For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆయుర్వేద గృహవైద్యా చిట్కాలతో సౌందర్యం మీ సొంతం...

|
Ayurvedic home remedies for Beauty Skin
ముఖ అందం, ఆరోగ్యం రెండూ ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. ఆరోగ్య కరమైన అందం ఆశించదగినది. అదే అందరూ కోరుకొనేది కూడా. అయితే అనాదిగా వస్తున్న ఆయుర్వేదం ద్వారా అందాన్ని ఆరోగ్యాన్ని ఒకేసారి సొంతం చేసుకోవచ్చు. స్త్రీల సౌందర్య పోషణకు ఆయుర్వేదం ఎన్నో గృహవైద్యాలను ఉదహరించింది. ఆయుర్వేద వైద్యంతో ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ లేకుండా మీరు అందం ఆరోగ్యం సొంతం చేసుకోండి.

1. నోటి దుర్వాసన పోవాలంటే ఆకుపత్రి, లవంగాలు,పలకులు సమాన భాగాలుగా తీసుకుని పొడిచేసి నోటిలో వేసుకుని నములుతూ ఉంటే నోటి దుర్వాసన నశిస్తుంది.లవంగాన్ని చప్పరించటం వల్ల నోరు తాజాగా ఉంటుంది.

2. సుగంధ పాలవాయువితంగాలు, గంధకచ్చురాలు, వట్టివేర్లు, కస్తూరి, పసుపు, ఎండిన వేప, తులసి, మారేడు ఆకులు, నిమ్మకాయతోలు ఎండినవి, మంజిష్టా అన్నింటినీ సమభాగాలుగా ఎండబెట్టి చూర్ణించి కలిపి ఉంచుకోవాలి. ఈ చూర్ణాన్ని పొట్టు ఉన్న పెసర్లు దోరగా వేయించి పొడి చేసుకుని అందులో చూర్ణాన్ని కలుపుకుని ప్రతి రోజూ శరీరానికి నూనె రాసుకుని ఈ పిండితో నలుగు పెట్టుకుంటే శరీరంపై పేరుకున్న కొవ్వు కరిగిపోయి చర్మం అందంగా మెరుస్తుంది.

3. తులసి ఆకులను మెత్తగా నూరి కొబ్బరి నూనె కలిపి పేస్ట్‌ గా చేసి పొట్టమీద ఉండే మడతపై రాస్తుంటే ముడుతలు తగ్గుతాయి.

4. పసుపులో తగినంత నిమ్మరసం కలిపి కాళ్లకు రాసుకుని రెండు మూడు గంటల తర్వాత సున్నిపిండితో బాగా రుద్ది కడుక్కుంటూ ఉంటే పాదాలు శుభ్రంగా ఉంటాయి.

5. నిమ్మరసం, వైట్‌ వెనిగర్‌ వేడినీరు సమాన భాగాలుగా తీసుకుని దానిలో ఒక బ్రష్‌ ముంచి ఆ మిశ్రమాన్ని గోళ్లమీద రాయాలి. గోళ్లు చక్కని మెరుపు సంతరించుకోవడానికి ఇది మంచి మార్గం.

6. నీటిలో బాగా నానడం వలన పాచిపోయిన కాళ్లు వేళ్ల సందుల్లో జాజికాయ నూరి పైకి పూయాలి. ఇది యాంటిఫంగల్‌ శక్తి ఉంది.

7. నిగారింపైన చర్మం కోసం కోడిగుడ్డులోని తెల్లసొనలో అర టీ స్పూన్ పాల పొడి, కొన్నిచుక్కల నిమ్మరసం వేసి బాగా కలపాలి. దీన్ని ముఖానికి పట్టించి 15 నిమిషాల తరవాత కడిగేయాలి. ఈ విధంగా మూడు రోజులకి ఒకసారి చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

8. ముందగా టొమాటో తొక్క తీసి గుజ్జు చేసుకోవాలి. ఆ తర్వాత మెత్తగా ఉడికించిన అన్నంలో టొమాటో గుజ్జు, రెండు టీ స్పూన్ల నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒంటికి పట్టించి పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే చర్మం కోమలంగా ఉండి నిగారింపు పెరుగుతుంది. ఇలా నెలకు రెండుసార్లు చేస్తే బాగుంటుంది.

English summary

Ayurvedic home remedies for Beauty Skin... | ఆయుర్వేదంతో నిగారింపైన చర్మం....

Naturally fresh and healthy skin is protector of body and a thing of beauty. Ayurveda our ancient science of medicine has suggested many herbal remedies and natural methods to protect our skin from pimples, acne, dark circles, wrinkles and marks left by pimples and to increase the fairness of the skin.
Story first published: Wednesday, February 15, 2012, 11:57 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more