Latest Updates
-
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.!
నిత్యయవ్వనంగా కనిపించేందుకు......

ప్రతి రోజు పది నుండి రోజుకు పదిహేను గ్లాసుల నీళ్లను తాగడానికి ప్రయత్నం చేయాలి. ఉదయాన్నే లేచి మీ ముఖాన్ని కొబ్బరి నీళ్లతో కడుకొంటే ముఖం ఫ్రెష్ గా కాంతివంతంగా తయారవుతుంది. ఎండలోకి వెళ్లి పనిచేయాల్సి ఉన్నందున సన్ బర్న్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనికి రాత్రి నిద్రించే సమయంలో జింక్ కలిగి ఉన్న క్రీమ్ ను రాసుకోవాలి.
చర్మం సంరక్షణలో అలోవెరా గుణాలు కలిగిన సన్ స్క్రీన్ ను రాసుకోండి. చర్మానికి కావలసిన తేమ అందుతుంది. తాజా పండ్లు, పండ్లరసాలు, చల్లని మజ్జిగలను త్రాగాలి. పండ్ల రసాలను తాగడమే కాకుండా వీలైతే పండ్ల గుజ్జుతో ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. తద్వారా పండ్ల గుణాలు మీ చర్మానికి చేరతాయి. అలాగే మేకప్ వేసుకునే సమయంలో ఎక్కువగా ఫౌండేషన్లు వేసుకోకూడదు. లైట్ గా పింక్ పౌడర్ మాత్రమే వాడండి.
ముఖంతో పాటు, చేతులు, కాళ్లు, కేశాలు మిగతా శరీర భాగాలను ఎండ నుంచి కాపాడుకోవాలి. ఇందుకోసం విటమిన్లు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి. శరీరాన్ని పటిష్టంగా ఉంచుకునేందుకు ప్రతిరోజూ వ్యాయామం చేస్తూ బ్యాలెన్డ్స్ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోండి. మనసును అదుపులో ఉంచుకునేందుకు యోగా, ధ్యానం చేయండి. ఇది చేయడం ద్వారా ప్రశాంతత మాత్రమే కాదు చర్మానికి కొత్త కాంతి కూడా వస్తుంది.
అన్నిటికంటే ముఖ్యమైనది సంతోషం మీ మనసులో సంతోషం పొంగి పొరలుతుంటే మిమ్మల్నిఏ నిరుత్సాహం దరిచేరదు. అలాగే ఎప్పుడూ ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండేందుకు ప్రయత్నించండి. బాధలు ఉన్నప్పటికీ, ముఖంపై చిరునవ్వును చెరగనివ్వద్దు. పై వాటిని క్రమం తప్పకుండా పాటిస్తుంటే ఏ కాలమైనా సరే మీరు నవ యవ్వనంగా కనిపిస్తుంటారు.



Click it and Unblock the Notifications