For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మొటిమలు.... మచ్చలు... గంధంతో మటుమాయం

|

Sandalwood Skin Care for Pimples and Acne
సాధారణంగా మహిళలు అందానికి, అలంకరణకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. సహజ సిద్ధంగా లభించే చందనంలో మేని సౌందర్యాన్ని సంరక్షించే సుగుణాలెన్నో ఉన్నాయి. వీటిలో ఉండే ఔషధ గుణాల ఫలితంగా చర్మం సంబంధ సమస్యలకు కూడా దూరంగా ఉండవచ్చు.

పోషకాహార లేమి, కాలుష్యం తదితర కారణాలతో కొందరి చర్మం కాంతి విహీనంగా ఉంటుంది. ఇలాంటివారు గంధం పొడిలో చెంచా పాలు, రెండు చుక్కలు తేనె కలిపి ఆ మిశ్రమాన్ని ముఖం, మెడ, చేతులకు పట్టించి ఆరే వరకూ ఉంచాలి. తర్వాత కొన్ని నీళ్లు తీసుకొని తడుపుతూ మృదువుగా3 మర్ధన చేయాలి. తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా చేస్తే చర్మం నిగనిగలాడుతుంది.

మృదువుగా: కొందరి చర్మం పొడిబారి నిర్జీవంగా తయారవుతుంది. దీనికి నివారణగా నాలు చెంచాల గంధం పొడిలో చెంచా బాదం పేస్ట్, నాలుగు చుక్కల కొబ్బరి నూనె కలిపి ముఖానికి పట్టించాలి. పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడం వల్ల మేని మృదుత్వాన్ని సంతరించుకోవడంతో పాటు టాన్ నుంచి కూడా విముక్కి కలుగుతుంది.

యాక్నేకు పరిష్కారం: బ్లాక్ హెడ్స్, యాక్నే వంటి సమస్యలు వేధిస్తున్నప్పుడు గంధంపొడిలో చెంచా పసుపు, కర్పూరం కలిపిన మిశ్రమాన్ని ముఖానికి పూతలా వేసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత దాన్ని కడిగేసుకోవాలి. ఒకవేళ ఈ సమస్య మరీ అధికంగా ఉన్నప్పుడు పడుకొనే ముందు రాసుకొని ఉదయాన్నే శుభ్రపరుచుకోవడం వల్ల పరిష్కారం లభిస్తుంది.

పగుళ్ళ నుంచి సాంత్వన: గంధంలో ఉండే ప్రత్యేక గుణాల వల్ల కాలి పగుళ్ల సమస్యకు ఇది ఔషదంలా పనిచేస్తుంది. గంధంలో రెంచు చుక్కల కొబ్బరి నూనె వేసి దాన్ని పాదాలకు పట్టిస్తే సరి.

నవయౌవనంగా: సూర్యిని నుంచి విడుదలయ్యే అతినీలలోహిత కిరణాల ప్రభావం పడితే చర్మం ఇరవైల్లోనూ, నలభైఏళ్ల వారిలా కనిపిస్తుంది. నాలుగు చెంచాల గంధంపొడిలో, గులాబీ నీరు, బొప్పాయి గుజ్జు, రెండు చుక్కల నిమ్మరసం కలిపి ఎండ తగిలే శరీర భాగాల్లో పూతలా వేసి అరగంట తర్వాత శుభ్రపరుచుకొంటే సరి.

మొటిమలకు గంధం పేస్ట్: ఒక టీస్పూన్ గందం పొడిలో, ఒక చెంచా పసుపు కలిపి, కొద్దిగా నీళ్లు కలుపుకొని పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ ను రాత్రి సమయంలో నిద్ర కు ఉపక్రమించే ముందు ముఖానికి అప్లై చేసి ఉదయాన్నే చల్లని నీటితో శుభ్రం చేసేసుకోవాలి.

గంధం-రోజ్ వాటర్: ముఖంపై మొటిమలు, మచ్చలకు ఈ ఫేస్ మాస్క్ బాగా పనిచేస్తుంది. రెండు చెంచాలా గంధం పొడిలో, రెండు చెంచాల రోజ్ వాటర్ కలిపి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

గంధం-నిమ్మరసంతో అలర్జీకి చెక్: స్కిన్ అలర్జీ వున్నవారు.ఒక చెంచా గంధం పొడి, ఒక చెంచా నిమ్మరసం, ఒక చెంచా పసుపు కలిపి మెత్తని పేస్ట్ లా తయారు చేసి ముఖానికి అప్లై చేసి అరగంట తర్వాత చల్లటి నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

English summary

Sandalwood Skin Care for Pimples and Acne... | సాండిల్ వుడ్ స్కిన్ కేర్...

our skin will respond beautifully to sandalwood. To use this exotic ingredient properly, follow one of these tips: mix the sandalwood,turmeric powder and milk together to make a face mask for treating acne; add sandalwood oil to almond or jojoba oil to relieve itching and dryness; mix sandalwood with unscented face moisturizer, and use it to soothe your skin; mix argan oil, sandalwood oils and rose essential oils for an anti-aging beauty regimen; or mix ground sandalwood with a bit of water and apply as a face mask.
Story first published:Monday, June 11, 2012, 12:37 [IST]
Desktop Bottom Promotion