Latest Updates
-
దసరా నాడు అపరాజితా దేవి పూజ ఎలా చేయాలి? శుభ ముహూర్తం, మంత్రాలు, శమీ పూజ డీటెయిల్స్.. -
దసరా స్పెషల్ రెడ్ చికెన్.. చికెన్ కర్రీ వండేటప్పుడు ఈ సీక్రెట్ మసాలా వేస్తే టేస్ట్ నెక్ట్స్ లెవల్ అంతే! -
హ్యాపీ విజయదశమి 2026..మీ బంధుమిత్రులకు దసరా విషెస్ చెప్పండిలా.. -
దసరా స్పెషల్..పాకం పట్టే పనిలేకుండా ఈజీగా బెల్లం గవ్వలు చేసుకోండిలా..గుల్ల గుల్లగా భలే రుచిగా.. -
గోధుమ రవ్వ vs బొంబాయి రవ్వ..షుగర్ పేషెంట్ల ఆరోగ్యానికి ఏ ఉప్మా మంచిది? -
మిగిలిపోయిన అన్నంతో హోటల్ స్టైల్ క్రిస్పీ వడలు.. -
కర్ణాటక స్పెషల్ మసాలా చిత్రాన్నం..కేక ఉంటది ట్రై చెయ్..లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్ -
సొంత డబ్బులతో స్కూల్ అభివృద్ధి చేసిన హెడ్ మాస్టర్..నోటీస్ పంపి,ట్రాన్స్ ఫర్ చేసిన గవర్నమెంట్! -
ఎండుమిర్చి టమాటో రోటి పచ్చడి..ఇలా చేశారంటే కంచంలో వేరే కూరలు వద్దనేస్తారు! -
ఆదివారం స్పెషల్..స్పైసీ, జ్యూసీ చిట్టిముత్యాల కోడి పులావ్..ఆ ఒక్కటి పడితే తిరుగులేని టేస్ట్!
జుట్టు పొడవుగా మరియు ఒత్తుగా పెరగడానికి సహాయపడే ఆహారాలు
ప్రస్తుతం ఎక్కువ మందిని వేదిస్తున్న సమస్య జుట్టు సమస్యలు. వాటిలో ముఖ్యంగా జుట్టు రాలడం లేదా ఆరోగ్యంగా జుట్టు పెరగకపోవడం. ఈ రెండూ సమస్యలను చాలా మంది ఎదుర్కొంటున్నారు. జుట్టు ఆరోగ్యంగా పెరగాలంటే అందుకు తగిన పోషణను అందివ్వాలి. జుట్టు గురించి తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల జుట్టు రాలడం మరియు జుట్టు పల్చగా మారడం వంటి సవాళ్లను ఎదుర్కొవల్సి వస్తుంది.ఇక కొన్ని ప్రత్యేక సందర్బాల్లో మీ పరిస్థితి చేయి దాటినప్పుడు తప్పనిసరిగా డెర్మటాలజిస్టులను కలవాలి.
అద్రుష్టవశాత్తు, మన వంటగదిలోనే కొన్ని హోం రెమెడీస్ ఉన్నాయి. ఇవి జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి అవసరమయ్యే బలాన్ని అందివ్వడంతో పాటు జుట్టును ప్రకాశవంతంగా మార్చుతాయి. అందుకు మన వంటగదిలో ఉండే కూరలు బాగా సహాయపడుతాయి. ఇవి మనం నిత్యం మన వంటల్లో ఉపయోగించేవి కాబట్టి, అదనంగా బ్యూటీ ఉత్పత్తుల కోసం డబ్బు ఖర్చుచేయాల్సిన అవసరం లేదు.

పోషకాలు సమృద్ధిగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల జుట్టు పెరుగుతుంది మరియు జుట్టు రాలడాన్ని నియంత్రిస్తుంది. సహజంగా లభించే కొన్ని ఆహారాలు జుట్టు మూలాలకు అద్భుతమైన పోషకాలను అందించడమే కాకుండా, చుండ్రు, తెల్ల జుట్టు, జుట్టు రాలడం మొదలైనవాటిని తొలగించడం ద్వారా జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి. ఈ కథనంలో జుట్టు పెరుగుదలకు సహాయపడే ఆహారాలను చూద్దాం...
గుడ్డు
గుడ్లలో ప్రోటీన్ మరియు బయోటిన్ పుష్కలంగా ఉంటాయి, ఇవి జుట్టుకు ఆరోగ్యకరమైన పోషకాలు.
కారెట్
కుంకుమపువ్వు రంగులో ఉండే క్యారెట్లు కళ్లకే కాదు జుట్టుకు కూడా మేలు చేస్తాయి. ఇందులోని విటమిన్ ఎ కంటెంట్ జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
స్వీట్ పొటాటో
స్వీట్ పొటాటో బీటా కెరోటిన్ పుష్కలంగా లభిస్తుంది. ఇది శరీరంలోకి ప్రవేశించినప్పుడు, ఇది విటమిన్ ఎగా మారుతుంది. విటమిన్ ఎ జుట్టు సమస్యను నయం చేస్తుంది.
మొలకెత్తిన శెనగలు
మొలకెత్తిన శెనగలు దాదాపు గుడ్లలో ఉన్నంత ప్రోటీన్ ఉంటుంది. ఇవి శరీర ఆరోగ్యాన్ని మరియు జుట్టు ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి.
పాలకూర
ఆకుకూరల్లో అత్యంత ఆరోగ్యకరమైనదిగా పేరొందిన పాలకూరలో ఐరన్, విటమిన్ ఎ, విటమిన్ సి వంటి పోషకాలు వెంట్రుకల పెరుగుదలకు తోడ్పడతాయి.
బ్రౌన్ రైస్
బ్రౌన్ రైస్ గంజిలో ప్రొటీన్లు, విటమిన్లు మరియు ఫైబర్ పోషకాలు పుష్కలంగా ఉంటాయి, ఇవి జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి.



Click it and Unblock the Notifications
