For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నిగనిగలాడే చర్మం కోరకు...!

|

Sandalwood
అప్పుడప్పుడూ మనం వింటుంటాం గంధపు చెక్కల/ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగిందని...అంటే ఆ చెట్లకు అంత ప్రాముఖ్యత ఉందన్నమాటా అందుకే వాటికి రేటు కూడా పెద్ద మొత్తంలో ఉంటుం0ది. ప్రాచీన కాలం నుండి పూజా ద్రవ్యంగా వాడుకలో ఉన్నది. చందనపుచెక్కనుండి తీసిన తైలం మంచి సువాసన కలిగిన పరిమళ ద్రవ్యముల తయారీలో బాగా వాడుతున్నారు. నేటికీ, సౌందర్యసాధనాల్లో చందనానికి గల ప్రాధాన్యం చెప్పుకోదగిందే. చందనం తాలూకు గుణాలు మహత్తరమైనవి. రూపసౌందర్యాలకూ, చందనానికీ అవినాభావసంబంధం ప్రాచీనకాలం నుంచీ వుంది. శరీరానికి చందనలేపనం చేసుకోవటం గురించీ వింటుంటాం. సుకోమలమైన చర్మం, అందానికి ప్రతీక. అలాగే చందనం నుంచి వెలువడే సుగంధాలు ఆరోగ్యానికీ నిదర్శనం. ఈ కారణాల చేతనే చందనాన్ని సౌందర్యసాధనాల్లో నేడూ వాడుతున్నారు.

1. మేనికి మెరుపునిచ్చే ఈ గంధం ఎన్న జబ్బులకు కూడా ఉపశమనంగా వాడతారు. ఇలాంటి
ఒక స్పూను గంధంలో ఒక స్పూన్ పచ్చిపాలు కలిపి ముఖానికి పట్టించుకుంటే చర్మం కాంతివంతంగా తయారవుతుంది.
2. మంచిగంధం మాయిశ్చరైజింగ్‌ ఏజెంట్‌ గా పనిచేస్తుంది. చర్మంలో నుంచి పోయిన తేమను తిరిగి తీసుకురాగలగిన శక్తి చందనానికి కలదు.
3. జిడ్డు చర్మం వారికి గంధం బాగా ఉపయోగపడుతుంది. గంధంలో పెరుగు కలుపుకుని రాసుకుని ఓ పదిహేను నిమిషాల తర్వాత కడిగితే జిడ్డు తొలగిపోతుంది.
4. చందనాన్ని ముల్తానీ మట్టి, పన్నీరు కలిపి, పేస్ట్‌లా చేసి, ముఖం, మెడ మీద రాసుకుంటే ఈ లేపనం చర్మాన్ని స్నిగ్ధం చేస్తుంది. పాలిపోయిన చర్మానికి కూడా చందనం మేలు చేస్తుంది.
5. ప్రతి రోజూ గంధం వాడితే ముడతలు కూడా తొందరగా తగ్గుముఖం పడతాయి.
6. ముఖంపై కనిపించే బ్లాక్‌ హెడ్స్ పోవడానికి కూడా గంధం సాయపడుతుంది. నలుగు పిండిలో రెండు స్పూన్ల గంధంపొడి కలిపి స్నానం చేస్తే ఒళ్లంతా చక్కని పరిమళం వస్తుంది.
7. గంధం మేలైన స్క్రబ్‌ గానూ ఉపయోగపడుతుంది. చర్మం జీవం లేకుండా, వాడిపోయినట్లుగా కనిపిస్తే, లేదా చర్మంలోని మృతకణాలు సౌందర్యానికి బాధకాలుగా నిలిస్తే, స్నానం చేసే ముందు, కాస్త బరకగా వుండే చందనం పొడిని ముఖం, మెడ, చేతులూ, కాళ్లకు రాసుకోవాలి. దాంతో చర్మం మీదుండే మృతకణాల పొర తొలగిపోతుంది. చర్మానికి కొత్త కాంతి వస్తుంది.
8. ఫేస్‌ క్లెన్జర్‌ గానూ, ఎండకు కమిలిన చర్మం మీదా చందనం తన చల్లని ప్రభావాన్ని చూపుతుంది. చందనం గల సబ్బులూ, చందనం పేస్ట్‌తో రోజూ చర్మాన్ని శుభ్రపరచుకుంటే, కొద్ది రోజుల్లోనే చర్మం వికసించి, సహజకాంతితో మెరుస్తుంటుంది.

English summary

Sandalwood can make you to get a shining and gorgeous Skin... | పట్టులాంటి చర్మం కోసం...!

Red Sandalwood powder is the most significant benefit to your Skin, Hair, and feet and its application to the face can make you to get a shining and gorgeous Skin...
Story first published:Wednesday, February 8, 2012, 16:16 [IST]
Desktop Bottom Promotion