Latest Updates
-
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే!
రష్మికా మందన్నా.. స్టన్నింగ్ ఫ్యాషన్ ఐకాన్
Rashmika Mandanna రష్మిక మందన్నా సౌత్ టూ నార్త్ కాదు.. అంతకుమించిన స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయారు. పుష్ప సినిమాతో నేషనల్ క్రష్‌గా యూత్‌ను తనవైపు తిప్పుకున్న ఈ భామ సోషల్ మీడియాలో చాలా ఆక్టివ్. ఫ్యాషన్, బ్యూటీ సెన్స్‌లో ఇంకా యాక్టివ్. ఇన్‌స్టాలో 4.4 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారని ప్రత్యేకంగా మోటివేషన్ ఇవ్వదు కానీ, తన ష్యాషన్ స్టన్నింగ్ లుక్‌తో ప్రతిసారి వావ్ అనిపిస్తుంది. ఓన్లీ హీరోయిన్‌గా మాత్రమే కాదు.. ష్యాషన్ బ్యూటీగా తనదైన లుక్‌తో మెస్మరైజ్ చేసే రష్మిక నుంచి బోలేడంత ఫ్యాషన్, బ్యూటీ టిప్స్ తెలుసుకోవచ్చు. మరి అవేంటో చూసేద్దామా..

స్టన్నింగ్ లుక్ తో ర్యాంప్‌వాక్
ఢిల్లీలో జరిగిన ఇండియా కోచర్ వీక్ 2024లో రష్మిక మందన్న విక్కీ కౌశల్ తో కలిసి చేసిన ర్యాంప్ వాక్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ కార్యక్రమంలో రష్మిక మందన్న ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నడుము అందం చూపిస్తూ, క్లీ వేజ్ షో తో ఈ అమ్మడు చేసిన షోకి నెటిజన్స్ ఫిదా అవ్వక తప్పలేదు. అద్భుతమైన ఔట్ ఫిట్ తో రష్మిక కన్నుల విందు చేసింది.
సొంతూరి స్టైల్‌లో చీర కట్టిన రష్మిక
రష్మిక మందన్నా తన సొంతూరైన కొడుగులో మహిళలు ధరించే చీర కట్టు సంప్రదాయాన్ని చాటింది. తన స్నేహితురాలి పెళ్లిలో సందడి చేసిన సందర్భంగా సొంతూరి సంప్రదాయ దుస్తుల్లో ఎంతో ముద్దుగా కనిపించింది. మోడ్రన్ డ్రెస్సులే కాకుండా సంప్రదాయాన్ని, స్ధానిక ఆచారాలను పాటించడంలోనూ తన మార్క్ ను చాటుకుంటుంది ఈ ముద్దు గుమ్మ.
కన్నడ భామకు ముగ్దులైన కుర్రకారు
రష్మిక ఇటీవల కేరళలోని కరునాగపల్లిలో ఓ పబ్లిక్ ఈవెంట్‌కి హాజరైంది. ఆ ఈవెంట్ లో ఆమె ఆకుపచ్చ రంగు చీరలో లేటెస్ట్ ఫ్యాషన్ ట్రెండ్ తో కలగలిపిన రీతిలో అందంగా ముస్తాబైంది. అద్భుతమైన స్లీవ్లెస్ బ్లౌస్ డిజైన్ తో, బన్ హెయిర్ స్టైల్ కు అదనంగా రోజా పూలను ధరించి డిఫెరెంట్ లుక్ లో కనిపించారు. తన డిఫెరంట్ స్టైల్ తో ఇటు అభిమానులను, అటు ఫ్యాషన్ ప్రియులను తన వైపు తిప్పుకోవడమే కాకుండా వరుస సినిమా అవకాశాలను సొంతం చేసుకుంటుంది.

బ్యూటీ విత్ ట్రావెల్ లవ్
ఈ భామ Travel+Leisure ట్రావెల్ మ్యాగజైన్ కోసం ఫొటోషూట్‌లో పాల్గొన్నది. మీగన్ కాన్సెస్సియో డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్‌లో హొయలు పోయింది. పసుపు బ్రాలెట్స్‌లో పర్‌ఫెక్ట్ సమ్మర్ ఔట్‌ఫిట్‌లో దివి నుండి తారక దిగి వచ్చిందా..? అన్నట్టుగా కనువిందు చేస్తోంది. రష్మిక ఇప్పటికే ఇదే మ్యాగజైన్ కోసం అనైటా ష్రాఫ్ డిజైనింగ్ బ్లాక్ బికినీ వేర్‌లో బీచ్‌లో హాట్ హాట్ ఫోజులిచ్చింది.
ఫోర్బ్స్ ఇండియా అండర్ 30 జాబితాలో చోటు
కన్నడ భామ రష్మిక.. ఫోర్బ్స్ ఇండియా అండర్ 30 జాబితాలో సైతం చోటు దక్కించుకుంది. 2024 యంగ్ డిస్ట్రప్టర్స్, ట్రైల్‌బ్లేజర్స్ కేటగిరిలో ఈ భామ చోటు దక్కించుకుంది. ఇందులో యువ వ్యాపార వేత్తలు, ఆవిష్కరణ కర్తలు, క్రీడాకారులు, సంగీతం, సమాజసేవ, ఇంధనం, ఆర్థిక, మీడియా, న్యాయ, వినోదం, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫ్యాషన్ ఇలా పలు రంగాల్లో విశేష కృషి చేస్తున్న వారిని గుర్తించి జాబితాను సిద్ధం చేస్తుంది. ఈ జాబితాలో రష్మిక అగ్రస్థానంలో నిలిచింది.



Click it and Unblock the Notifications