For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దోమలను తరిమికొట్టండిలా..?

|

mosquito bite
దోమలు విజృంభించేందుకు అనువైన కాలమిది, దోమ కాటు వివిధ ఆరోగ్య సమస్యలతో పాటు చర్మ సంబంధింత రుగ్మతలకు లోను చేస్తుంది. దోమలు మీ దరికి చేరకుండా ముందస్తు చర్యులు పాటించండిలా..

- దోమలను తరిమికొట్టేందుకు మార్కెట్లో లభ్యమవుతున్న కాయిల్స్ తదితర అగరబత్తీలను మన్నికైనవి ఎంచుకోండి. దోమల నివారణకు అందుబాటులోకి వచ్చని ఎలక్ట్రానిక్ పరికరాలు సమస్య విరుగుడుకు ఉపయుక్తంగా నిలుస్తాయి.

- ఇంట్లో దోమల భాద ఎక్కువగా ఉంటే గ్లాసుడు నీటిలో అరడజను అంతకు మించి కర్పూరం బిళ్లలను వేయండి. వచ్చే వాసన ఘాటకు దోమలు బయటకు పోతాయి.

- పుదీనా మొక్కను కుండీలో నాటి ఇంట్లో పెట్టకుంటే దోమల బెడత తగ్గుతుంది.

- దోమ కాటకు గురైన ప్రాంతాన్ని చల్లటి నీటితో కడగండి.

- దోమ కాటుకు గురైన మీ చర్మం పై వెనిగర్ అద్దిన దూదిదో రుద్దండి.

- ఇంటితో పాటు మీ పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవటం వల్ల దోమల సమస్య నియంత్రణలోకి వస్తుంది.

- దోమల కాలంలో చిన్నారుల బెడ్ లకు దోమతెరలను ఏర్పాటు చేయటం మంచిది.

English summary

Mosquito Control..!! | దోమలను తరిమికొట్టండిలా..?

Mosquitoes are known for their annoying bug bites and their ability to breed anywhere in the hot months throughout the year. However, there are ways to prevent mosquitoes from disturbing your daily lives. At home mosquito control is all about prevention and limiting the mosquitoes ability to breed.
Story first published:Sunday, October 9, 2011, 11:08 [IST]
Desktop Bottom Promotion