Latest Updates
-
హరిద్వార్ లో ఎండిపోయిన గంగానది? మగ్గులతో భక్తుల పుణ్యస్నానాలు..వీడియో చూడండి -
జుట్టు రాలడం ఆగి, ఒత్తుగా పెరగాలా? అయితే మెంతులను ఈ 3 రకాలుగా వాడండి -
నోరూరించే పనీర్ కొబ్బరి మసాలా..మళ్లీ మళ్లీ కావాలని అడిగి మరీ చేయించుకుంటారు -
గోధుమ పిండిలో ఈ 5 పదార్థాలు కలిపితే..జీవితంలో హాస్పిటల్స్ కు వెళ్లాల్సిన పనే ఉండదు! -
లివర్ ఆరోగ్యంగా, క్లీన్ గా ఉండాలంటే డాక్టర్ చెప్పిన 5 సింపుల్ టిప్స్.. -
ఇంట్లోనే హోటల్ స్టైల్ దోశ పిండి..ఎలా తయారుచేసుకోవాలో చూడండి -
రచితో పాటే ఆరోగ్యం కూడా..గోధుమ రవ్వ పొంగల్ ఇలా చేస్తే..తింటుంటే మర్చిపోలేని మజా.. -
డ్రమ్ లో శవమవడం కంటే ఇదే బెస్ట్.. భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించిన భర్త.. నెటిజన్ల ప్రశంసలు -
చుక్క నూనె లేకుండానే బెస్ట్ స్నాక్..ఒక్కటితో ఆగరు,అంత రుచిగా ఉంటుంది! -
పెళ్లి కాని ప్రసాద్ లు చూస్తే ఏడ్చేస్తారు.. కుక్కను పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చిన బ్యూటీ!
ముఖానికి ఇంట్లో తయారు చేసుకొనే క్లెన్సింగ్ ప్యాక్...

చర్మం పై పేరుకున్న దుమ్ము ధూళి తొలగిపోయి పరిశుభ్రంగా ఉండటమే కాదు, ప్రత్యేక మెరుపు సంతరించుకోవాలంటే క్లెన్సింగ్ బాగా ఉపయోగపడుతుంది. క్లెన్సింగ్ కూడా చర్మ సంరక్షణలో ఒక ప్రధానమైన చర్య. క్లెన్సింగ్ అప్లై చేసి, శుభ్రపరచుకుంటే దుమ్ము, ధూళి అంతా పోయి చర్మం ఎలాంటి ముడుతలూ లేకుండా తాజా పండులా తయారవుతుంది. మేకప్‌కు కూడా ఎంతో సహకరిస్తుంది. కాబట్టి చర్మాన్ని మృదువుగా ఉంచేందుకు, కాంతివంతంగా చేసేందుకు క్లెన్సింగ్ ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం....
1. పుదీనా మాస్క్: కొద్దిగా పుదీనా ఆకులు, ఒక టీస్పూన్ రోజ్ వాటర్ తో పుదీనా మాస్క్ వేసుకోవాలి. పుదీనా ఆకులను కడిగి పొడిచేసుకోవలెను. రోజ్ వాటర్‌తో కలిపి పేస్టుగా చేసుకొని దీనిని ముఖానికి అప్లై చేసి ఒక గంట తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
2. బొప్పాయి పండు మాస్క్: బొప్పాయి ముక్కలను బాగా చిదిమి గుజ్జులా చేసి అది ముఖానికి, మెడకు పట్టించి అరగంట తర్వాత చన్నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మంచి కాంతి వస్తుంది.
3. టమోటా మాస్క్: ఇది జిడ్డు చర్మమానికి బాగా పనిచేస్తుంది. బాగా పండిన ఒక టమోట, నిమ్మతొక్క పొడి, ఒక టీస్పూన్ నిమ్మరసంతో టమోటా మాస్క్ తయారు చేసుకోవచ్చు. టమోట గుజ్జు తయారుచేసి దానిలో నిమ్మతొక్క పొడి మరియు నిమ్మరసం కలిపి. ముఖమునకు పూసి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి.
4. హెర్బల్ క్లీన్సింగ్ క్రీము: 2 చెంచాలు మంచి కొబ్బరి నూనె, 5 చెంచాలు ఆలివ్ ఆయిల్, 2 చెంచాలు గ్లిజరిన్, 4 చెంచాలు తేనె మైనం, 5 చెంచాలు దోసకాయ రసం, చిటికెడు బోరెక్స్: మైనం కొబ్బరినూనె, ఆలివ్ ఆయిలు, 2 సార్లు వేడి చేసుకోవాలి. దోసకాయ రసం, గ్లిజరిన్, బోరెక్సు, విడివిడి పాత్రలలో వేడి చెయ్యాలి. బోరెక్సును మాత్రం పూర్తిగా కరిగేవరకు వేడిచెయ్యాలి. ఈ మూడింటిని ఆయిల్ మిశ్రమంలో బాగా కుంచుతో గట్టిపడేవరకు కలియబెట్టాలి. చల్లారిన తర్వాత ఉపయోగించుకొనవచ్చును. ఫ్రిజ్‌లో దాచుకోవచ్చును.
5. గోధుమరవ్వ మాస్కు: 1 చెంచా గోధుమరవ్వ, 1/2 చెంచా ఓట్మీల్, 1 చెంచా ఆలివ్ అయిల్, 1 చెంచా ఫ్రెష్ క్రీము(మీగడ), ముందు గోధుమరవ్వ మరియు ఓట్మీల్ కలిపి ఈ మిశ్రమమును ఆలివ్ ఆయిల్, క్రీము కలిపి, పేస్టుగా తయారుచెయ్యాలి. ఈ మిశ్రమాన్నిముఖానికి రాసుకున్నఅరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి.



Click it and Unblock the Notifications
