For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తొలకరి జల్లులతో చర్మంలో మెరుపులు...!

|

వేసవి వేళ్లి వాతావరణం కొద్దికొద్దిగా చల్లబడుతూ అప్పుడప్పుడూ తొలకరి జల్లు పడుతుంటే ఆ ఆనందమే వేరు. వర్షం అన్న మాట వింటే చాలు! వాన చినుకులను చూస్తే చాలు! పిల్లలే కాదు.... పెద్దలు కూడా పసివాళ్లైపోతారు. చేతులు చాచి చిరుజల్లులను మనసారా ఆహ్వానిస్తారు. వర్షంలో బాగా తడిసి చిందులేస్తారు.

Is Rain Water Good For Your Skin..?

గుంపులు గుంపులుగా వచ్చే నల్ల మబ్బులు, పరుగులు తీసే పిల్ల గాలులు, చిటపట శబ్దం చేసే చిట్టి చినుకులు, తడిచి కొత్త అందాలను సంతరించుకునే ఆకు చాటు పిందెలు, కొమ్మ చాటు పూలు ప్రతి ఒక్కరినీ పరవశింపచేస్తాయి. వానాకాలపు ప్రత్యేకతే అది. ప్రకృతితోపాటు మనం కూడా పరవశించిపోతాం.

అయితే కొందరు మాత్రం ఆ ఆనంద సమయాన్ని ఆస్వాదించక వర్షంలో తడిస్తే బట్టలు పాడైపోతాయని, కురులు తడిసి పాడవుతాయని ఇబ్బంది పడుతుంటారు. మరికొందరేమో వర్షకాలంలో తమ చర్మం పాడవుతుందిని భయపడుతుంటారు. అయితే వర్షంలో తడటవటం వల్ల చర్మసౌందర్యం దెబ్బతీస్తుందనే స్పష్టంగా తెలియదు. వర్షంలో తడవడం వల్ల, ఈ నీరు చర్మానికి మంచి చేస్తుందా లేదా చెడు చేస్తుందా అన్న దానిపై కొందరి నిపుణుల నుండి కొన్ని అభిప్రాయాలున్నాయి.
మరి వర్షపు నీటిలో తడివడం వల్ల చర్మానికి ప్రయోజనాలున్నాయో లేదో చూద్దాం....

టాక్సిక్ రైన్: వర్షంలో తడవడం వల్ల చర్మానికి ప్రయోజనం కలుగుతుందని నిర్థారించడానికి ముందు ఒక్క విషయాన్ని మొదటగా పరిగణలోనికి తీసుకోవాలి. అదేంటంటే మీరు నివసించే ప్రదేశం. మీరు ఏ ప్రాంతంలో నివసిస్తున్నారు. ఒక వేళ మీరు కనుక పెద్దపట్టణాలకు, నగరాలకు దూరంగా నివసిస్తున్నట్లైతే, వర్షంలో తడిసినా ఎటువంటి హాని జరగదు. అటువంటి ప్రదేశంలో వాతావరణం ఎటువంటి కాలుష్యం లేకుండా ఉంటుంది. అక్కడ పడే వర్షం స్వచ్చమైన నీటిలో తడినా కూడా చర్మానికి ఎటువంటి హానీ కలుగదు. పట్టణాలలో నివసించేవరైతే మోటార్ వాహనాలు, వివిధ రకాల వాతావరణం, నీటి కాలుష్యం చర్మంపై ప్రభావం చూపిస్తుంది. కాలుష్య వాతావరణంతో వర్షపు నీరు జతపడి టాక్సిక్ రైన్ వాటర్(కలుషితపు వర్షపు నీరు)చర్మానికి హాలు కలిగిస్తుంది.

సాఫ్ట్ వాటర్: ప్రకృతి సహజమైనటువంటి వాతావరణంలో కనుక గడుపుతున్నట్లైతే అక్కడ పడే వర్షంలో తడిసినా ఎటువంటి హాని జరగదు. ఎందుకంటే ఎక్కువ చెట్లు ఉన్న చోట గాలి, వాతావరణం ఎప్పుడూ తాజాగానే ఉంటుందివ. మీరి ఈ తాజా గాలి, వాతావరణానికి స్వచ్చమైన వర్షపు నీరు చర్మాన్ని మరింత స్వచ్చంగా కనబడేలా చేస్తుంది. ఎందుకంటే ఆ వర్షపు నీటిలో ఆల్కలైన్ కలిగి ఉండదు కాబట్టి ఆ వర్షంలో తడిసినా ఒక్కో సందర్బంలో చర్మం నిగనిగ మెరుస్తుంటుంది. వాతావరణంలో కాలుష్యం ఉన్నప్పుడు ఆ వర్షపు నీటిలో తడిని చర్మం జిడ్డుగా కనిపిస్తుంది. వర్షపు నీటిని నిల్వ చేసుకొని ఆ నీటిని కాచి స్నానం చేసిన శరీరానికి స్వాంతనను కలిగిస్తుంది. కాబట్టి స్వచ్చమైన వర్షపు నీరు ఈ కాలంలో దొరకడం అంటే చాలా అరుదే.

వర్షంలో భావోద్యేగం: వర్షపు నీటిలో తడవడం వల్ల అది రసాయనికం కాకపోయినప్పటికీ, మానసికంగా చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఆ వర్షపు నీరు శరీరంపై, ముఖంపై పడుతున్నప్పు ఆ ఆనందం మనస్సులో నుండి బయటపడి పరవళ్ళు తొక్కే విధంగా ఉద్వేగపరుస్తుంది. అందుకే వర్షంలో ఎంత తడిసి ముద్దైనా సరే సంతోషమే సంతోషం.. ఆ సంతోషంలో చర్మం మరింత సచ్చతను చోటుచేసుకుంటుంది. కాబట్టి వర్షంలో తడవాలను కొన్నప్పుడు వేటి గురించి ఆలోచించకుండా తడిసి ముద్దై కేరింతలు కొడుతూ ఆనందగా గడపండి...

కొన్ని సూచనలు:
1. వర్షకాలం మొదలైన రెండు మూడు రోజుల్లో(తొలకరి జల్లుల్లో) తడవకూడదు. మొదటగా కురిసే వర్షపు నీరు వాతారవణంలోని కాలుష్యాన్ని వదలగొడుతుంది. కాబట్టి తర్వాత తర్వాత (వారం పొడవునా) వచ్చే వర్షపు నీటిలోఆనందించవచ్చు.
2. ఒక వేళ వర్షపు నీటిలో తడవడం వల్ల చర్మం పాడైనా, వర్షాకాలంలో చర్మ సంరక్షణకు వాటర్ ప్రూఫ్ లోషన్ ను అప్లై చేసుకొంటే ఎటువంటి హానీ జరగదు. వాటర్ ఫ్రూఫ్ సన్ స్ర్కీన్ లోషన్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ క్రీములను రాయడం వల్ల వర్షపు నీటిలో ఉండే రసాయనాల ప్రభావం చర్మంపై పడకుండా కాపాడుతుంది.

English summary

Is Rain Water Good For Your Skin..? | వర్షపు నీటితో చర్మం సౌందర్య...!


 Dancing in the rain is a childish fantasy that we all cherish. But as we grow older the freedom of doing so reduces drastically. We are constantly worried about our hair getting wet and our clothes getting spoiled. However, the biggest fear that most people have is of damaging their skin in the rains. It is not very clear whether rain water is good or bad for your skin. Different experts have different opinions on the matter.
Story first published: Wednesday, July 18, 2012, 15:57 [IST]
Desktop Bottom Promotion