Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ముఖం చంద్రబింబంలా ఉండాలంటే స్ట్రాబెర్రీతో సౌందర్యం

1. స్ట్రాబెరీలతో ఫేస్ మాస్క్ వేసుకుంటే ముఖానికి చక్కటి మెరుపు వస్తుంది. ముఖం మీద మచ్చలు తగ్గి ముఖం చంద్రబింబంలా వుంటుంది. చక్కటి నిగారింపు వస్తుంది. అంతేకాదు. దీని వలన ఫేస్ ప్రెష్ గా కనిపిస్తుంది.
2. తేనె, పాలక్రీం రెండూ చెరో నాలుగు టేబుల్ స్పూన్ల చొప్పున తీసుకుని ఒక స్ట్రాబెర్రీని గుజ్జుగా చేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖమంతా పూతలా వేసుకోవాలి. పది నిమిషాల తర్వాత కడిగేసుకుంటే చర్మం మృదుత్వాన్ని సంతరించుకొని మెరిసిపోతుంది.
3. పీచ్, స్ట్రాబెరీ, ఏప్రికాట్, కివీ (సూపర్‌మార్కెట్‌లలో లభిస్తున్నాయి) పండ్లు చర్మానికి మంచి మాయిశ్చరైజర్‌లా పనిచేస్తాయి. పొడిబారిన చర్మాన్ని మృదువుగా చేస్తాయి.
4. ఈ పండ్ల జ్యూస్‌లో అర టీ స్పూన్ నిమ్మరసం. అర టీ స్పూన్ గ్లిజరిన్, రెండు టీ స్పూన్ల తేనె, కప్పు కాచిన పాలు కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒళ్లంతా పట్టించాలి. అరగంట తర్వాత స్నానం చేయాలి. వారానికి మూడుసార్లు ఇలా చేస్తూ ఉంటే మృదువుగా మారిన చర్మం కొత్తమెరుపు సంతరించుకుంటుంది.
5. దంతాలపై పడే టీ, కాఫీ మరకల్ని తొలగించి మిలమిలలాడేలా మెరిపించాలంటే..ొక స్ట్రాబెర్రీని తీసుకుని గుజ్జులా చేసి దంతాలపై రుద్దుకోవాలి.
6. సైసుల్లా తరిగిన స్ట్రాబెర్రీలను కొన్ని తీసుకుని అందులో టేబుల్ స్పూన్ క్రీం కలపాలి. దీన్ని ముఖానికి రాసుకుని పదినిమిషాలయ్యాక కడిగేసుకుంటే యాక్నే సమస్య అదుపులో ఉంటుంది.



Click it and Unblock the Notifications