For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అధిక జిడ్డు..కాలుష్యం నుండి బయటపడం ఎలా?

|

Honey is a Natural fit for a variety of moisturizing..
సౌందర్యంగా ఉండాలంటే మనిషి ఆరోగ్యంతో పాటు, ఆహారపు అలవాట్లు, వాతావరణ స్థితిగతులు అన్ని సక్రమంగా ఉన్నపుడే ఆ మనిషి యొక్క సహజ సౌందర్య గుణాలు బయటపడుతాయి. ప్రస్తుత కాలంలో కాలుష్యం వల్ల అధికజిడ్డు..మురికి వంటి సమస్యలు చర్మాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ఈ సమస్యను నివారించాలంటే..ఇంటి దగ్గర చేసుకునే చిన్న చిన్న సౌందర్య చిట్కాలు పాటించండి.

1. పాల మీగడను రెండుగంటల ముందుగా ఫ్రిజ్ లో ఉంచండి. ఆ తర్వాత తీసి ముఖానికి మాయిశ్చరైజర్ రాసుకుంటే చాలు. దీని వల్ల చర్మంపై పేరుకున్న రుమ్ముధూళి తొలగిపోయి శుభ్రపడుతుంది.
2. కాచిన పాలలో కొద్దిగా నిమ్మ రసం కలిపితే ఆ మిశ్రమం చక్కని బ్లీచింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. ఆ మిశ్రమాన్ని మెడకు, చేతులకు పట్టించి ఎండనివ్వాలి. ఆ తరువాత దాన్ని వెచ్చని నీటితో కడిగితే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
3. రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెలో ఒక టీ స్పూన్ కర్పూరం పొడి కలిపి ముఖం, మెడ చేతులకు పట్టించడంది. అరగంటయ్యాక స్నానం చేయండి. దీని వల్ల చర్మానికి తాజాదనం అందుతుంది. మృదువుగానూ మారుతుంది.
4. ముఖంపై అధికజిడ్డు, మురికి పేర్కొని..కళ్లకింది నల్లని వలయాలు బాధిస్తుంటే రెండు టీస్పూన్ల పాలపొడిలో, 1టీస్పూన్ తేనె కలిపి గంట సేపు ఫ్రిజ్ లో ఉంచాలి. ఆ తరువాత ముఖానికి పూతలా రాయాలి. అరగంట అయ్యాక చల్లటి నీటితో కడిగేసుకుంటే చాలు ఎంతో మార్పు కనిపిస్తుంది.
5. స్నానానికి అరగంట ముందుగా నిమ్మరసం, గ్లిజరిన్ సమపాళ్లలో తీసుకుని శరీరానికి రాసుకొని చూడండి తేటగా మారిని మేని కాంతి మీ సొంతమవుతుంది.

English summary

Honey is a Natural fit for a variety of moisturizing.. | అధిక జిడ్డు..కాలుష్యం నుండి బయటపడం ఎలా?

Honey is a strong anti-inflammatory agent that prevents infections and reduces the existing ones when applied on problem or sensitive skin type. The skin’s ability to stay hydrated is an important factor in its ability to maintain softness, suppleness and elasticity. As skin ages, or as it is exposed to environmental stresses and chemical agents, it loses this ability to retain water, becomes dry and appears wrinkled.
Story first published:Monday, January 16, 2012, 11:51 [IST]
Desktop Bottom Promotion