For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వేసవిలో టై ఇన్ షర్ట్ తో వచ్చే చిక్కులు...!

|

How to Deal With Summer Skin Problems
వేసవి కాలం వచ్చిందంటే చాలా చర్మం సంరక్షణ కోసం అనేక చిట్కాలు చెబుతుంటారు. అలాంటి వాటిలో చమటకాయలు, చర్మబొబ్బలెక్కడం, సన్ బర్న్ ఇంటాంటి వాటితో బాధ పడుతుంటారు. వేసవి కాలం వచ్చిందంటే చాలు నీళ్లు ఎక్కువగా తాగాలి... ఎండలో బయటికి వెళ్లేటప్పుడు టోపీ పెట్టుకోవాలి లేదా గొడుగు వేసుకెళ్లాలి అంటూ బోలెడు జాగ్రత్తలు చెప్తుంటారు. వీటన్నింటితో పాటు చర్మ సంరక్షణ కోసం మరికొన్ని జాగ్రత్తలు తీసుకొంటు వేసవి నుండి తప్పించుకోవచ్చు.

ముఖ్యంగా స్నానానికి వాడే సబ్బులపై దృష్టి పెట్టాలి. వేసవిలో పిహెచ్ బాలెన్స్ తక్కువగా ఉన్న సబ్బుల్ని ఉపయోగించాలి. మరీ ముఖ్యంగా ముఖాన్ని కడిగేటప్పుడు ఈ జాగ్రత్త తప్పనిసరి. పొడిచర్మం వాళు పిహెచ్ బాలెన్స్ తక్కువగా ఉన్న సబ్బులు వాడితే చర్మ సమస్యలు తలెత్తవు. క్లెన్సర్స్ వాడే అలవాటు ఉంటే కనుక వాటితోపాటు స్కిన్ టోనర్ వాడాలి. మాయిశ్చరైజర్ వాడకాన్ని మరిచిపోకూడదు. దాహానికి నీళ్లు ఎలాగో చర్మానికి మాయిశ్చరైజర్ అలాగన్నమాట.

సన్‌ స్క్రీన్‌ తో రక్షణ: సన్‌ స్క్రీన్స్ వాడకం మిగతా సీజన్లలో ఎలా ఉన్నప్పటికీ ఈ సీజన్లో మాత్రం తప్పనిసరి. సన్‌ స్క్రీన్స్, సన్ బ్లాక్స్ వాడకం వల్ల ఎండపడిన చర్మం పొడిబారి, ముడతలు పడకుండా ఉంటుంది. ముఖానికికే కాకుండా ఎండసోకే శరీరభాగాలకి, పెదవులకి అదనంగా కేర్ తీసుకోవాలి. ఎండ తీవ్రత తాలూకు ప్రభావం నుంచి కాపాడేందుకు పెదవుల మీద రక్షణ కవచంగా పనిచేసే మెలనిన్, నూనె గ్రంధులు ఉండవు. అందుకని వేసవిలో పెదవులకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే పెదవులు పొడిబారిపోయి, పగిలిపోయి, మంటపెడతాయి. ఇలా పగిలిపోయిన పెదాలను తిరిగి మామూలు స్థితికి తెచ్చేందుకు చాలా రోజుల సమయం పడుతుంది. అందుకని ముందునుంచే జాగ్రత్తగా ఉండాలి.

మండుటెండల్లో కూడా పెద్ద పెద్ద నగరాల్లో చాలామంది ఇన్‌షర్ట్ చేసుకుని తిరుగుతుంటారు. మార్కెటింగ్ రంగంలో ఉన్న వాళ్లయితే చెమటలు కక్కుకుంటున్నప్పటికీ మెడకు టై, కాళ్లకు బూట్లు వేసుకోవటం మాత్రం మానరు. వేసవి కాలంలో చర్మానికి కలిగే సర్వానర్థాలకూ ఈ ఇన్‌షర్ట్, టై, కాలర్, బూట్లు కారణం అని తెలిస్తే ఆశ్చర్యం కలుగక మానదు. ముందుగా ఇన్‌షర్ట్. మీరు కాటన్ షర్టు, ప్యాంటు వాడినా, పలుచటి దుస్తులు ధరించినా, వేసవి సీజన్‌కు సరిపడా దుస్తులు వేసుకున్నా ఇన్‌షర్ట్ వేయడం మానకుంటే మాత్రం మీ చర్మ సంరక్షణ పద్ధతులు అన్నీ వృధాయే ఎందుకంటే లోన వేసుకొనే వస్త్రాలు టైట్ గా ఉన్నా, ఒకదానిమీద ఒకటి టైట్ గా వేసుకొన్నా, బనియన్ దానిమీదకి షర్టు, దాని మీదికి ప్యాంటు ఇలా చర్మాన్ని మూడు మడతల కింద కుదేసి చుట్టేస్తే దానికి బయటగాలి అందక చర్మం ముడతుల, దద్దుర్లు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి మగవారికి కూడా వేసవి నుండి చర్మానికి రక్షణ అవసరం. వేసవిలో తగినటువంటి దుస్తులు, రోజూ స్నానం, మెన్ సన్ స్రీన్ లోషన్లు వాడటం వల్ల వేడి వేసవి వేడి నుండి బయట పడవచ్చు.

English summary

How to Deal With Summer Skin Problems...! | టై...ఇన్ షర్ట్ తో వచ్చే చిక్కులు....!

We wait for summer weather all winter and when it finally arrives we want to show off our skin. But the warm sunny days of summer also bring along skin damaging culprits, such as sun damage, bug bites, summer acne and poison ivy. So take care of your skin, combat summer skin problems before they begin and enjoy having fun in the sun. Summer is a season when you prefer loose fitting clothes over slim-fits to remain fresh and comfortable throughout office hours. So try monochromatic shirts or the shirtdress in different prints or in single tones,
Story first published:Monday, May 7, 2012, 11:50 [IST]
Desktop Bottom Promotion