Latest Updates
-
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.?
వేసవిలో జిడ్డు చర్మం మరింత జిడ్డుగా తయారవ్వకుండా...

జిడ్డు తగ్గించేందుకు:
1. టమాటాలో కాస్త ఓట్స్ కలిపి మిక్స్ చేసిన మిశ్రమాన్ని ముఖానికి అప్లైచేసి 20 నిమిషాలు తర్వాత శుభ్రపరచాలి. జిడ్డు చర్మం ఉన్నవారికి టమోటాలు చాలా బాగా ఉపయోగపడతాయి. టమోటాని సగానికి కోసి ముఖనికి చేతులకు రుద్ది పావు గంట తర్వాత కడిగేయాలి. చర్మం శుభ్రపడుతుంది బ్లాక్ హెడ్స్ తగ్గుతాయి. చర్మ రంద్రాలు శుభ్రపడతాయి.
2. పాలు, గుడులోని తెల్లసొన, క్యారెట్ తురుము కలిపిన మిశ్రమాన్ని ముఖానికి పట్టించి నట్లైతే అధిక జిడ్డు తత్వాన్ని తగ్గిస్తుంది. జిడ్డు చర్మం వారు అప్పుడప్పుడు చన్నీటితో ముఖాన్ని శుభ్రపరచాలి.
3. మజ్జిగని ముఖంపైన అప్లైచేసి కొంత సేపు తర్వాత శుబ్రపరచినట్లైతే జిడ్డుని తగ్గిస్తుంది. అలాగే పెరుగు కూడా జిడ్డు చర్మానికి బాగా పనిచేస్తుంది. రెండు టేబుల్ స్పూన్ల పెరుగులో కార్న్ పౌడర్, నిమ్మరసం కలిపి ముఖానికి ప్యాక్ లా వేసుకుని కాసేపయ్యాక కడిగేస్తే జిడ్డు తత్వం తొలగిపోతుంది.
4. కీరారసం, నిమ్మరసం, చందనం పొడి, బాదం పౌడర్, పెరుగు, బంగాళదుంప రసాన్ని సమానంగా తీసుకొని వాటిని ముఖానికి పట్టించి కొంత సేపు తర్వాత కడిగేయాలి. ఈ విధంగా క్రమంగా చేసినట్లైతే జిడ్డు తగ్గుతుంది.
5. నిమ్మరసం, గుడ్డులోని తెల్లసొన, ద్రాక్షరసాన్ని సమపాళ్ళల్లో తీసుకొని కలిపిన మిశ్రమాన్ని ముఖానికి అప్లైచేయాలి. కొంత సేపు తరువాత ముఖాన్ని నీటితో శుభ్రం చేయాలి.
6. జిడ్డు చర్మం వారు ఎండలో బయటికి వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చిన వెంటనే కాస్త పెరుగు, సెనగ పిండి, నిమ్మరసం కలిపిన మిశ్రమాన్ని ముఖానికి పట్టిస్తే జిడ్డుని తగ్గించి ముఖాన్ని అందంగా చేస్తుంది.
7. జిడ్డు చర్మం గలవారికి వేసవిలో మరింత జిడ్డెక్కిపోతుంది. అలాంటప్పుడు ద్రాక్షపళ్ల రసంలో ముల్తానీమట్టి కలిపి ప్యాక్‌లా వేసుకుని, అరగంట తర్వాత కడిగేసుకుంటే జిడ్డుదనం పోతుంది.
8. జిడ్డు చర్మ తత్వం కలవారు చర్మాన్ని ఎప్పుడు ఫ్రెష్ గా ఉంచుకోవాలి. అందుకో కనీసం ఒక రోజులు రెండు మూడు సార్లైనా చల్లని నీటితో ముఖం కడుక్కోవాలి. అందుకు తగ్గ గ్లిసరిన్ సోప్స్ ను వినియోగించడమే మంచిది.
9. అప్పుడప్పుడు ప్లైయిన్ టిష్సూ పేపర్ తో ముఖాన్ని అప్పుడప్పుడు శుభ్రపరచుకుంటుండాలి.
10. మాయిశ్చరైజర్స్ కి దూరంగా ఉండాలి. జిడ్డు చర్మ కలవారు మాయిశ్చరైజర్స్ వాడటం వల్ల ముఖం మీద ఉన్న మొటిమలపై రుద్దడం వల్ల సమస్య మరింత ఎక్కువ అవుతుంది. కాబట్టి వేసవిలో మాయిశ్చరైజర్స్ వాడకపోవడమే మంచిది.



Click it and Unblock the Notifications
