Latest Updates
-
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్‌గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.? -
గుడిలో పెట్టే ప్రసాదం రుచితో.. ఈ జన్మాష్టమికి ఇంట్లోనే కమ్మని పంచామృతం చేసుకోండిలా.. -
చుక్క నూనె లేకుండా లంచ్ బాక్స్‌లోకి ఈజీగా చేసెయొచ్చు.. రక్తహీనతని సైతం తరిమికొట్టేస్తుంది.! -
Powerful Krishna Mantras: కృష్ణాష్టమి నాడు ఈ మంత్రాలు జపిస్తే.. మీ కోరికలన్నీ ఇట్టే నెరవేరుతాయి!
జాగ్రత్తలు తీసుకున్నా మొటిమలు తగ్గకపోతే....!?

1. మొటిమలు సాధారణంగా ఒత్తిడి, అలసట, నీరసం వంటివి మొటిమలు రావడానికి దోహదం చేస్తాయి.
2. చర్మానికి పడని సౌందర్యసాధనాలు ఉపయోగించినప్పుడు కూడా మొటిమలు వచ్చే అవకాశం వుంది. కొన్ని రకాల సాధనాలు అందరికీ పడవు. వాటి గురించి తెలుసుకోకుండా వాడడం కూడా ప్రమాదమే.
3. హార్యోన్లలో సమతుల్యం లోపించినప్పుడు మొటిమల బాధ ఎక్కువగా వుంటుంది. మెనోపాజ్ దశకు చేరుకున్న స్త్రీలు కూడా కొన్ని సార్లు వీటిని బారీన పడుతుంటారు. అండ్రోజెన్ ఉప్పత్తి ఆగిపోయనప్పుడు తప్పనిసరిగా మొటిమలు వస్తాయని నిపుణులు అంటున్నారు.
4. విటమిన్ బి12 లోపంతో బాధపడే వారిలో ఎక్కువగా కనిపిస్తాయి. ముఖ్యంగా స్త్రీ లలో ఈ లోపం అధికంగా కనపడుతుంది.
5. ఎక్కువ వేడి, చెమట మొటిమలు రావడానికి కారణం కావచ్చు.
6. ముఖ్యంగా స్త్రీలు వంటింట్లో ఎక్కువ సేపు పొగ, నూనె మధ్య గడిపే వారికి మొటిమలు వచ్చే అవకాశముందని సర్వేలు తేలుస్తున్నాయి.
మొటిమలు నివారణ ఇలా...
మందులు, స్కిన్ ట్రీట్ మెంట్ తీసుకోవడం ద్వారా వీటి నుంచి తప్పించుకోవచ్చు. వీటితో పాటు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. అవేంటంటే...మొదటగా మొటిమలను గిల్లడం, గిచ్చడం చేయకూడదు. గోరువెచ్చని నీటితో రోజుకు 4 నుండి 6 సార్లు శుభ్రపరుచుకోవాలి. డాక్టర్ సలహా లేకుండా రకరకాల క్రీములను, లోషన్‌లను వాడకూడదు. సున్నిపిండితో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం చాలా మంచిది. రోజుకు సరిపోయేంతగా నిద్రపోవాలి. కనీసం ఆరు గంటలు నిద్రపోవాలి. ఫాస్ట్‌ఫుడ్స్, ఆయిల్‌ఫుడ్స్, స్వీట్లు, నిల్వ ఉన్న ఆహారపదార్థాలు తినకూడదు. ప్రకృతి సిద్ధమైన పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. మొలకెత్తిన విత్తనాలు, ఆకుకూరలు, పండ్లు, కాయగూరలు ఎక్కువగా తీసుకోవాలి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. ప్రతీరోజూ విధిగా కొంత సమయం యోగా, వ్యాయామం చేయడం వల్ల అధిక ప్రయోజనం పొందవచ్చు.
1. నూనె సంబంధిత క్రీములు, ఆయింట్మెంట్లు వాడడం పూర్తిగా మానుకోవాలి.
2. ముఖం మీద చిన్న పొక్కులు కనిపించిన వెంటనే దానిని చిదమడంకానీ, గిల్లడం కానీ చేయకూడదు.
3. చర్మాన్ని తరచూ గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటూ ఉండాలి.
4. ఒత్తిడిని తగ్గించుకొనే కార్యక్రమాన్ని యజ్ఞంలా చేపట్టండి.
5. తీసుకొనే ఆహారంలో విటమిన్ బి12తప్పనిసరిగా తీసుకొనేటట్లు చూసుకోవాలి.
6. నూనెతో చేసిన పదార్థాలను మితంగా తీసుకోవాలి. లేదా పూర్తిగా మానేయడమే మంచిది.
7. జాగ్రత్తలు తీసుకున్నా మొటిమలు తగ్గకపోతే వెంటనే సంబంధిత వైద్యుడిని సంప్రదించాలి.
8. కాలిబ్రోమేటం : మొటిమలకు ఇది ముఖ్యమైన మందు. టీనేజ్‌లో వచ్చే అన్ని రకాల మొటిమలను ఈ మందు తగ్గిస్తుంది. మొటిమలు ముఖంపై, ఛాతీపై వచ్చి చీము ఉండటం, దురదగా అనిపించడం ఈ మందులో గమనించదగిన లక్షణం.



Click it and Unblock the Notifications