Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
చర్మాన్ని ఎండ తీవ్రత నుండి కాపాడు కోవడం ఎలా...

ఎక్కువ కాలం ఎండ తీవ్రతకు గురైనప్పుడు వయస్సు పైనపడినట్లు కనిపిస్తారు. దీనిని ఫోటో ఏజింగ్ అంటారు. చర్మం పొడిబారిపోయి ముడతలు వచ్చి, చర్మంలో సోకే గుణం తగ్గి, జీవం కోల్పోయిన తోలు మాదిరిగా అవుతుంది. అప్పుడప్పుడు, తరచుగా ఎండలో తిరిగినప్పుడు చర్మంపై చిన్న పొలుసులు వచ్చి పోతుంటాయి. ఈ విధమైన ఇబ్బంది ఎక్కువగా ఎండాకాలంలో వస్తుంది. ఇవి ఎక్కువగా సూర్యరశ్మి ఎక్కువగా తాకే శరీర భాగాల్లో (ముఖం, మెడ, చేతులు) ఎక్కువగా వస్తాయి. అతి సాధారణంగా కనిపించే ఈ జబ్బు కారణంగా చికాకు ఎక్కువగా ఉంటుంది. అయితే ఎండాకాలంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడంతో చాలా వరకు ఉపశమనం పొంద వచ్చు.
1. ఎండ, అతి వేడి వల్ల చర్మం ఎర్రగా మారి కమిలిపోతుంది. టమాటా గుజ్జుకు కొద్దిగా పెరుగు కలిపి ముఖం, మెడ, చేతులు, పాదాలకు పూతలా వేయాలి. ఇరవై నిమిషాల తరవాత కడిగేయాలి. టమాటా చర్మాన్ని చల్లబరుస్తుంది. ఇక పెరుగు శరీరానికి అవసరమైన ప్రొటీన్‌ను అందించి మృదువుగా మారుస్తుంది.
2. సూర్యరశ్మి తగలకుండా చేతులకు ఫుల్ హాండ్స్ షర్ట్స్ ధరించాలి. ముదురు రంగు దుస్తులు, టోపీ, గొడుగు తప్పనిసరిగా వాడాలి.
3. సన్ స్క్రీన్ లోషన్ వాడాలి. మార్కెట్ లో లభ్యమవుతున్న సన్ స్క్రీన్ లోషన్ లో(సన్ ప్రొటెక్షన్ ఫాక్టర్)ను గమనించి వాడాలి.
4. సన్ స్క్రీన్ లో ఉండే రసాయనిక ఫిజికల్ సన్ స్క్రీన్ లేదా కంబైన్ సన్ స్క్రీన్ అనేది గమనించాలి.
5. సన్‌స్క్రీన్ ఉపయోగంతో సన్ బర్న్స్, పిఎంఎల్ ఇ, చర్మ క్యాన్సర్ నుంచి రక్షణ పొందవచ్చు.
6. ఎండ కారణంగా కమిలి ఎర్రగా మారిన చర్మానికి రెండు చెంచాల టమాటాగుజ్జులో నాలుగు టేబుల్‌స్పూన్ల మజ్జిగ కలిపి చర్మమంతా రాసుకోవాలి. అరగంటాగి కడిగేసుకుంటే తేడా ఉంటుంది.



Click it and Unblock the Notifications