For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బంగారం కన్నా మరింత నిగారింపైన చర్మం కోసం...!

|

Sandal is a great product for skin care
సౌందర్యం గురించి చెప్పాలనుకొన్నప్పుడు చర్మకాంతి ముందు వరుసలోనే ఉంటుంది. మెరుపులీనే చర్మం చూసే కళ్లను ఆకట్టుకుంటుంది. అంతేకాదు, వయసుని చెప్పే శారీరక లక్షణాల్లో కూడా చర్మానిదే ప్రధమస్థానం. యవ్వనవంతమైన చర్మం ఉన్నవారు తక్కువ వయసున్న వారిలా కనిపించడం అందరికీ తెలిసిన విషయమే. వయసు పెరుగుతున్న కొద్దీ చర్మకాంతి తగ్గుతుండటం సహజమే. పెదవుల పక్కన, కళ్ల దగ్గర, మెడమీద కనిపించే ముడతలు పెరుగుతున్న వయసుని చెబుతుంటాయి. ప్రత్యేకంగా వయసు కారణంగా చర్మంలో వచ్చే ఇలాంటి మార్పులను నిరోధించేందుకు ఆయా వయసులకు తగ్గ అవసరాలను బట్టి సౌందర్య ఉత్పత్తులు నేడు మార్కెట్‌లో దొరుకుతున్నాయి. అయితే ఇవన్నీ ఏమి వినియోగించకుండానే బంగారు వన్నెతెచ్చే చర్మ సౌందర్యానికి చందనం ఎంతగానో ఉపయోగపడుతుంది. అదేలాగో చూద్దాం.......

1. చందనం యాంటీ సెప్టిక్ ఔషదంగా పనిచేస్తుంది. ఇందులో యాంటీ బాక్టీరియల్ గుణాలు కాలిన గాయాలను తెగిని గాయాలను మాన్పుతాయి.
2. మొటిమలను తగ్గించడంలోనూ చందనం పాత్ర కీలకం. ఒక టీ స్పూన్ చందనం పొడిలో ఒక టీస్పూన్ పసుపు నీరు కలిపి పేస్టులా చేసి రాత్రి పడుకునే ముందు ముఖానికి ప్యాక్ లా వేసుకుంటే మొటిమలు తగ్గిపోతాయి. ముఖం నిగారింపు సంతరించుకుంటుంది.
3. చందనం పొడిని రోజ్ వాటర్ తో కలిపి ఆ పేస్ట్ ను ముఖానికి, భుజాలకు, వీపు భాగంలో రాసుకుంటే అక్కడుండే మచ్చలు కొంతకాలానికి తగ్గిపోతాయి.
4. ఒక టీ స్పూన్ చందనం, పసుపు నిమ్మరసం కలిపి చర్మంపై దురద, మంట ఉన్న చోట రాసుకుని, అరగంట తర్వాత చల్లటి నీటితో రాసుకుని, అరగంట తర్వాత చల్లటి నీటితో కడిగితే ఆ దురద, మంట ఇట్టే మాయమైపోతాయి.
5. డ్రై స్కిన్ ఉన్న వారు ప్రతిరోజూ చందనం నూనె రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. చందనం నూనెను మాయిశ్చరైజర్ గా కూడా ఉపయోగించవచ్చు. ఈ నూనెను చందనం చెట్ల నుంచి తీస్తారు.
6. చందనం పసుపు పాలు కలిపి పేస్టులా చేసి కీటకాలు కుట్టిన చోట పెడితే మంట నుంచి ఉపశమనం లభిస్తుంది.
7. రోజూ చందనం పొడిని శరీరానికి రాసుకుంటే చెమట ఎక్కువగా పట్టడం తగ్గుతుంది.
8. చందనం కూలింగ్ ఎజెంట్ గా కూడా పనిచేస్తుంది. తలనొప్పిగా ఉన్నప్పుడు చందనం పొడిని పేస్టులా చేసుకుని నుదిటిపైన రాసుకుంటే ఉపశమనం లభిస్తుంది.
9. చందనంలో యాంటీ సెప్టిక్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే సబ్బుల తయారీలోనూ, ఇతర బ్యూటీ ఉత్పత్తుల్లోనూ దీనిని విరివిగా ఉపయోగిస్తున్నారు.
10. చందనంతో తయారు చేసిన అగర్ బత్తీలను ఇంట్లో వెలిగించుకోవడం మంచిది. చందనం పొగ రెస్పిరేటరీ సిస్టమ్ ను యాక్టివ్ చేస్తుంది. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రను అందిస్తుంది. చందనం ఆస్ట్రిజెంట్ గా కూడా పనిచేస్తుంది. చర్మాన్ని కండరాలను బిగుతుగా చేస్తుంది.

English summary

Sandal is a great product for skin care....! | బంగారు వన్నెతెచ్చే చర్మ సౌందర్యానికి చందనం..


 Cooling & calming with natural astringent & antiseptic properties. It is useful in most skin disorders. Sandalwood pack removes scarring, & unveils a freshened, more perfect complexion. Sandal is a great product for skin care. It helps soothe sun burns, dry’s pimples faster, works wonders against prickly heat.
Story first published:Saturday, May 5, 2012, 15:14 [IST]
Desktop Bottom Promotion