For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

‘నాభి’ శుభ్రత ఇలా..?

|

belly button
సౌందర్య పోషణలో భాగంగా శరీర సంరక్షణకు ప్రాధాన్యతనివ్వటం తప్పనిసరి. శరీరా భాగాల శుభ్రత విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా, అందాన్ని కోల్పొటంతో పాటు ఆరోగ్యాన్ని చేజార్చుకోవల్సి వస్తుంది. దినచర్యలో భాగంగా స్నానానికి ఎంత సమయాన్ని కేటాయిస్తున్నామో.., అంతే సమయాన్ని అవయవాల శుభ్రతకు కేటాయించాలి.

ముఖ్యంగా మహిళలు తమ శరీర భాగాల్లో ఒకటైన నాభి (బొడ్డు) కేంద్రాన్ని శుభ్రపరుచుకోవటంలో విఫలమవుతుంటారు. దుస్తుతో కప్పబడి ఉంటే ఈ సున్నితమైన ప్రాంతంలో చెమట నిల్వ ఉండటతో పాటు బ్యాక్టరీయా వ్యాప్తి చెంది దుర్గంధం వ్యాపిస్తుంటుంది. ఫ్యాషన్ నేపధ్యంలో పలువురు ఆధునిక మహిళలు 'నాభి' భాగంలో రింగ్ ను జతచేస్తున్నారు. సహజసిద్ధమైన పద్ధతులు ద్వారా నాభి భాగాన్ని శుభ్రం చేసుకునే విధానాలను నిపుణలు సూచిస్తున్నారు.


- సున్నితమైన 'నాభి' ప్రాంతాన్ని గరుకు వస్తువులతో రుద్ద కూడదు. నాణ్యమైన 'కాటన్ బడ్'లను నాభి శుభ్రతకు ఉపయోగించాలి.

- తొలత 'నాభి'భాగాన్ని నీటితో శుభ్రం చేసిన పిదప, సబ్బు లేదా బాడీ వాష్ క్రీమును ఉపయోంచాలి. 'నాభి'క్షేత్రంలో పేరుకున్న మట్టితో పాటు ఇతర బ్యాక్లీరియాను తొలగించే క్రమంలో చేతి వేలును ఆ భాగంలో రెండు నిమిషాల పాటు గడియారం పద్దతిలో రుద్ది నీటితో శుద్ధి చేసుకోవాలి. ఈ ప్రక్రియ వల్ల 'నాభి' ప్రాంతం ఆరోగ్యవంతగా ఉంటుంది.

- రోజు స్నానానికి ముందు 'నాభి' ప్రాంతాన్ని కొబ్బరి నూనె మరియు ఆలివ్ నూనెను ఆప్లై చేయాలి. పావుగంట తరువాత 'ఫింగర్ టిప్'విధానం ద్వారా 'కాటన్ బుడ్'లేదా మొత్తటి వస్త్రాన్ని ఉపయోగించి నాభి భాగాన్ని శుభ్రం చేసుకోవాలి.


-'నాభి'భాగంలో ఉపయోగించే రింగు శుభ్రత విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించిన చర్మ సంబంధిత వ్యాధులు తప్పవు. సముద్రపు ఉప్పును గోరు వెచ్చటి నీటిలో కలిపి ఆ మిశ్రమంలో రింగును కొద్ది నిమిషాల పాటు నానబెట్టి, అనంతరం పొడి గుడ్డతో తుడవాలి.


-'నాభి భాగాన్ని'శుభ్రం చేసిన అనంతరం ఆ ప్రాంతంలో మాయిశ్చరైజర్ లేదా బాడీ లోషన్ ను ఆప్లై చేయడం వల్ల దుర్వాసన తదితర సమస్యల నుంచి బయటపడవచ్చు.

English summary

Easy Ways To Clean Belly Button | ‘నాభి’ శుభ్రత ఇలా..?

Belly button is a difficult body part to clean. The belly button is a small, moist and closed body part which gets bacteria, lint and dirt easily. People with belly piercing are more prone to getting dirt in the button. So it is very important to keep the belly button clean and free from smell. Lets check out the ways to clean belly button at home.
Story first published:Thursday, October 13, 2011, 12:01 [IST]
Desktop Bottom Promotion