Latest Updates
-
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.!
ముఖంలో మృతకణాలు పోగొట్టేందుకు ముల్తానీ ఫేస్ ఫ్యాక్..
Skin Care
oi-Saraswathi
By Sindhu

1. ఒక టీ స్పూను పెరుగు, ఒక టీస్పూను ముల్తానీ మట్టి, ఒక టీ స్పను పుదీనా పొడి తీసుకుని అన్నింటిని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ వేసుకుని 15 నిముషాల తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగి, వెంటనే చన్నీళ్ళతో కడిగేయాలి.
2. జిడ్డు చర్మం కలిగిన వారికి ఇది చాలా మంచి ప్యాక్. అయితే పొడి చర్మం కలవారు ఈ ప్యాక్ వేసుకోకూడదు. పొడి చర్మానికి నీటికి బదులుగా, రోజ్‌వాటర్‌ను ఉపయోగించాలి.
3. ముఖానికి ప్యాక్ వేసుకుని 2,3 నిముషాలకంటే ఎక్కువసేపు ఉంచుకోకూడదు. తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
అలాగే, మొటిమలతో భాదపడేవారు.... మూడు వేపాకులను మెత్తగానూరి, దాంట్లో ఒక టీ స్పూన్ ముల్తానీ మట్టిని కలుపుకోవాలి.
4. ముఖాన్ని ప్యాక్ లాగా వేసుకొని 15 నిముషాల తరువాత మంచి నీటితో కడగాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే, ముఖం ఆరోగ్యవంతంగా, అందంగా ఉంటుంది. ముల్తానీ మట్టితో కాఫీస్క్రబ్ కూడా తయారుచుసుకోవచ్చు.
5. కాఫీ పౌడర్ ఒక టీస్పూను, ముల్తానీ మట్టి రెండు టీ స్పూన్లు, నీళ్లు రెండు టీ స్పూన్లు, వెనీలా, చాకొలెట్ అన్నింటిని బాగా కలిపి తలకు పట్టించాలి.
ఒక కప్పులో కాఫీపొడర్, ముల్తానీ మట్టి వేసి నీటితో కలపాలి. బాగా కలిసిన తరువాత ఎసెన్షియల్ ఆయిల్ వేసి కలపాలి. ఈ మిశ్రమం ఎక్స్ ఫోలియేషన్ కు బాగా పనిచేస్తుంది. కానీ ఈ మిశ్రమం కాస్తంత గరుకుగా ఉంటుంది కాబట్టి ముఖానికి మెడకు అప్లయ్ చేయకూడదు. ఈ రెండింటినీ మినహాయించి ఒంటికి పట్టించి మర్దనా చేస్తే మృతకణాలు తొలగిపోవడమే కాకుండా చర్మం నునుపుగా అందంగా మారుతుంది. సౌందర్యం మరింత ఇనుమడిస్తుంది.
Comments
English summary
Multani Mitti Face Pack for Skin Soft and Smooth | ముల్తానీ ఫేస్ ప్యాక్ తో ముఖసౌందర్యం...
Story first published: Friday, January 13, 2012, 12:11 [IST]
Other articles published on Jan 13, 2012



Click it and Unblock the Notifications