Latest Updates
-
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు! -
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.! -
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.?
వేసవిలో టై ఇన్ షర్ట్ తో వచ్చే చిక్కులు...!

ముఖ్యంగా స్నానానికి వాడే సబ్బులపై దృష్టి పెట్టాలి. వేసవిలో పిహెచ్ బాలెన్స్ తక్కువగా ఉన్న సబ్బుల్ని ఉపయోగించాలి. మరీ ముఖ్యంగా ముఖాన్ని కడిగేటప్పుడు ఈ జాగ్రత్త తప్పనిసరి. పొడిచర్మం వాళు పిహెచ్ బాలెన్స్ తక్కువగా ఉన్న సబ్బులు వాడితే చర్మ సమస్యలు తలెత్తవు. క్లెన్సర్స్ వాడే అలవాటు ఉంటే కనుక వాటితోపాటు స్కిన్ టోనర్ వాడాలి. మాయిశ్చరైజర్ వాడకాన్ని మరిచిపోకూడదు. దాహానికి నీళ్లు ఎలాగో చర్మానికి మాయిశ్చరైజర్ అలాగన్నమాట.
సన్ స్క్రీన్ తో రక్షణ: సన్ స్క్రీన్స్ వాడకం మిగతా సీజన్లలో ఎలా ఉన్నప్పటికీ ఈ సీజన్లో మాత్రం తప్పనిసరి. సన్ స్క్రీన్స్, సన్ బ్లాక్స్ వాడకం వల్ల ఎండపడిన చర్మం పొడిబారి, ముడతలు పడకుండా ఉంటుంది. ముఖానికికే కాకుండా ఎండసోకే శరీరభాగాలకి, పెదవులకి అదనంగా కేర్ తీసుకోవాలి. ఎండ తీవ్రత తాలూకు ప్రభావం నుంచి కాపాడేందుకు పెదవుల మీద రక్షణ కవచంగా పనిచేసే మెలనిన్, నూనె గ్రంధులు ఉండవు. అందుకని వేసవిలో పెదవులకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే పెదవులు పొడిబారిపోయి, పగిలిపోయి, మంటపెడతాయి. ఇలా పగిలిపోయిన పెదాలను తిరిగి మామూలు స్థితికి తెచ్చేందుకు చాలా రోజుల సమయం పడుతుంది. అందుకని ముందునుంచే జాగ్రత్తగా ఉండాలి.
మండుటెండల్లో కూడా పెద్ద పెద్ద నగరాల్లో చాలామంది ఇన్‌షర్ట్ చేసుకుని తిరుగుతుంటారు. మార్కెటింగ్ రంగంలో ఉన్న వాళ్లయితే చెమటలు కక్కుకుంటున్నప్పటికీ మెడకు టై, కాళ్లకు బూట్లు వేసుకోవటం మాత్రం మానరు. వేసవి కాలంలో చర్మానికి కలిగే సర్వానర్థాలకూ ఈ ఇన్‌షర్ట్, టై, కాలర్, బూట్లు కారణం అని తెలిస్తే ఆశ్చర్యం కలుగక మానదు. ముందుగా ఇన్‌షర్ట్. మీరు కాటన్ షర్టు, ప్యాంటు వాడినా, పలుచటి దుస్తులు ధరించినా, వేసవి సీజన్‌కు సరిపడా దుస్తులు వేసుకున్నా ఇన్‌షర్ట్ వేయడం మానకుంటే మాత్రం మీ చర్మ సంరక్షణ పద్ధతులు అన్నీ వృధాయే ఎందుకంటే లోన వేసుకొనే వస్త్రాలు టైట్ గా ఉన్నా, ఒకదానిమీద ఒకటి టైట్ గా వేసుకొన్నా, బనియన్ దానిమీదకి షర్టు, దాని మీదికి ప్యాంటు ఇలా చర్మాన్ని మూడు మడతల కింద కుదేసి చుట్టేస్తే దానికి బయటగాలి అందక చర్మం ముడతుల, దద్దుర్లు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి మగవారికి కూడా వేసవి నుండి చర్మానికి రక్షణ అవసరం. వేసవిలో తగినటువంటి దుస్తులు, రోజూ స్నానం, మెన్ సన్ స్రీన్ లోషన్లు వాడటం వల్ల వేడి వేసవి వేడి నుండి బయట పడవచ్చు.



Click it and Unblock the Notifications