Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
వయసు పైబడకుండా వుండాలంటే!

అసలు వయసు పైబడటానికి కారణాలేమిటి?
చర్మ కణాల పునరుజ్జీవన ప్రక్రియ నిదానించటమే వయసు పై బడటమంటే అని చెప్పవచ్చు. కనుక ఎవరైనా ఎప్పటికి యువకులుగా వుండాలంటే చర్మ కణాల పునరుజ్జీవాన్ని వేగవంతం చేయాలి. దీనికిగాను కొన్ని పోషక విలువలుకల ఆహారాన్ని తీసుకుంటూండాలి. బయటనుండి వివిధ క్రీములు రాసి చర్మాన్ని రక్షించేకంటే లోపలినుండి చక్కని ఆహారాన్ని సమకూర్చి చర్మ కణాల పునరుజ్జీవానికి ప్రయత్నించవచ్చు. మీ వయసు తెలియరాదనుకునేటంత పటిష్టంగా మీ శరీరం వుండాలంటే దిగువ ఆహారాలు తినండి.
1. పచ్చని ఆకు కూరలు: గోంగూర, బ్రొక్కోలి, కొత్తిమీర, కరవేపాకు మొదలైనవి చర్మానికి మంచి సంరక్షణ కలిగిస్తాయి. వీటిలో హాని కలిగించే చెడు పదార్ధాలుండవు. తిన్న ఆహార పదార్ధాలను త్వరితంగా జీర్ణం చేసి విసర్జనలో తోడ్పడతాయి. కనుక మీ శరీరం, చర్మం సహజంగా శుద్ధి చేయబడుతుంది.
2. యాంటీ ఏజింగ్ విటమన్స్:విటమిన్ సి, విటమిన్ ఇ లు ప్రధానంగా వయసు సమస్యను అరికడతాయి. డ్యామేజీ అయిన కణాలును రిపేర్ చేయడం కణాలు తొందరగా పుట్టేలా చేయటం వీటి పని. యువకులుగా కనపడేందుకు చర్మంలోని సహజమైన నూనెలకు విటమిన్ ఇ వాడాలి. ఈ నూనెలు లేకుంటే మీ చర్మం డల్ గా వుండి వయసు పైబడ్డట్టు కనపడతారు. ఎండ, కాలుష్యం, పొగ, అలసట మొదలైనవి మీలో వుండే ఈ విటమన్లను ఖాళీ అయేలా చేస్తాయి. సిట్రస్ జాతికి చెందిన పుల్లని ఆరెంజెస్, బెర్రీస్ మొదలైనవి విటమిన్ సి, ఆల్మండ్స్, మొదలైన ఎండు ఫలాలు విటమిన్ -ఇ ని ఇస్తాయి.
3, పండ్ల తొక్కలలో యాంటీ ఆక్సిడెంట్లు వుంటాయి. ఇవి తింటే వయసు కనపడకుండా చేస్తాయి. ఆపిల్, ఆరెంజ్, రేగుపండు, చెర్రీలు మొ. తొక్కలతో తినవచ్చు. ఇవి అధికంగా వుండేలా ఆహారాన్ని తీసుకోండి.
4. మసాలాలు: లవంగాలు, మిరియాలు మొదలైనవి కూడా ఆహారంలో చేర్చి వేగవంతమైన కణ పునరుజ్జీవాన్ని పొందవచ్చు.
ఈ రకమైన పోషకాలున్న సహజ పదార్ధాలను మీ ఆహారంలో చేర్చుకుంటే ఒక్క నెలరోజులలో మీ చర్మంలో కాంతి, బిగువు పొంది మీ వయసుకంటే చిన్నవారుగా కనపడతారనటంలో సందేహం లేదు.



Click it and Unblock the Notifications