Latest Updates
-
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే!
పాతికేళ్లకే బట్టతల రాకుండా ఉండాలంటే.. ఉదయాన్నే ఈ పని చేస్తే సరిపోతుంది!
నేటి కాలంలో చాలా మంది టీనేజర్లు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యల్లో ఒకటి బట్టతల. చిన్న వయసులోనే జుట్టు రాలిపోవడంతో బట్ట తల వచ్చేస్తోంది. జుట్టు రాలిపోవడం వల్ల చాలా మంది మానసిక సమస్యలకు గురవుతున్నారు. అలాగే చిన్న వయసులోనే యువకుల్లో ఆత్మవిశ్వాసం కూడా తగ్గిపోతుంది. కాలుష్యం, జన్యు పరమైన సమస్యల కారణంగా జుట్టు వేగంగా రాలిపోతుంటుంది. అయితే జుట్టు రాలకుండా ఉండడానికి ఉదయాన్ని కొన్ని టిప్స్ పాటించడంతో పాటు కొన్ని రకాల ఆహార పదార్థాలు తినడం వల్ల ఆ సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. ఆ టిప్స్ ఏంటో ఇక్కడ తెలుసుకోండి.
జుట్టు ఎందుకు రాలిపోతుందంటే?
చిన్న వయసులోనే జుట్టు రాలిపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. జన్యుపరమైన కారణాలు, ఒత్తిడి, విటమిన్స్ లోపం, అధిక ఒత్తిడి, కాలుష్యం, ఔషధాల వినియోగం వంటివి కారణం కావచ్చు. డైహైడ్రోటెస్టోస్టెరాన్ అనే హార్మోన్ అధికంగా స్రవించడం వల్ల జుట్టు అనేది పలచబడి రాలిపోతుంటుంది. ఈ హార్మోన్ జుట్టు పెరుగుదలను అడ్డుకొని చిన్న తనంలోనే బట్టతల వచ్చే విధంగా చేస్తుంది. అందుకే ఈ కింది ఆహార పదార్థాలు, ఉదయాన్నే చిన్న టిప్స్ పాటించాలి. అవేంటంటే?

బాదం
బాదం పప్పులో విటమిన్ ఈ పుష్కలంగా ఉంటుంది. ప్రతిరోజూ ఉదయాన్నే బాదం పప్పు తింటే.. శరీరానికి కావాల్సిన విటమిన్ ఈ దొరుకుతుంది. ఇది అద్భుతమైన యాంటీ యాక్సిడెంట్‌గా పని చేస్తుంది. ఇది జుట్టు మూలాలను బలపరుస్తుంది. తద్వారా జుట్టు రాలిపోవడాన్ని నివారిస్తుంది. దీంతో పాటు డైహైడ్రోటెస్టోస్టెరాన్ అనే హార్మోన్ అధిక స్రావాన్ని నిరోధిస్తుంది.
గుడ్డు
గుడ్డులో ప్రోటీన్, బయోటిన్, సల్ఫర్, విటమిన్ ఏ, డీ పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు ఎదుగులకు సంబంధించిన పోషకాలను అందిస్తుంది. గుడ్డులోని ప్రోటీన్ జుట్టు ఎదుగుదలకు కావాల్సిన కేరాటిన్ అందిస్తుంది. అలాగే ఇందులోని గుడ్డు పచ్చసొనలోని బయోటిన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మరగవారిలో బట్ట తలకు కారణమయ్యే హార్మోన్‌ను నియంత్రిస్తుంది. అందుకే జుట్టు రాలిపోవడాన్ని నివారించడానికి రోజుకూ రెండు గుడ్లు తింటే సరిపోతుంది.
ఆకుపచ్చ కూరగాయలు
జుట్టు సరిగ్గా పెరగడానికి, జుట్టు రాలిపోకుండా ఉండడానికి సరైన రక్తప్రసరణ అవసరం. అందుకే సరైన రక్తప్రసరణ కోసం ఆకు కూరలు తినాల్సి ఉంటుంది. ఆకు కూరల్లో ఐరన్, విటమిన్ ఏ, విటమిన్ సీ, ఫోలేట్, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఎర్ర రక్త కణాల పెరుగుదలకు ఉపయోగపడతాయి. జుట్టు మూలలకు పోషకాలు అందజేసి జుట్టు ధృడంగా, ఒత్తుగా పెరిగేందుకు సహాయపడతాయి. అలాగే బట్టతలను ప్రేరేపించే హార్మోన్లను నిరోధిస్తుంది.
కొబ్బరి నూనె
ప్రతి ఒక్కరూ తమ జుట్టుకు కొబ్బరి నూనెనే రాసుకుంటూ ఉంటారు. అయితే ప్రతిరోజూ ఉదయాన్ని ఖాళీ కడుపుతో కొబ్బరి నూనె తాగడం వల్ల జుట్టు రాలిపోయే సమస్య దూరం అవుతుంది. కొబ్బరి నూనెలోని లారిక్ ఎమినో యాసిడ్ బట్టతల రాకుండా దూరం చేస్తుంది. అలాగే ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు స్కాల్ప్ ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. అలాగే జుట్టు పెరుగుదలను ప్రేరేపించి జుట్టు ధృడంగా, ఒత్తుగా తయారవుతుంది.



Click it and Unblock the Notifications