For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కాలుష్యం నుండి చర్మాన్ని సంరక్షించుకోవడం ఎలా..?

|

Protecting your Skin from Pollution
ట్రాఫిక్ కాలుష్యాల వల్ల ప్రధానంగా చర్మంపై అలర్జీలు వచ్చే అవకాశాలు ఎక్కువ అని ల్యాబరేటరీ పరిశోధనల్లో తేలింది. చిన్న పిల్లల చర్మంపై వీటి ప్రభావం మరీ ఎక్కువ. రోడ్లపై వాహనాలు పెరిగిపోవడంతో కాలుష్యం మరింత పెరిగింది. దాని తొలి ప్రభావం పడేది చర్మం మీదనే. మన చుట్టూ ఉండే వాతావరణంలో దుమ్ము, ధూళి, గాలిలో వేలాడుతుంటే కణాలు పెరుగుతున్నాయి. కాలుష్యం, దుమ్ము, ధూళి వల్ల చర్మంతో పాటు జుట్టుపై పడే ప్రభావం ఎక్కువగా కనబడుతోంది. ట్రాఫిక్ కారణంగా గాలిలో కలుస్తున్న కాలుష్యాల ప్రభావంతో భూమి వాతావరణంపై ఉండే ఓజోన్ పొర దెబ్బతింటోంది. ఫలితంగా చర్మానికి హానికరమైన అల్ట్రా వయొలెట్ కిరణాల ప్రభావం ఎక్కువవుతోంది. దీని ఫలితంగా చర్మక్యాన్సర్, చర్మం నల్లబారడం (పిగ్మెంటేషన్) వంటి పరిణామాలు ఎక్కువ. కాబట్టి కొద్దిపాటు జాగ్రత్తలు అవసరం.

1. కాలుష్యాలైన పొగ, దుమ్ము, ధూళి నేరుగా తాకకుండా సాధ్యమైనంత వరకు చర్మం కప్పి ఉంచేలా దుస్తులు ధరించాలి. అంటే ముఖం, చేతులను రక్షించుకోడానికి స్కార్ఫ్, గ్లౌజ్ వంటివి తొడుక్కోవాలి.
2. చర్మం, వెంట్రుకలకు మంచి పోషకాలు అందేలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న పదార్థాలు అంటే ఆకుపచ్చని కూరలు (గ్రీన్ లీఫీ వెజిటబుల్స్), తాజా పళ్లు, విటమిన్ ఏ, సీ, ఈ ఉండే ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. రోజూ రాత్రివేళ కూడా చర్మం, వెంట్రుకలు శుభ్రం అయ్యేలా స్నానం చేయాలి.
3. బయటకు వెళ్లడానికి కనీసం 15-20 నిమిషాల ముందు సన్‌ స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. దీనికి తోడు బయటకు వెళ్లాక కూడా ప్రతి రెండు, మూడు గంటలకోమారు మళ్లీ సన్‌ స్క్రీన్ లోషన్ రాసుకోవాలి.
4. సన్‌స్క్రిన్‌లో ఉంటే రసాయనిక ఫిజకల్‌ సన్‌స్క్రిన్‌ లేదా కంబైన్‌ సన్‌స్క్రిన్‌ అనేది గమనించాలి. సన్‌ స్క్రిన్‌ ఉపయోగంతో సన్‌బర్న్స్‌, పిఎంఎల్‌ఇ, చర్మ క్యాన్సర్‌ నుంచి రక్షణ పొందవచ్చు.
5. ఎవరైనా సరే వారి చర్మ రకానికి సరిపోయే స్క్రబ్‌ని వాడాలి. ఎందుకంటే ఏ రకం పడితే ఆ రకం వాడేయటం వలన కొన్ని రకాల స్క్రబ్స్ దద్దుర్లకు దారి తీస్తాయి. చేతులతో గానీ మెత్తని దూది స్కాడ్‌తో ఫేషియల్ స్క్రబ్‌ని తడి ముఖానికి వాడుతున్నప్పుడు మృదువుగా రుద్దుకోవాలి.

English summary

Protecting your Skin from Pollution | కాలుష్యం నుండి చర్మాన్ని సంరక్షించుకోవడం ఎలా..?

Environmental pollution, such as cigarette smoke, car exhaust fumes, and smog, increases the levels of free radicals produced by the body. Free radicals are thought to harm the skin cells by encouraging collagen and elastin fibers to break down, speeding the aging process.
 Contaminants in the air find their way onto your skin and can interfere with its ability to regulate moisture levels. This can make the skin dry and patchy, or block the pores, causing spots and blemishes.
Story first published:Friday, January 20, 2012, 12:33 [IST]
Desktop Bottom Promotion