For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చర్మాన్ని ఎండ తీవ్రత నుండి కాపాడు కోవడం ఎలా...

|

Special Care for Skin for Summer Season...
కాల చక్రాన్ని బట్టి వాతావరణంలో మార్పుల ప్రభావం చర్మంపై ఎంతో ఉంటుంది. చలికాలంలో పగుళ్లతో బాధపెట్టే చర్మం, ఎండాకాలంలో సూర్యరశ్మి తీవ్రతకు కందిపోయి చికాకు కలిగిస్తుంది. ఎండ పెరిగే కొలది అనేక చర్మ సమస్యలను ఉత్పన్నమవుతాయి. సూర్యరశ్మి చర్మ కాంతికి ఎంతగానో దోహదపడుతుంది. సూర్య కిరణాల్లో ఉండి డి విటమిన్ శరీరానికి ఎంతో ఉపయోగం. అయితే అతిగా వేడి తగలడం ద్వారా చర్మం కందిపోయి అనేక ఇతర సమస్యలు తలెత్తుతాయి. సూర్యరశ్మిలో ఉండే అల్ట్రావైలేట్‌ కిరణాల కారణంగా చర్మ వ్యాధులు ఎక్కువగా వస్తాయి. వాతావరణంలోని దుమ్ము, ధూళీ, కాలుష్యం, మేఘాల కారణంగా ఈ కిరణాల తీవ్రత పెరుగుతుంది.

ఎక్కువ కాలం ఎండ తీవ్రతకు గురైనప్పుడు వయస్సు పైనపడినట్లు కనిపిస్తారు. దీనిని ఫోటో ఏజింగ్‌ అంటారు. చర్మం పొడిబారిపోయి ముడతలు వచ్చి, చర్మంలో సోకే గుణం తగ్గి, జీవం కోల్పోయిన తోలు మాదిరిగా అవుతుంది. అప్పుడప్పుడు, తరచుగా ఎండలో తిరిగినప్పుడు చర్మంపై చిన్న పొలుసులు వచ్చి పోతుంటాయి. ఈ విధమైన ఇబ్బంది ఎక్కువగా ఎండాకాలంలో వస్తుంది. ఇవి ఎక్కువగా సూర్యరశ్మి ఎక్కువగా తాకే శరీర భాగాల్లో (ముఖం, మెడ, చేతులు) ఎక్కువగా వస్తాయి. అతి సాధారణంగా కనిపించే ఈ జబ్బు కారణంగా చికాకు ఎక్కువగా ఉంటుంది. అయితే ఎండాకాలంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడంతో చాలా వరకు ఉపశమనం పొంద వచ్చు.

1. ఎండ, అతి వేడి వల్ల చర్మం ఎర్రగా మారి కమిలిపోతుంది. టమాటా గుజ్జుకు కొద్దిగా పెరుగు కలిపి ముఖం, మెడ, చేతులు, పాదాలకు పూతలా వేయాలి. ఇరవై నిమిషాల తరవాత కడిగేయాలి. టమాటా చర్మాన్ని చల్లబరుస్తుంది. ఇక పెరుగు శరీరానికి అవసరమైన ప్రొటీన్‌ను అందించి మృదువుగా మారుస్తుంది.
2. సూర్యరశ్మి తగలకుండా చేతులకు ఫుల్‌ హాండ్స్‌ షర్ట్స్‌ ధరించాలి. ముదురు రంగు దుస్తులు, టోపీ, గొడుగు తప్పనిసరిగా వాడాలి.
3. సన్‌ స్క్రీన్‌ లోషన్‌ వాడాలి. మార్కెట్‌ లో లభ్యమవుతున్న సన్‌ స్క్రీన్‌ లోషన్‌ లో(సన్‌ ప్రొటెక్షన్‌ ఫాక్టర్‌)ను గమనించి వాడాలి.
4. సన్‌ స్క్రీన్‌ లో ఉండే రసాయనిక ఫిజికల్‌ సన్‌ స్క్రీన్‌ లేదా కంబైన్‌ సన్‌ స్క్రీన్‌ అనేది గమనించాలి.
5. సన్‌స్క్రీన్‌ ఉపయోగంతో సన్‌ బర్న్స్‌, పిఎంఎల్‌ ఇ, చర్మ క్యాన్సర్‌ నుంచి రక్షణ పొందవచ్చు.
6. ఎండ కారణంగా కమిలి ఎర్రగా మారిన చర్మానికి రెండు చెంచాల టమాటాగుజ్జులో నాలుగు టేబుల్‌స్పూన్ల మజ్జిగ కలిపి చర్మమంతా రాసుకోవాలి. అరగంటాగి కడిగేసుకుంటే తేడా ఉంటుంది.

English summary

Special Care for Skin for Summer Season... | వేసవి చర్మం కమిలిపోకుండా ఉండాలంటే...

Summer is the season when you have to take special care of your skin. You may be surprised that your summer skin, which looked radiant throughout winter, suddenly looks dull, blemished and oily. This is because, in winter your skin's natural oils solidifies, whereas in summer it flows freely. It's estimated that 90 percent of wrinkles cause due to sun exposure.
Story first published:Friday, March 9, 2012, 15:26 [IST]
Desktop Bottom Promotion