Latest Updates
-
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.!
సినీ ప్రేక్షక ప్రపంచం మెచ్చిన సౌందర్యరాశి కాజల్.. బ్యూటీ సీక్రెట్
చందమామలాంటి మోముతో మగధీరుల మనసులను బృందావనం చేసిన హీరోయిన్ కాజల్ అగర్వాల్. యూత్ గుండెల్లో దడ పుట్టించి, అందరిచేత డార్లింగ్ అని ముద్దుగా పిలిపించుకుంటోంది. సినీ ప్రేక్షక ప్రపంచం మెచ్చిన సౌందర్యరాశి కాజల్. వన్నెతరగని అందంతో మెరిసిపోతూ ఉంటుది. కాజల్ అందమైన చర్మ సౌందర్యం కలదు. ఆమెలో దాగున్న అందం వెనుక స్కిన్ క్వాలిటీ. కాజల్ తన చర్మ, కేశ సౌందర్యానికి చాలా ప్రాధాన్యత ఇచ్చి కేర్ తీసుకుంటుంది. దాంతో ఆమె చర్మం ఎల్లప్పుడు స్కిన్ హైడ్రేషన్ కలిగి ఉండటం వల్ల చర్మం పొడిబారటం, ఆయిల్ కలిగి ఉండటం జరగవు. మరి అంత అందం ఎలా వచ్చిందో, తాను పాటించే టిప్స్ ఏంటో చూద్దాం..
నేచురల్ స్కిన్ : ఎల్లప్పుడు నేచురల్ ప్రూట్స్‌తో తయారు చేసిన మాయిశ్చరైజర్‌కే నా మొదటి ప్రాధాన్యం. అలాగే కోకోనట్స్‌తో తయారు చేసిన ప్రోడక్ట్స్‌ని ఎక్కువగా వాడతాను. దానితో చర్మం కాంతివంతంగా తయారవుతుంది. ఇవి ఎలాంటి చర్మతత్వానికి అయినా కోమలంగా మారుస్తుంది.
సన్‌వూస్టోక్‌తో :ఎండలో వెళ్లినప్పుడు చర్మం కచ్చితంగా పాడవుతుంది. దానికోసం.. సన్‌వూస్కీన్ లోషన్ పెట్టి 15 నిమిషాల పాటు ఉంచి తరువాత కడిగేయాలి. దీంతో స్కిన్ చాలా మృదువుగా ఉంటుంది.

స్కిన్‌కేర్ : ప్రతిరోజూ షూటింగ్స్... బిజీ, బిజీ షెడ్యూల్స్... అయినా రోజూ క్లెన్సింగ్, టోన్, స్పెషల్‌గా మాయిశ్చరైజర్‌లు తప్పకుండా వాడతాను.
1. ప్రతి రోజూ కనీసం ఎనిమిది గ్లాసుల నీటిని తప్పనిసరిగా తాగుతుందట. దాని వలన ఆమె శరీరంలోని మలినాలు బయటకు వెళ్లిపోతాయి.
2. రోజూ ఉదయమే గోరువెచ్చని నీటిలో తేనె, నిమ్మకాయ రసం కలుపుకుని తాగితే చర్మానికి నిగారింపుకు దోహదం చేస్తుంది అంటోంది ఐష్.
3. అతిగా మేకప్ చేయడం వల్ల అందాన్ని దెబ్బతీస్తుంది. తేలికపాటి మేకప్ తోనే అందంగా కనిపించవచ్చు.
4. యోగాసనాలు, వ్యాయామాలు శరీరాకృతిని కాపాడుకోవడానికి దోహదం చేస్తాయి. అంతే కాదు వ్యాయామం మెదడును, చర్మాన్ని ఫ్రెష్ గా ఉండేలా చేస్తుంది.
5. ఎక్కువగా పండ్లు, పెరుగు, మరియు గ్రీన్ వెజిటెబుల్స్ ను తీసుకోవడం వల్ల నేచురల్ గా కనబడటమే కాకుండా శరీరాన్ని ఫిట్ గా ఉంచుతాయి. ముఖ్యంగా ఎక్కువగా నీటిని తాగడం వల్ల శరీరం తేమగా ఉండేట్లు చేస్తుంది. ఫ్రెష్ గా దొరికే పండ్ల రసాలు కోకోనట్ వాటర్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ బయటకు పంపి శరీరం ఫ్రెష్ గా ఉండేట్లు చేస్తుంది.
6. ఎటువంటి పరిస్థితుల్లోనూ నిద్రను అలక్ష్యం చేయనని కూడా చెబుతోంది. ఆరు గంటలు గాఢంగా నిద్రతో పాటు మితంగా ఆహారం ఆరోగ్యానికే కాదు అందానికీ మంచిదే. దాంతోనే నేను ఆరోగ్యంగా ఫింట్ గా ఉండగలుగుతున్నానంటోంది.
ముఖ్యంగా సినీ రంగంలో ఉన్నవారు మితాహారం తప్పనిసరిగా తీసుకోవాలి. అంటూ తన బ్యూటీ సీక్రెట్ ను బయటపెట్టింది అందాల కాజల్....



Click it and Unblock the Notifications