Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
వేసవి చర్మసంరక్షణలో పళ్లరసాలు..కొబ్బరి నీళ్ళు...

1. వెలుపల వాతావరణంలో గడపాల్సి వస్తే చర్మాన్ని సూర్యకిరణాలనుంచి రక్షించుకోవటం కోసం కలబంద రసాన్ని లేపనంగా పూసుకోవాలి.
2. వేసవిలో సబ్బుకు బదులు సున్ని పిండి వాడితే శ్రేయస్కరం. పల్లరసాలు, కొబ్బరి నీరు మొదలైనవి తరచు తాగడం వల్ల చర్మ సౌందర్యం ఆకర్షణీయంగా ఉంటుంది.
3. వేసవిలో చర్మంపై సౌందర్య సాధనాలను సాధ్యమైనంత వరకూ వాడకపోవడం మంచిది. ఇవి స్వేదాన్ని అడ్డుకుని మరింత చిరాకును కలిగిస్తాయి. చందనం మొదలైన
లేపనాలను పూసుకోవాలి. అలాగే కోపాన్ని, చిరాకును తగ్గించుకుని ప్రశాంతంగా గడపడం అలవర్చుకోవాలి.
4. వేసవిలో ఎండ వేడిమికి చర్మం కమిలిపోకుండా మృదువుగా నిగనిగలాడుతూ ఉండాలంటే మాయిశ్చరైజర్ వాడాలి.
5. వేసవిలో నిమ్మరసం ముఖానికి రాసుకుని ఓ అరగంట ఆగి గోరు వెచ్చని నీటితో కడిగితే ముఖం ఫ్రేష్ గా వుంటుంది.
6. వేసవిలో పెరుగు వాడటం చాలా మంచిది. చల్లదనం కలిగించడమే కాకుండా మంచి పౌష్టికాహారంగా కూడా పనిచేస్తుంది.
7. వేసవిలో ప్రతిరోజూ ఎనిమిది నుండి పది గ్లాసుల నీటిని తాగాలి.
8. వేసవితాపాన్ని, శ్రమని తగ్గించే వాటిల్లో స్నానం ఉత్తమమైనది. స్నానం ఎన్నిసార్లు చేయాలన్నది అన్నది మీరు ఉంటున్న పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. అవసరాన్ని బట్టి తలస్నానం రెండు లేదా మూడు రోజులకు ఒకసారి చేయవచ్చు. స్నానం చేసే నీటిలో కొన్ని చుక్కలు వెనిగర్ ను వేస్తే చెమట వాసన ఉండదు.
9. ఎక్కువగా ఎండలు ఉన్నప్పుడు సూర్యుడి కిరణాల వలన కళ్లకు హాని జరగకుండా చలువ కళ్లద్దాలను ధరిస్తే మంచిది.
10. వేసవి కాలంలో షూ ధరించకుండా కాళ్లను సాధ్యమైనంత ఎక్కువగా బహిర్గత పరిచే లాగా ఉంటే పాదాలకు గాలి తగిలి ఫంగస్ పెరగకుండా ఉంటుంది.



Click it and Unblock the Notifications
