుపు, వాపు తగ్గిస్తుంది.
ఎక్స్‌టర్నల్ ఫ్యాక్టర్స్ నుండి రక్షిస్తుంది:
మొటిమలు.. ధూళి, బ్యాక్టీరియా, కాలుష్యక కారకాల వల్ల మొటిమలు మరింతగా పెరుగుతాయి. పింపుల్ ప్యాచెస్ వాడటం వల్ల అవరోధంగా ఏర్పడి రక్షణ కల్పిస్తాయి. కాలుష్యాన్ని నిరోధిస్తాయి. మచ్చల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
మొటిమలను దాచి పెడతాయి:
పింపుల్ ప్యాచెస్ మొటిమలను దాచిపెడతాయి. చర్మం రంగులో ఉండి పైకి పెద్దగా ఏర్పడవు. తాత్కాలిక సౌందర్య పరిష్కారంగా పింపుల్ ప్యాచెస్ పని చేస్తాయి.
పింపుల్ ప్యాచెస్ వల్ల ప్రతికూలతలు:
సిస్టిక్ పింపుల్స్ మీద ప్రభావాన్ని చూపవు:
చర్మంపై ఏర్పడిన మొటిమలకు పింపుల్ ప్యాచెస్ చక్కగా పని చేస్తాయి. అయితే చర్మం ఉపరితలం కింద ఏర్పడే సిస్టిక్ మొటిమలకు ఈ ప్యాచెస్ సమర్థవంతంగా పని చేయవు.
సెన్సిటివ్ స్కిన్‌పై చికాకు కలిగిస్తాయి:
పింపుల్ ప్యాచెస్ కొందరిలో అలర్జీని కలిగిస్తాయి. కొందరిలో వీటి వల్ల చికాకు వస్తుంది. పింపుల్ ప్యాచెస్ వాడకం వల్ల చికాకు, దురద, ఇతర సమస్యలు వస్తే వాటిని వాడకపోవడమే మంచిది.
ఓపెన్ లేదా పాప్డ్ మొటిమలు:
పింపుల్ ప్యాచెస్ ఓపెన్ లేదా పాప్డ్ మొటిమలపై ఉపయోగించేందుకు తయారు చేసినవి కావు. ఓపెన్ అయిన మొటిమలు, పాప్డ్ మొటిమలపై పింపుల్ ప్యాచెస్ అప్లై చేయడం వల్ల ఇన్ఫెక్షన్లు రావొచ్చు.



Click it and Unblock the Notifications