Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
కోమలమైన..కాంతివంతమైన చర్మానికి క్యాబేజీ...

ఎప్పటికప్పుడు ముఖం మీద మృతకణాలు తొలగించుకోవాలి. రాత్రిపూట తప్పనిసరిగా చర్మాన్ని శుభ్రం చేసుకోవాలి. అలానే మెడ, పెదవులను నిర్లక్ష్యం చేయకూడదు, బరకగా ఉన్న బియ్యంపిండిని కొద్దిగా తీసుకుని కొద్ది నీటితో పేస్ట్ లా చేసుకుని ముఖానికి పూతలా వేయాలి. ఆరాక కడిగేసుకుంటే మృత చర్మం ఎక్కువ సేపు తాజాదనంతో మెరుస్తూ మృదుత్వాన్ని సంతరించుకుంటుంది. అలాగే మరోపని కూడా చేయవచ్చు. చిన్న ఐసుముక్కను తీసుకుని ముఖానికి రుద్దుకోవాలి. కాసేపయ్యాక మేకప్ వేసుకుంటే ముఖం ఎక్కువ సమయం తాజాగా ఉంటుంది.
అరకప్పు క్యాబేజీ తురుము తీసుకుని మెత్తగా చేసి ముఖానికి పూతలా వేయాలి. పదినిమిషాలయ్యాక కడిగేయాలి. ఇది సహజసిద్దమైన మాయిశ్చరైజర్ లా పనిచేస్తుంది. అయితే క్యాబేజీ ఫేస్ ప్యాక్ ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్నాయి. వీటన్నింటి తర్వాతే మేకప్ వేసుకోవాలి.
ముఖంపై పేరుకున్న మురికి, జిడ్డును తొలగించే ప్యాక్ ఇది. క్యాబేజీ, క్యారెట్, టమోట ముక్కలను సమపాళ్లలో తీసుకొని మెత్తని పేస్టులా చేయాలి. ముందుగా ముఖాన్ని చల్లటి నీటితో కడిగేశాక ఈ ముఖాన్ని చల్లటి నీటితో కడిగేశాక..ఈ మిశ్రమాన్ని ఫ్యాక్ లా వేయాలి. ఐదు నిమిషాలయ్యాక మునివేళ్లతో వలయాకారంలో మర్దన చేయాలి. ఆరాక చన్నీటితో ముఖం కడిగేసుకొని ముల్తానీ మట్టితో ముఖం మెడకు ప్యాక్ వేయాలి. కాసేపయ్యాక కడిగేసి నాణ్యమైన మాయిశ్చరైజర్ రాస్తే..చర్మం తాజాదనాన్ని సంతరించుకుంటుంది.
క్యాబేజీ ఆకులను పేస్ట్ చేసి రసాని వేరుచేయాలి. దీనికి రెండు చెంచాల శనగపిండి, చెంచా తేనె కలపాలి. ఈ మిశ్రమాని ముఖానికి రాసుకొని పావుగంటయ్యాక తడి దూదితో తొలగించాలి. ఇది చర్మంపై పేరుకొన్న మురుకిని తొలగించి కాంతివంతంగా మార్చుతుంది.
ముడతలు ఎక్కువగా ఉంటే కొంచెం క్యాబేజీ జ్యూస్ తీసుకుని దానికి టీ స్పూన్ తేనె జత చేసి ముఖానికి అప్లై చేయండి. రెగ్యులర్‌గా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.



Click it and Unblock the Notifications