For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆ భాగంలో వెంట్రుకలు సమస్య వేధిస్తుందా...?

ఆ భాగంలో వెంట్రుకలు సమస్య వేధిస్తుందా...?

|

Abdominal Hair Remove
పొత్తికడుపు పై వేధించే వెంట్రుకుల సమస్య మగవారితో పాటు ఆడవారిని బాధిస్తుంది. అయితే మగవారిపై ఈ సమస్యను అంతగా ప్రభావం చూపదు. కాని ఆడవారికి ఈ సమస్య చికాకును కలిగిస్తుంది, నలుగురిలో తిరగాలంటే ఒబ్బెట్టుగా ఉంటుంది. వెంట్రుకులన్న పొట్ట మీద అందమైన చీర కట్టినా ప్రయోజనం మాత్రం శూన్యం. అయితే ఈ వెంట్రుకలను తొలగించేందుకు స్పాలు, సెలూన్లు అందుబాటులో ఉన్న ప్రతి సారి వెళ్లటం కుదరొచ్చు, కుదరకపోవచ్చు. ఇక వంటి నిండా వ్యాక్స్ చేయించుకుందామా అంటే చాలా ఎక్కువ సమయాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. ల్యాజర్ చికిత్సఅందుబాటులో ఉన్నా అది సామాన్య మధ్యతరగతి స్త్రీలకు అందుబాటులో లేదు. మరి ఈ సమస్యలకు పరిష్కారం లేదా అంటే ఉంది. తాపీగా ఇంటి వద్దనే కూర్చుని ఈ వెంట్రుకలను తొలగించుకోవచ్చు, అది ఏలా గంటే...

వెంట్రుకులను తొలగించుకునే విధానం :

- పొత్తి కడుపు పై వ్యాపించిన వెంట్రుకలు మందపాటిగా ఉండటంతో పాటు ధృడత్వాన్ని కలిగి ఉంటాయ. ఈ సమస్యను రేజర్ షేవింగ్ ద్వారా నియంత్రించవచ్చు. అయితే మీరు షేవింగ్ చేసుకున్న కొన్ని రోజులకు మళ్లి వెంట్రుకలు ఏర్పడతాయి. మళ్లి వీటిని షేవింగ్ పద్ధతిలోనే తొలగించండి. అయితే షేవింగ్ చేసుకునే ముందు కొబ్బరినూనెతో వెంట్రుకులున్న భాగాన్ని మర్దనా చేసుకోండి.

- సమయం వృధా కాకుండా ఈ సమస్యను పరిష్కరించుకోవాలనుకుంటే మార్కెట్లో లభ్యమవుతున్న 'న్యూమరస్ హెయిర్ రిమూవల్ క్రీమ్'ను కోనుగోలు చేసి ప్రయత్నించండి. అయితే మీరు ఎంచుకునే క్రీములు చర్మానికి ఎలర్జీ కలిగించేవిలా ఉండకూడదు.

- బ్లీచింగ్ విధానంతోనూ వెంట్రుకుల సమస్య నుంచి బయటపడోచ్చు. వ్యాక్స్ చేసుకునేందుకు ప్రతి సారి బ్యూటీ పార్లర్ కు వెళ్లటం కుదరదు కాబట్టి, సూపర్ మార్కెట్లలో లభ్యమయ్యే 'వ్యాక్స్ స్ట్రీప్ల'ను కోనుగోలు చేసి ఇంటి వద్దనే వ్యాక్స్ చేసుకోండి. అయితే వ్యాక్స్ చేసుకునే సమయంలో వెంట్రుకల భాగం కాస్తంత మంటగా ఉంటుంది.

- సహజసిద్ధమైన పదార్ధాలతోనూ ఈ సమస్యలను నియంత్రించవచ్చు. వంటింట్లో దొరికే పుసుపును వేరుశెనగ పండిలో కలిపి ఈ మిశ్రమాన్ని పాలలో కలిపండి, తయారైన మిశ్రమాన్ని వెంట్రకలున్న భాగం పై పట్టించి, కొంత సేపు మర్దనా చేసుకోండి ఇలా చేయటం వల్ల వెంట్రుకుల మెత్తబడి తొలగించేందుకు అనువుగా ఉంటాయి.

English summary

How To Remove Stomach Hair At Home? | ఆ భాగంలో వెంట్రుకలు సమస్య వేధిస్తుందా...?

Abdominal hair is a common problem for both men and women. While men get away with it casually for women it can be a cause of embarrassment and also inconvenience. Imagine carrying off an elegant saree with a hairy stomach! Disgusting! Body hair removal at a proper spa or salon is not always possible. Whole body wax takes a lot of time that most of us can't spare. Getting a laser treatment done for the whole body is not a financially viable option for everybody. So what can you do? Hair removal at home is the best way to deal with abdominal hair.
Desktop Bottom Promotion