Latest Updates
-
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్‌లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా..
వంట గదిలో దొరికే ఈ వస్తువును వాడితే.. మీరు తెల్లగా మెరిసిపోతారు! చర్మంపై మొటిమలు కూడా రావు!
మెరిసే చర్మంతో అందంగా కనిపించాలని ఎందుకు ఉండదు చెప్పండి. సమాజంలో వెళ్ళేటప్పుడు అందంగా కనిపిస్తేనే కదా గుర్తింపు లభించేది. అందుకే చాలా మంది అందంగా కనిపించేందుకు నానా రకాల క్రీమ్స్, డిఫరెంట్ డిఫరెంట్ స్కిన్ కేర్ వినియోగిస్తూ ఉంటారు. ఇవి చాలా ఖర్చుతో కూడుకున్నవి. అదే సమయంలో ఆరోగ్యానికి కూడా కొంతమేర హాని చేస్తాయి. అయితే మెరిసే చర్మంతో పాటు అందంగా కనిపించాలంటే వంటింట్లో ఉండే వస్తువుతోనే సాధ్యమవుతుంది. అదే కొత్తిమీర. కొత్తిమీరలో చర్మానికి మేలు చేసే ఎన్నో గుణాలు దాగి ఉన్నాయి.
కొత్తిమీర వినియోగిస్తే చాలు ఖరీదైన క్రీమ్స్ కూడా ఇవ్వలేని చర్మ సౌందర్యం మీ సొంతం అవుతుంది. ఈ కొత్తిమీరను ఎలా వినియోగించాలి? కొత్తిమీరతో ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి? ముఖానికి కొత్తిమీరను ఎలా రాసుకోవాలి అనేది ఈస్టోరీలో తెలుసుకుందాం.

కొత్తిమీర వల్ల కలిగే ప్రయోజనాలు
కొత్తిమీరతో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. దీంతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్‌ఫ్లమేటరి గుణాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఈ లక్షణాలు చర్మానికి వచ్చే ఎన్నో రకాల సమస్యల నుంచి రక్షణ కల్పిస్తాయి. ఇవి చర్మాన్ని హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ తొలిగించడంతో పాటు చర్మాన్ని మృదువుగా, మెరిసే విధంగా తయారు చేస్తాయి.
కొత్తిమీరతో ఉండే విటమిన్ సీ.. పిగ్మెంటేషన్‌ను తగ్గిస్తుంది. దీని ద్వారా చర్మంపై ఉండే మొటిమలు, మచ్చలు తొలిగిపోతాయి. అలాగే డార్క్ సర్కిల్స్‌ను తొలిగిపోయి చర్మం కాంతివంతంగా మారుతుంది. ఇందులో యాంటీ ఏజింగ్ లక్షణాలు కూడా ఉన్నాయి. ఇవి చర్మాన్ని బిగుతుగా మార్చి.. వయసును నియంత్రించేందుకు సహాయపడతాయి. కొత్తిమీరలో ఉండే నీటితో ఇవి చర్మం ఎప్పుడూ పొడిబారకుండా చేస్తుంది. చర్మం ఎప్పుడూ కాంతి వంతంగా, తాజాగా కనిపిస్తుంటుంది.
కొత్తిమీరను ఎలా వాడాలి?
ఇన్ని ఉపయోగాలు ఉన్న కొత్తిమీరను వివిధ పద్ధతుల్లో వాడుకోవచ్చు. కొత్తిమీరను రుబ్బుకొని అందులో తేనె లేదా పెరుగు కలుపుకొని, ఒక క్రీం మాదిరిగా చేసుకొని ముఖానికి రాసుకోవాలి. అది ఆరిపోయాక చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే చర్మం కాంతివంతంగా మారిపోతుంది. అలాగే చాలా మృదువుగా, అందంగా తయారవుతాయి.
కొత్తిమీరను నీటిలో మరిగించి, ఆ నీటితో ముఖాన్ని కడుక్కోవడం వల్ల చర్మం టోన్ అవుతుంది. చర్మం తాజాగా కాంతివంతంగా కనిపిస్తుంది. పచ్చి కొత్తిమీరను పంచదారతో కలిపి స్క్రబ్ మాదిరిగా తయారు చేసుకోవచ్చు. దీనిని ముఖంపై స్క్రబ్ చేయడం వల్ల.. చర్మంపై ఉండే డెడ్ సెల్స్ తొలిగిపోయి, చర్మం ఎక్సోఫోలియెట్ అవుతుంది. తద్వారా చర్మం చాలా అందంగా కనిపిస్తుంది.
అలాగే కలబంద గుజ్జుతో కొత్తిమీరను కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. దానితో ఒక మాస్క్ తయారు చేసుకొని ముఖానికి పెట్టుకోవాలి. సుమారు ఇరవై నిమిషాల పాటు ఉంచుకొని తరువాత ముఖాన్ని నీటితో శుభ్రం చేసుకుంటే చర్మం మృదువుగా తయారవుతుంది. కొత్తిమీర చాలా తక్కువ ధరలో దొరకడంతో చర్మ సౌందర్యం అతి తక్కువ ధరలోనే మనకు అందుబాటులోకి వచ్చేస్తుంది.
కొత్తిమీరతో ఈ ప్రయోజనాలు పలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాని ఆధారంగా మీకు ఈ కథనం అందించబడింది. దీనిని పాటించే ముందు కొంత రీసెర్చ్ చేసి వినియోగించండి.



Click it and Unblock the Notifications