Latest Updates
-
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.!
ముత్యంతో ముద్దొచ్చే ముఖం మెరుపు...!

క్రమం తప్పకుండా ఫేషియల్స్ చేయించుకునే వారి ముఖం, మెడ ఆరోగ్యంగా, అందంగా తయారవుతుంది. వ్యర్థాలు, మృతకణాలు తొలగిపోతాయి. చర్మానికి అవసరమైన పోషకాలూ అందుతాయి. ముఖచర్మం సాగదు. నల్లని వలయాలూ తగ్గుతాయి. క్రమం తప్పకుండా ఫేషియల్ చేయించుకునే వారికి వృద్ధ్యాప్య చాయలు పది సంవత్సారాలు ఆలస్యంగా మొదలవుతాయి. చర్మం కాంతివంతంగా...కడిగిన ముత్యంలా కనబడాలంటే అవగాహన ఎంతో అవసరం....
చర్మానికి అర గంటకు మించి షేఫియల్ మర్ధన చేయించుకోకూడదు. మూడు నుంచి ఐదు నిమిషాలు క్లెన్నింగ్, స్క్రబ్బింగ్, పది నుంచి ఇరవై నిమిషాలు మర్ధన చేయాలి. ఆ సమయాన్ని పెంచితే రాపిడి పెరిగి మొటిమలు, దద్దుర్లు వచ్చే ఆస్కారం ఎక్కువ.
గ్లవుజులు ధరించకుండానే ఫేషియల్ మర్ధన చేయాలి. అప్పుడే ఫీల్ గుడ్ హార్మోన్లు విడుదలై చక్కని సాంత్వన లభిస్తుంది.
ముఖానికి ఆవిరి పట్టేటప్పుడు కళ్లు మూసుకోవాలి. లేదంటే వాటి చుట్టూ నల్లగా మారతాయి. పదమూడేళ్లలోపు అమ్మాయిలు ఫేషియల్ చేయించుకోకపోవడమే మంచిది. వయసుని బట్టి చికిత్సలు, రకరకాల పూతల్ని ప్రయత్నిస్తే నలుగురిలో మెరవడం ఖాయం.
ముత్యాలతో మెరిసేలా: వేసవిలో ఈ ఫేషియల్ చర్మానికి చల్లదనాన్నిచ్చి మెరిపిస్తుంది. మంగు, నల్లమచ్చల్ని కూడా తొలగిస్తుంది. దీనిలో ఎలాంటి విద్యుత్ ఉపకరణాలని వాడరు. ముందుగా తెల్లని వాటర్ లిల్లీల క్లెన్సర్ తో చర్మాన్ని శుభ్రం చేయాలి. ముత్యాల పొడి స్క్రబ్ తో చర్మాన్ని శుభ్రం చేయాలి.
ఆల్చిప్పల పొడి, ముత్యాల భస్మంతో చేసిన క్రీమ్ తో పది నిమిషాలు మృదువుగా మర్దన చేయాలి. ఆ తర్వాత ముత్యాల జెల్, పువ్వుల సీరమ్ ని కలిపి రోలర్ తో మృదువుగా ఐదు నిమిషాలు మర్ధన చేయాలి. అనంతరం ముత్యాలపొడి ప్యాక్ వేసి పదిహేను నిమిషాల తర్వాత కడిగేయాలి. ఈ ఫేషియల్ ను వారానికి ఒక్కసారి చేయించుకుంటే... చర్మం రంగు మారి తెల్లగా మారతారు. జిడ్డు చర్మతత్వం వారికి ఇది చాలా మంచిది.
బంగారు లాంటి ఛాయకు: వివాహాల సమయం... కాబోయే వధువు దీన్ని ప్రయత్నిస్తే బంగారు ఛాయతో మెరిసిపోతారు. జిడ్డు చర్మతత్వం, మొటిమలు ఉన్న వాళ్లు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. రెండు నెలలకోసారి చేయించుకోవచ్చు. అయితే నాణ్యమైన ఫేషియల్ ను ఎంచుకొంటేనే ఇతర సమస్యలు రాకుండా ఉంటాయి. ముందుగా బంతిపూల క్లెన్సర్ తో చర్మాన్ని శుభ్రం చేయాలి. గోల్డ్ స్క్రబ్ తో మృదువుగా మూడు నిమిషాలు మర్దన చేసి గోల్డ్ క్రీమ్ ని రాయాలి. దానిపైనే లింఫాటిక్ మసాజ్.. ముఖాన్ని ఓ పద్దతి ప్రకారం మర్దన చేస్తారు.
మెడ వెనుక బాగాన్ని కొద్దిగా నొక్కినట్లు చేయాల్సి ఉంటుంది. ఫలితంగా ముఖ చర్మంలో పేరుకున్న మలినాలు తొలగుతాయి. తర్వాత గోల్డ్ జెల్ ని రాసి పదినిమిషాలు ఆల్ట్రాసోనిక్ లేదా గాల్వొనిక్ చికిత్స దీనికి గంటన్నర సమయం పడుతుంది. ఆ మెరుపు పదిహేను రోజుల దాకా ఉంటుంది.
అలాగే వజ్రపు వన్నెలు: దీన్ని పెర్ల్ ఫేషియల్ మాదిరిగానే చేస్తారు. అయితే దీన్ని ఇరవై అయిదేళ్ల లోపు వాళ్లు చేయించుకోకపోవడమే మంచిది. ఈ చికిత్సలో వజ్రాలపొడిని వాడతారు.



Click it and Unblock the Notifications
