Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
నిద్రించే ముందు చర్మానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు

క్లీన్: మీ ముఖం కాంతివంతంగా అందమైన చర్మం మీ సొంతం కావాలంటే ముఖ్యంగా నిద్రకు ఉపక్రమించే ముందు మేకప్ ను తొలగించాలి. మనం నిత్యం ఉపయోగించే అన్ని రకాల సౌందర్య ఉత్పత్తుల్లో కెమికల్ ఉపయోగించి ఉంటారు కాబట్టి అవి రాత్రి సమయంలో అలాగే ఉంటే చర్మానికి హాని కలిగిస్తాయి. కాబట్టి వాటిని ప్రతి రోజూ నిద్రకు ఉపక్రమించే ముందు వాటిని తొలగించడం మంచిది. అందుకు మంచి ఆయిల్ ను ఉపయోగిస్తే సరిపోతుంది. ఆలివ్ ఆయిల్ బాదాం అయిల్ బాగా పనిచేస్తాయి. ఈ ఆయిల్ లో కాటన్ బాల్స్ ను ముంచి ముఖం, మెడ మీద రుద్ది మేకప్ ను తొలగించాలి. ఇది ఒక మంచి పద్దతి.
వాష్: నిద్రపోయే ముందు ముఖాన్ని సోపుతో శుభ్రం చేసుకోవాలి. ఈ పద్దతిని ప్రతి రోజూ అలవాటు చేసుకోవాలి. ముఖం కడేగే ముందు ముఖాన్ని ఫేష్ వాష్ రెండు మూడు నిమిషాలు బాగా మర్ధన చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మ రంధ్రాలు తెరచుకొనేలా చేసి దుమ్ము.. ధూళిని తొలగిస్తుంది.
హైడ్రేట్: మీ ముఖాన్ని ఎప్పుడూ తేమగా ఉండేట్లు చూసుకోవాలి. అందుకోసం కొన్ని చేతిలోకి కొంచెం మాయిశ్చరైజింగ్ క్రీము , కొన్ని నీళ్ళు తీసుకొని , రెండు చేతులతో బాగా రుద్ది ముఖానికి బాగా మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల మీ ముఖంలోని చర్మ రంధ్రాలను తెరచుకొనేలా చేసి తేమగా ఉంచేలా చేస్తుంది.
నీళ్ళు ఎక్కువగా తాగాలి: ఎంత మంచి ఆహారం తీసుకొన్ని శరీరానికి కావల్సినంత నీరు తీసుకోకపోతు బాహ్య చర్మం నిర్జీవంగానే కనిపిస్తుంది. కాబట్టి నీటిని ఎక్కువగా తాగాలి. కనీసం రోజుకు 8 నుండి 12 గ్లాసుల నీరు త్రాగాలి. ఇది ఆరోగ్యానికి, చర్మాన్ని టైట్ గా ఉంచడానికి బాగా ఉపయోగపడుతుంది. నీరు ఎక్కువగా తాగకపోతే చర్మం పొడి బారి, మొటిమలు రావడానికి దారితీస్తుంది. నిద్రకు ఉపక్రమించడానికి ముందు తప్పనిసరిగి 1 లేదా 2గ్లాసుల నీళ్ళు తాగాలి. ఇలా చేయడం వల్ల శరీరంలోని చెడు తొలగించి ఉదయాన్నే తాజాగా ఉంచుతుంది. మీ చర్మం కాంతివంతంగా మెరవాలంటే మీరు నిద్రపోయే ముందు నీళ్ళు తాగితే మీకు అది సాధ్యం అవుతుంది.
మీరు నిద్రించే బెడ్ ను ఒకసారి పరీక్షించండి: చాలా సార్లు మీ బెడ్ వల్ల కూడా చర్మంలో దద్దుర్లు, చర్మ ఇన్ఫెక్షన్ కు గురిఅవుతుంటుంది. అందుకు కారణం బెడ్ శుభ్రంగా లేకపోవడం, దుమ్ము, ధూళి, క్రిములు అందులో చేరడం వల్ల. రెండు మూడు రోజులకొకసారి లేదా వారానికి ఒక సారి బెడ్ కవర్, పిల్లో కవర్స్ ను మార్చుతుండాలి. సిల్స్, పాలిస్టర్ కవర్స్ వాడకపోవడం మంచిది. ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తే మీ చర్మం నిద్రలేవగా కాంతివంతంగా మెరుస్తుంటుంది. రోజంతా తాజాగా ఉండేలా చేస్తుంది.



Click it and Unblock the Notifications