For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పౌడర్ల్లు.. క్రీములు వాడకుండా అందంగా..?

|

Natural Beauty With Out Using Creams..?
అందాన్ని మెరుగు పరుచుకునేందుకు ఖరీదైన పౌడర్లు.. క్రీమ్‌లు వాడాల్సిన అవసరమే లేదంటున్నారు సౌందర్య నిపుణులు. పొదుపైన మార్గాల ద్వారా సహజసిద్ధమైన పద్ధతిలను అనుసరంచి చక్కటి ఫలితాలను రాబట్టవచ్చని వీరు సూచిస్తున్నారు.

షాంపూలో వెనిగర్‌ను కలిపి తలస్నానం చేస్తే వెంట్రుకల పట్టులాంటి నిఘారింపును సంతరించుకుంటాయి. స్నానం చేసే నీటిలో 6 నుంచి 8 చుక్కుల గంధపు నూనెను కలపితే చర్మ సంబంధిత వ్యాధులు దరికి చేరవు. చందనంతో తయారుకాబడిన నూనె కళ్లు మంటలను దూరం చేస్తుంది.

ఎండపెట్టిన నారింజ తొక్కల పొడిని రోజ్ వాటర్‌లో కలిపి ముఖానికి రాసుకుంటే మృతకణాలు పోయి చర్మం మెరుస్తుంటుంది. నిమ్మకాయరసం కలిపిన నీళ్లతో ముఖానికి ఆవిరి పడితే బ్లాక్, వైట్ హెడ్స్‌ను నివారించవచ్చు. రోజ్ వాటర్ సహజసిద్ధమైన టోనర్, క్లెన్సర్‌లుగా పనిచేస్తుంది. బొప్పాయి గుజ్జు ముఖంపై మచ్చల్ని మాయం చేస్తుంది. కీరదోసకాయ రసం సన్‌టాన్‌ని పోగొట్టడమే కాకుండా యాస్ట్రింజెంట్‌గా కూడా పనిచేస్తుంది. నిగారింపు లేని, పొడి చర్మం గల వాళ్లు ఆల్మండ్ పేస్ట్, పాలు కలిపి ముఖానికి ప్యాక్ వేసుకుంటే ఫలితం ఉంటుంది.

కలబంద గుజ్జు ముఖ వర్చస్సును పెంపొందించటంలో కీలక పాత్ర పోషిస్తుంది. కలబంద గుజ్జులో తగినంత పుసుపును జోడించి ముఖానికి ఫేషియల్ చేసుకుని 15 నిమిషాల తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే, ముఖం పై పేరుకున్నమురికి తొలగిపోయి కొత్త రూపు సంతరించుకుంటుంది.

మీగడ ముఖ సౌందర్యానికి దోహద పడుతుంది. తాజా మీగడను ప్రతిరోజు ముఖానికి రాయడం వల్ల చర్మ మృదువుగా కాంతివంతంగా తయారవుతుంది. అంతే కాదు ముఖం పై వ్యాపించిన నల్లమచ్చలు, ముడతలు తొలగిపోతాయి.

English summary

Natural Beauty With Out Using Creams..? | పౌడర్ల్లు.. క్రీములు వాడకుండా అందంగా..?

Homemade Beauty Recipes that you can make quickly and easily at home. Free recipes for your face, hair, body, and bath.Natural beauty is the ideal many people strive to achieve when they purchase make-up, creams, shampoos and other forms of cosmetics. But what really constitutes natural beauty, and how can it be achieved?
Story first published:Monday, November 28, 2011, 15:45 [IST]
Desktop Bottom Promotion