Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
చలికాలం.. మీ అందం జరభద్రం..!!

చలికాలంలో దాదాపు చర్మంలో నూనె ఉత్పత్తి శాతం తగ్గిపోతుంది. ఈ క్రమంలోనే చర్మం పొడిబారిపోవడం, ముడతలు పడటం, పొలుసులుగా కనిపిస్తుంటుంది. ఇలాంటి సమస్యలను ఎదుర్కొనేవారు వారానికోసారి ఎక్స్ ఫొలియేట్ తప్పకుండా చేసుకోవాలి. ఈ చర్య వల్ల చర్మంలో పేర్కొన్న మృతకణాలు ఎప్పటికప్పుడు తొలగిపోతాయి. చలికాలంలో ప్రతిరోజు స్నానానికి ముందు కొబ్బరినూనెను ఒంటికి పట్టించి గోరువెచ్చటి నీళ్లతో స్నానం చేయండి. రాత్రి పడుకోబోయే ముందు గోరువెచ్చని నీటిలో దూదిని ముంచి ముఖాన్ని శుభ్రపరచుకుని, బ్రాండెడ్ కోల్డ్ క్రీమ్ లేడా మాయిశ్చైజర్ ను రాసుకోండి. చలికాలంలో క్రమం తప్పకుండా ఇలా చేస్తే మీ చర్మం పొడిబారకుండా ఉంటుంది.
సన్ స్ర్కీన్ లోషన్ కేవలం ఎండాకాలం మాత్రమే వాడేదని చాలా మంది అనుకుంటారు. కానీ, ఆ అభిప్రాయం సరైంది కాదు. సన్ స్ర్కీన్ లోషన్ అన్ని కాలల్లోనూ చర్మ పరిరక్షణకు దోహదపడుతుంది. చల్లటి వాతావరణంలో విహరించడానికి అందరూ ఉత్సాహం చూపుతారు. అతి చల్లదనం చర్మానికి హానిచేస్తుందని మరవకండి. ప్రతి ఉదయం గోరువెచ్చని నీటితో స్నానం చేయడం చర్మానికి మంచిది. స్నానపు నీటిలో రెండు చుక్కలు బాదం నూనె వేసుకుని స్నానం చేస్తే పొడిబారకుండా ఉంటుంది. ఇంకో ముఖ్యమైన విషయాన్ని మరిచిపోకండి. తక్కువ సమయంలోనే స్నానాన్ని ముగించండి. సబ్బులు కూడా ఏవిపడితే అవి వాడకూడదు. శీతాకాలానికి అనువైనవి మాత్రమే ఎంచుకోండి.
ఈ కాలంలో ఆహారం విషయంలోనూ స్వల్ప మార్పులు తప్పనిసరి. విటమిన్ సి,బి,ఈ, జింక్, మెగ్నీషియం ఉన్న ఆహారాన్ని తీసుకోవడం ఉత్తమం. చలికాలంలో చాలా రకాల పండ్లు మార్కెట్లో లభ్యమవుతాయి. కాబట్టి ఆహారంలో పండ్లను తప్పనిసరిగా తీసుకోండి. చాలమందికి పెదాల పగుళ్లివడం వంటి సమస్య బాధిస్తుంటుంది. ఈ విషయంలో నిర్లక్ష్యం చేయకుండా ఉదయం, రాత్రి లిప్ బాబ్ లేదా వేజిలిన్ ను రాసుకోండి. ఈ రెండు అందుబాటులో లేని వారు నెయ్యిని రాసుకోవచ్చు. ఈ కాలంలో చుండ్రు సమస్య కూడా వేధిస్తుంటుంది. ఈ కాలంలో మీరు ఎంచుకునే షాంపూ చుండ్రును నివారించటంతో పాటు కేశాలకు పోషణనిచ్చేదిగా ఉండాలి.
అన్నింటకన్నా ముఖ్యమైనది శారీరక వ్యాయామం, ఈ ప్రక్రియ ద్వారా చర్మాన్ని మరింత ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచుకోవచ్చు. వ్యాయామం కారణంగా చర్మంలోని మలినాలు ఎప్పటికప్పుడు బయటకు వెళ్లిపోతాయి. పైగా ఈ కాలంలో వ్యాయామం చేయడం వల్ల శరీరం ఉత్సాహవంతంగా ఉంటుంది. మీరు వేసుకునే దుస్తుల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవల్సి ఉంటుంది. నాణ్యమైన కాటన్ వస్త్రాలను ధరించడం ఉత్తమం. ముఖ్యంగా తడి వస్త్రాలను శరీరం పై ఎక్కువ సేపు ఉండకుండా చూసుకోవాలి.
సాధారణంగా చలికాలంలో పాదాల పగుళ్లు సమస్య అధికంగా వేధిస్తుంటుంది. ముఖ్యంగా ఇంట్లో ఎక్కువ సమయం పాటు తడిలో పనిచేసే స్త్రీలను ఈ సమస్య బాధిస్తుంది. నాణ్యమైన సాక్సులు, బూట్లు ధరించడం వల్ల పాదాలపు పగుళ్ల నుంచి సంరక్షించుకోవచ్చు. పగుళ్లు సమస్యతో బాధపడుతున్న వారు రాత్రి నిద్రించడానికి ముందు గోరువెచ్చని నీటిలో ఉప్పు, పసుపు వేసి నానబెట్టుకోవాలి. కొంత సేపటి తరువాత పొడి వస్త్రంతో పాదాన్ని శుభ్రం చేసుకుని వైట్ పెట్రోలియం జెల్లీని రాసుకుంటే పగుళ్లు సమస్య తొలగిపోతుంది.



Click it and Unblock the Notifications