Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
చర్మ సౌందర్యంలో పెరటి మొక్కల ప్రాధాన్యత

తులసి: పాడైన కణాలను తొలగించి, మన చర్మాన్ని కోమలంగా ఉండేలా తులసి ఆకుల రసం పనిచేస్తుంది. వీటిని క్రమం తప్పకుండా తింటే ముఖంపై మచ్చలు పోతాయి. నిత్యం కనీసం ఏడు తులసి ఆకులను తింటే శరీరానికి మంచిది. ఇక ఈ తులసిలో ఉన్న ఔషధగుణాలేంటంటే ఆకలి పుట్టడానికి, ఆహారం జీర్ణం కావడానికి ఉపయోగపడటమే కాకుండా దగ్గుని పోగింట్టి, కఫాన్ని హరిస్తుంది. ఇది ఒక క్రిమిహరం, దుర్గంధనాశకం.
పుదీనా: ఈ ఆకులను మెత్తగా నూరి ముఖంపై ‘ప్యాక్' వేసుకుంటే మొటిమల సమస్య పోతుంది. చర్మం కాంతివంతమవుతుంది. జిడ్డు చర్మంతో బాధపడేవారికి ఉపశమనం కలుగుతుంది. పుదీనాను పేస్ట్ లా చేసి ముఖానికి పట్టించి అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేస్తే చర్మం తాజాగా ఉండటమే కాకుండా చర్మం సంబంధిత అలర్జీలు సోకకుండా కాపాడుతుంది.
మెంతి: చర్మ సౌందర్యానికి, కురుల పోషణకు మెంతి ఆకులను వాడతారు. వీటి ఆకులను మెత్తగా రుబ్బి, కురులకు పట్టిస్తే చుండ్రు సమస్య తీరుతుంది. జట్టు రాలడం తగ్గుతుంది.. మెంతి ఆకుల రసంలో కొంది పసుపు, నిమ్మరసం కలిపి ముఖానికి , మెడకు అప్లై చేసి ఆరిన తర్వాత శుభ్ర పరచుకుంటే ముఖం కాంతి వంతంగా తయారవుతుంది.
గోరింటాకు: శిరోజాలకు చక్కని ‘కండిషనర్'గా గోరింటాకు పనిచేస్తుంది. వేడిని తగ్గించి, చర్మాన్ని చల్లబరిచే గుణం ఈ ఆకుల్లో ఉంది. గోరింటాకు మెత్తగా నూరి అరికాల్లలో కనుక రుద్దినట్లైతే శరీరంలోని వేడినింతటిని తగ్గించి, శరీరాన్ని చల్లబరుస్తుంది. గోరింటాకు పొడి తలకు పెట్టడం వల్ల కూడా కేశాలను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు. తలను చల్లబరుస్తుంది.
మందార: వీటి ఆకులను మెత్తగా రుబ్బి కురులకు పట్టిస్తే మంచి నిగారింపు వస్తుంది. ఆకులను బాగా ఎండబెట్టి కొబ్బరినూనెలో వేయాలి. ఆ తర్వాత నూనెను తలకు రాసుకుంటే శిరోజాలు నల్లగా, వొత్తుగా పెరుగుతాయి. జట్టు రాలడం కూడా తగ్గుతుంది.
వేప: కాంతి తగ్గిన చర్మానికి, మొటిమలు తేలిన ముఖానికి ఈ ఆకుల ముద్దను రాస్తే మంచి ఫలితం ఉంటుంది. వేప ముద్దను జుట్టు కుదుళ్లకు, కేశాలకు పట్టిస్తే జుట్టు రాలడం తగ్గుతుంది. కురులు తళతళలాడతాయి.
నీలగిరి: నీటిలో ఈ ఆకులను వేసి మరగించాలి. అపుడు వెలువడే వేడిని ముఖానికి పట్టుకుంటే ఉపశమనం ఉంటుంది. ముఖం, చర్మం కాంతివంతమయ్యేలా ఈ ఆకులను వాడవచ్చు.
కరివేపాకు: కురులు వొత్తుగా పెరిగేందుకు, తళతళలాడేందుకు ఈ ఆకులతో ‘హెయిర్ ప్యాక్' వేసుకోవాలి. కేశాలు గట్టిపడతాయి.
కర్పూరం: ఈ ఆకుల్లో ‘యాంటిసెప్టిక్', ‘యాంటీ బాక్టీరియల్' లక్షణాలు అధికంగా ఉంటాయి. ముఖానికి వేసుకునే ‘ప్యాక్'లో రెండు చుక్కల కర్పూరం ఆకుల రసాన్ని కలిపితే మొటిమలు త్వరగా పోతాయి. చర్మం కోమలంగా తయారవుతుంది.



Click it and Unblock the Notifications