‘పెరుగు’వాడకం మంచిదేనా..?

Beauty With Curd
మనం తీసుకునే రోజు వారి ఆహారంలో పెరుగు లేక మజ్జిగ క్రమం తప్పకుండా ఉండాల్సిందే. పలు రకాలు పోషక విలువులు దాగివున్న పెరుగు ఆరోగ్యానికి దోహదపడుంది, మరి అదే పెరుగును చర్మ సంరక్షణకు ఉపయోగించవచ్చా..? భేషుగ్గా ఉపయోగించవచ్చంటున్నారు సౌందర్య నిపుణులు. మరి వారు చెబుతున్న సూచనలు పాటిద్దామా..

పెరుగులో నిమ్మరసం కలిపి ముఖానికి, మెడకు, చేతులకు పట్టించి ఓ 20 నిమిషాలు తరవాత చల్లని నీటితో కడిగితే శరీరం, చర్మం మృదువుగా మారి కాంతివంతం అవుతుంది. పెరుగులో కాస్త పచ్చి పసుపును వేసి, కళ్ల చుట్టూ ఉండే నల్లటి వలయాల పై రాస్తే నలుపుదనం తగ్గుతుంది. ఎండలోంచి నీడలోకి వెళ్లగానే పెరుగులో ఐస్ క్యూబ్ లు వేసి ఆ మిశ్రమంతో ముఖానికి మసాజ్ చేస్తే ఎండకు కమిలిన చర్మానికి ఉపశమనం లభిస్తుంది.

తలస్నానం చేసేందుకు ఓ గంట ముందుగా తలకు పెరుగును బాగా పట్టించి తల స్నానం చేసినట్లయితే. మళ్లి విడిగి కండీషనర్ ఉపయోగించాల్సిన అవసరం లేదు. అలాగే పెరుగులో తేనెను కలిపి పూసినా చక్కని కండీషనర్ లా ఉపయోగపడుతుంది. పెరుగులో శనగపిండని కలిపి, నలుగు పిండిలా శరీరానికి పట్టిస్తే.. చర్మం, మీదనున్న మృత కణాలు తొలగిపోతాయి.

Story first published: Wednesday, October 19, 2011, 17:56 [IST]
Desktop Bottom Promotion