For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ముఖం చంద్రబింబంలా ఉండాలంటే స్ట్రాబెర్రీతో సౌందర్యం

|

Strawberry Facial Mask
చూడగానే నోరూరిస్తూ ఎర్రని రంగులో చిరుపులుపుతో, స్వీట్ గా స్వభావం కలిగి, చక్కటి ఆకారం కలిగినటువంటి పండు స్ట్రాబెరీ. ఈ ఫ్రూట్ తినడానికి మాత్రమే కాదు సౌదర్య సాధనంగా కూడా ఉపయోగించుకోవచ్చు.

1. స్ట్రాబెరీలతో ఫేస్‌ మాస్క్‌ వేసుకుంటే ముఖానికి చక్కటి మెరుపు వస్తుంది. ముఖం మీద మచ్చలు తగ్గి ముఖం చంద్రబింబంలా వుంటుంది. చక్కటి నిగారింపు వస్తుంది. అంతేకాదు. దీని వలన ఫేస్‌ ప్రెష్‌ గా కనిపిస్తుంది.

2. తేనె, పాలక్రీం రెండూ చెరో నాలుగు టేబుల్ స్పూన్ల చొప్పున తీసుకుని ఒక స్ట్రాబెర్రీని గుజ్జుగా చేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖమంతా పూతలా వేసుకోవాలి. పది నిమిషాల తర్వాత కడిగేసుకుంటే చర్మం మృదుత్వాన్ని సంతరించుకొని మెరిసిపోతుంది.

3. పీచ్‌, స్ట్రాబెరీ, ఏప్రికాట్‌, కివీ (సూపర్‌మార్కెట్‌లలో లభిస్తున్నాయి) పండ్లు చర్మానికి మంచి మాయిశ్చరైజర్‌లా పనిచేస్తాయి. పొడిబారిన చర్మాన్ని మృదువుగా చేస్తాయి.

4. ఈ పండ్ల జ్యూస్‌లో అర టీ స్పూన్‌ నిమ్మరసం. అర టీ స్పూన్‌ గ్లిజరిన్‌, రెండు టీ స్పూన్ల తేనె, కప్పు కాచిన పాలు కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒళ్లంతా పట్టించాలి. అరగంట తర్వాత స్నానం చేయాలి. వారానికి మూడుసార్లు ఇలా చేస్తూ ఉంటే మృదువుగా మారిన చర్మం కొత్తమెరుపు సంతరించుకుంటుంది.

5. దంతాలపై పడే టీ, కాఫీ మరకల్ని తొలగించి మిలమిలలాడేలా మెరిపించాలంటే..ొక స్ట్రాబెర్రీని తీసుకుని గుజ్జులా చేసి దంతాలపై రుద్దుకోవాలి.

6. సైసుల్లా తరిగిన స్ట్రాబెర్రీలను కొన్ని తీసుకుని అందులో టేబుల్ స్పూన్ క్రీం కలపాలి. దీన్ని ముఖానికి రాసుకుని పదినిమిషాలయ్యాక కడిగేసుకుంటే యాక్నే సమస్య అదుపులో ఉంటుంది.

English summary

Strawberry Facial Mask makes your skin pores smaller and shinier.... | సూపర్ నేచ్యురల్ స్ట్రాబెర్రీ ఫ్రూట్ మాస్క్....

Strawberries contain salicylic acid that rids the skin of dead cells, makes your skin pores smaller and your face look brighter and shinier. They gently refresh and exfoliate the skin, remove impurities, and reduce redness and swelling, which is wonderful for a cleansing and skin softening facial mask.
Story first published:Monday, January 23, 2012, 17:39 [IST]
Desktop Bottom Promotion