Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
ఆయుర్వేద గృహవైద్యా చిట్కాలతో సౌందర్యం మీ సొంతం...

1. నోటి దుర్వాసన పోవాలంటే ఆకుపత్రి, లవంగాలు,పలకులు సమాన భాగాలుగా తీసుకుని పొడిచేసి నోటిలో వేసుకుని నములుతూ ఉంటే నోటి దుర్వాసన నశిస్తుంది.లవంగాన్ని చప్పరించటం వల్ల నోరు తాజాగా ఉంటుంది.
2. సుగంధ పాలవాయువితంగాలు, గంధకచ్చురాలు, వట్టివేర్లు, కస్తూరి, పసుపు, ఎండిన వేప, తులసి, మారేడు ఆకులు, నిమ్మకాయతోలు ఎండినవి, మంజిష్టా అన్నింటినీ సమభాగాలుగా ఎండబెట్టి చూర్ణించి కలిపి ఉంచుకోవాలి. ఈ చూర్ణాన్ని పొట్టు ఉన్న పెసర్లు దోరగా వేయించి పొడి చేసుకుని అందులో చూర్ణాన్ని కలుపుకుని ప్రతి రోజూ శరీరానికి నూనె రాసుకుని ఈ పిండితో నలుగు పెట్టుకుంటే శరీరంపై పేరుకున్న కొవ్వు కరిగిపోయి చర్మం అందంగా మెరుస్తుంది.
3. తులసి ఆకులను మెత్తగా నూరి కొబ్బరి నూనె కలిపి పేస్ట్ గా చేసి పొట్టమీద ఉండే మడతపై రాస్తుంటే ముడుతలు తగ్గుతాయి.
4. పసుపులో తగినంత నిమ్మరసం కలిపి కాళ్లకు రాసుకుని రెండు మూడు గంటల తర్వాత సున్నిపిండితో బాగా రుద్ది కడుక్కుంటూ ఉంటే పాదాలు శుభ్రంగా ఉంటాయి.
5. నిమ్మరసం, వైట్ వెనిగర్ వేడినీరు సమాన భాగాలుగా తీసుకుని దానిలో ఒక బ్రష్ ముంచి ఆ మిశ్రమాన్ని గోళ్లమీద రాయాలి. గోళ్లు చక్కని మెరుపు సంతరించుకోవడానికి ఇది మంచి మార్గం.
6. నీటిలో బాగా నానడం వలన పాచిపోయిన కాళ్లు వేళ్ల సందుల్లో జాజికాయ నూరి పైకి పూయాలి. ఇది యాంటిఫంగల్ శక్తి ఉంది.
7. నిగారింపైన చర్మం కోసం కోడిగుడ్డులోని తెల్లసొనలో అర టీ స్పూన్ పాల పొడి, కొన్నిచుక్కల నిమ్మరసం వేసి బాగా కలపాలి. దీన్ని ముఖానికి పట్టించి 15 నిమిషాల తరవాత కడిగేయాలి. ఈ విధంగా మూడు రోజులకి ఒకసారి చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
8. ముందగా టొమాటో తొక్క తీసి గుజ్జు చేసుకోవాలి. ఆ తర్వాత మెత్తగా ఉడికించిన అన్నంలో టొమాటో గుజ్జు, రెండు టీ స్పూన్ల నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒంటికి పట్టించి పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే చర్మం కోమలంగా ఉండి నిగారింపు పెరుగుతుంది. ఇలా నెలకు రెండుసార్లు చేస్తే బాగుంటుంది.



Click it and Unblock the Notifications