Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
మీరు నల్లగా ఉంటే వీటితో మీ చర్మకాంతిని పెంపొందించుకోండి...
మనం ప్రతి నిత్యం తీసుకొనే ఆహారం అద్భుతమైనది. కాబట్టి ఆహారం తీసుకోవడం అనేది ఇటు ఆరోగ్యానికి అటు బరువు కు మరియు అందానికి సంబందించినది. ఆహారాలు కూడా బ్యూటీలో ఉపయోగపడుతాయంటే ఆశ్చర్యం కలగక మానదు. మీరు మంచి రంగుతో అందంగా ఉండాలి, కనబడాలంటే ఇక్కడ ఎనిమిది బెస్ట్ ఫుడ్స్ ను అందిస్తున్నాం. ఇవి తింటే రుచిని మాత్రమే కలిగి ఉండటం కాదు, చర్మానికి కూడా చాలా అద్భుతంగా ఉపయోగపడి కాంతివంతం చేస్తాయి.

అవకాడో
పండ్లలో ఎక్కువ కేలరీలనిచ్చేది అవకాడో పండ్లు, వందగ్రాములకి 167కేలరీలనిస్తాయి. అవకాడో పండ్లులో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది.

గ్రీన్ టీ
నిగనిగలాడే చర్మానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో యాంటీయాక్సిడెంట్స్, విటమిన్స్, మినరల్స్ ను ఎక్కువగా కలిగి ఉంటుంది

తాజా టమోటోలు
తాజాగా దొరికే టమోటోలు చర్మ సంరక్షణలో ఉపయోగపడుతాయంటే ఆశ్చర్యమే. ఎందుకంటే టమోటోలను తినడం వల్ల కొల్లెజాన్ ఉత్పత్తి చేస్తుంది.

సాల్మన్
సాల్మన్ ఫిష్ ఓమేగా 3 మరియు ఓమేగా 6ను పుష్కలంగా కలిగి ఉంటుంది. వీటిని ఎసెన్సియల్ ఫ్యాటీ ఆసిడ్స్ అని కూడా పిలుస్తారు.

గుడ్లు
ఇది ఒక పౌష్టికాహరం. కోడిగుడ్లలో జింక్ అధికంగా ఉంటుంది. జింక్ చర్మానికి కాంతివంతంగా ఉంచేందుకు బాగా సహయపడుతుంది.

వాల్ నట్స్
వాల్ నట్స్, సాల్మన్ లో ఉన్నటువంటి ఓమేగా 3ఫ్యాటీ ఆసిడ్స్ అధికంగా కలిగి ఉంటాయి. ఇవి శరీరంలోని కొవ్వును తగ్గించడానికి బాగా తోడ్పడుతాయి.

బీన్స్
బీన్స్ మరో అద్భుతమైన ఆహారపదార్థం. బీన్స్ లో అధికంగా ఫైబర్, ప్రోటీనులు కలిగి ఉంటుంది.

స్ట్రాబెర్రీస్
బ్లూబెర్రీస్, బ్లాక్‌బెర్రీస్, స్ట్రాబెర్రీస్ తీసుకోవడం ద్వారా నిత్య యవ్వనులుగా ఉండొచ్చునని ఓ పరిశోధనలో తేలింది.
1. అవకాడో: పండ్లలో ఎక్కువ కేలరీలనిచ్చేది అవకాడో పండ్లు, వందగ్రాములకి 167కేలరీలనిస్తాయి. అవకాడో పండ్లులో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఈ పండు ఎంతో శ్రీష్ఠమైనది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికమే. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు,. మీ చర్మాన్ని రక్షిస్తాయి. చర్మం ఎంతో మెరుపు కలిగివుంటుంది. చర్మకణాలు, ఈ పండు తింటే ఎప్పటికపుడు పుణరుజ్జీవనం పొందుతూంటాయి. కనుక అధికమైన రంగును చర్మానికి కలిగి వుంచే సహజగుణం ఈ పండులో ఉంది. ఈ కారణంగా ఈ పండు తినేవారంతా మంచి చర్మం తేజస్సు కలిగి ఉంటారు. అవకాడో గుజ్జు, దోస గుజ్జు, తేనె, పెరుగు సమపాళ్లలో కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, పదిహేను నిమిషాలు ఉంచాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరచుకోవాలి. ఈ ప్యాక్ ముఖ చర్మాన్ని కాంతివంతంగా, సున్నితంగా మార్చుతుంది.
2. గ్రీన్ టీ: నిగనిగలాడే చర్మానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో యాంటీయాక్సిడెంట్స్, విటమిన్స్, మినరల్స్ ను ఎక్కువగా కలిగి ఉంటుంది గ్రీన్‌టీ తీసుకోవడం వల్ల కాంతివంతమైన చర్మం కూడా మీ సొంతం అవుతుంది. ఇది పూర్తిగా ప్రకృతి సిద్ధమైనది కావడంతో ఎలాంటి సైడ్‌ఎఫెక్ట్స్ ఉండవు. ప్రతిరోజు 2 నుంచి 5 కప్పుల గ్రీన్‘టీ' తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు.
3. తాజా టమోటోలు: తాజాగా దొరికే టమోటోలు చర్మ సంరక్షణలో ఉపయోగపడుతాయంటే ఆశ్చర్యమే. ఎందుకంటే టమోటోలను తినడం వల్ల కొల్లెజాన్ ఉత్పత్తి చేస్తుంది. మరియు చర్మానికి తేమను అందించి, చర్మ కణాలు శక్తివంతంగా మెరుగుపరచడానికి సహాయపడుతుంది. టమోటోను ఫేస్ ప్యాక్ ను ముఖానికి ప్యాక్ వేయడం వల్ల చర్మం రంధ్రాలను శుభ్రం చేయడానికి సహాయపడుతుంది. ఈ ప్యాక్ వల్ల చర్మం తాజాగా ఉంటుంది. 21-47 వయసు గల మహిళలపై ఈ పరిశోధన చేయబడింది. ఈ పరిశోధనలో టమోటాలు తీసుకునే వారిలో సూర్యరశ్మి నుంచి చర్మాన్ని సంరక్షించగల సామర్థ్యం అధికంగా కలదని తెలిసింది.
4. సాల్మన్: సాల్మన్ ఫిష్ ఓమేగా 3 మరియు ఓమేగా 6ను పుష్కలంగా కలిగి ఉంటుంది. వీటిని ఎసెన్సియల్ ఫ్యాటీ ఆసిడ్స్ అని కూడా పిలుస్తారు. వీటివల్ల కమిలిన చర్మ త్వరగా కోలుకొనేలా చేస్తుంది. ఇవి మొటిమల దగ్గర నుంచి సోరియాసిస్ వరకు అనేక చర్మవ్యాధుల మీద ప్రభావం చూపుతాయి. సాల్మన్, మెకరెల్, సార్టైన్లు ట్యూనాచేపలు నుంచి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ లభిస్తాయి. వారానికి కనీసం మూడుసార్లు వీటిని తీసుకుంటే మంచిది.
5. గుడ్లు: ఇది ఒక పౌష్టికాహరం. కోడిగుడ్లలో జింక్ అధికంగా ఉంటుంది. జింక్ చర్మానికి కాంతివంతంగా ఉంచేందుకు బాగా సహయపడుతుంది. ప్రతి నిత్యం మీరు తీసుకొనే ఆహారంలో జింక్ లేకపోతే చర్మం నిర్జీవంగా మారుతుంది. దాంతో ముఖంలో డల్ నెస్ కనబడుతుంది. చర్మ కమిలిపోవడం, ముడుతలు వంటి సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి మీరు తీసుకొనే ఆహారంలో జింక్ శాతం అధికంగా అంధించే గుడ్లను కూడా చేర్చుకోవాలి. దాంతో ముఖంలో ముడుతలు, స్ట్రెచ్ మార్క్స్ మరయు మొటిమలను ఏర్పడకుండా నిరోధిస్తుంది.
6. వాల్ నట్స్ : వాల్ నట్స్ , సాల్మన్ లో ఉన్నటువంటి ఓమేగా 3ఫ్యాటీ ఆసిడ్స్ అధికంగా కలిగి ఉంటాయి. ఇవి శరీరంలోని కొవ్వును తగ్గించడానికి బాగా తోడ్పడుతాయి. వాల్ నట్స్ లో ఉన్నటువంటి ఫ్యాట్స్, ఆయిల్, చర్మసౌందర్యానికి బాగా ఉపయోగపడుతాయి. చర్మాన్ని మృదువుగా ఉంచడమే కాకుండా చర్మ రంగును పెంచడానికి బాగా సహయపడుతుంది. కాబట్టి ప్రతి రోజూ బ్రేక్ ఫాస్ట్ లో వాల్ నట్స్ ను తీసుకోవడం చాలా ముఖ్యం.
7. బీన్స్: బీన్స్ మరో అద్భుతమైన ఆహారపదార్థం. బీన్స్ లో అధికంగా ఫైబర్, ప్రోటీనులు కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇందులో సెలీనియం మరియు విటమిన్ ఇ పుష్కలంగా ఉండటం వల్ల, చర్మం పొడిబారనివ్వకుండా చేస్తుంది. రోగనిరోధక వ్యవస్థను పెంచుతుంది.
8. స్ట్రాబెర్రీస్: బ్లూబెర్రీస్, బ్లాక్‌బెర్రీస్, స్ట్రాబెర్రీస్ తీసుకోవడం ద్వారా నిత్య యవ్వనులుగా ఉండొచ్చునని ఓ పరిశోధనలో తేలింది. బ్లూబెర్రీస్, బ్లాక్ బెర్రీస్, స్ట్రాబెర్రీస్‌లతో పాటు ఇతర బెర్రీ పండ్లను తీసుకోవడం ద్వారా మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఇంకా వయస్సు మీద పడుతున్న కొద్ది వచ్చే మతిమరుపు దూరమవుతుందని పరిశోధనలు తెలుపుతున్నాయి. ఇందులో ఉండే యాంటి యాక్సిడెంట్స్ చర్మంలోని మృత కణాలను తొలగించడానికి బాగా సహాయపడుతుంది. కాబట్టి చర్మ సంరక్షణకు ఉపయోగపడే కరెక్ట్ ఫుడ్ ను తింటూ ఆరోగ్యంగా.. సౌందర్యాని అభివృద్ది చేసుకోండి..



Click it and Unblock the Notifications











