Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
చేతుల సంరక్షణ...జాగ్రత్తలు...

1. మనం చేసే పనులన్నీ చేతుల ద్వారానే జరుగుతాయి. అన్నం తిన్నా, ముక్కు చీదినా, పేడతీసినా చేతితోనే చేస్తాం. ఇన్ని రకాల పనులు చేసేటప్పుడు ఆ పనికి సంబంధించిన మలినాలన్నీ చేతికి అంటుకుంటాయి.
2. గోళ్ళుపెద్దవిగా ఉంటే గోటి క్రింద మట్టి రూపంలో నిలువ ఉంటాయి. కాబట్టి గోళ్ళను పొట్టిగా, శుభ్రంగా ఉంచుకోవాలి.
3. మల విసర్జన తరువాత, భోజనం చేసే ముందు చేతులు సబ్బుతో కడుక్కోవాలి.
4. వంట చేయబోయే ముందు చేతులు కడుక్కోవాలి. పిల్లలు మట్టిలో ఆడుతుంటారు. కనుక తరచుగా చేతులు కడుక్కోవటం అలవాటు చేయాలి. తినడానికి ఏదైనా, ఇచ్చే ముందు సబ్బుతో చేతులు శుభ్రంగా ఉన్నాయో లేదో చూడాలి. గోళ్ళు ఎప్పటికప్పుడు తీసివేయాలి.
5. గోరువెచ్చని నీటిలో టీ స్పూన్ వెనిగర్ లేదా టీ స్పూన్ నిమ్మరసం కలిపి ఆ నీటితో క్రమం తప్పకుండా రెండు వారాలపాటు చేతులను శుభ్రం చేసుకుంటే అందమైన చేతులు మీ సొంతమవుతాయి.
6. రెండు టీ స్పూన్ల బాదం నూనెలో రెండు టీ స్పూన్ల నిమ్మరసం కలిపి చేతులను, అరిచేతి వేళ్లను క్రమం తప్పకుండా మసాజ్ చేసుకుంటే చేతులు గులాబి రేకుల్లా ఆకర్షణీయంగా ఉంటాయి.
7. అయిదారు టీ స్పూన్ల ఆలివ్ ఆయిల్ లో చిటికెడు చందనం పొడి కలిపి ఈ విశ్రమంతో చేతులు, అరచేతి వేళ్లని వారానికి రెండుసార్లు మసాజ్ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
8. ఏదైనా డిటర్జెంట్ మీ చేతులతో ఉపయోగించినప్పుడు పని పూర్తవ్వగానే నిమ్మచెక్కతో రుద్దండి. మీ చేతులు కోమలత్వంతో అందంగా తయారవుతాయి.



Click it and Unblock the Notifications
