Latest Updates
-
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.!
వేసవిలో సౌకర్యవతంగా ఉండాలంటే...

చెమటకాయలు: ఎండలో ఎక్కువగా తిరిగేవారికి స్వేద గ్రంథులు ఎక్కువగా చెమటను విడుదల చేయడంతో చర్మంపై ఉండే పలుచటి పొర త్వరగా దెబ్బతింటుంది. దీని వల్ల నుదుటిపై చంకల్లో, వీపుపై చర్మం ముడతుల పడే భాగంలో ఎక్కువగా వస్తుంటాయి.
మొటిమలు: ఎండ వేడికి మొటిమలు వచ్చి అవి మానిన తర్వాత నల్లటి మచ్చలుగా మారతాయి. చర్మ కాంతి కూడా తగ్గుతుంది. ఈ చర్మ తత్వం ఉన్న వారు ముఖాన్ని తరుచుగా చన్నీటితో శుభ్రం చేసుకుంటుండాలి.
నల్ల మచ్చలు: వేసవిలో ఎండ ప్రభావం ముఖ్యంగా చర్మం పైనే ఉంటుంది. ఎండలోకి వెళ్ళగానే చర్మం నల్లబడటం, ముఖ్యంగా ముఖంపై నల్లని మచ్చలు రావడం చాలా మందిలో చూస్తుంటాం. వీరిలో చర్మానికి రంగునిచ్చే వర్ణకణాలు, ఎండ వేడికి త్వరగా చలించే మెలనోసైట్ అనే కణాలు అధికంగా వృద్ధి చెందడం వల్ల నల్ల మచ్చలు ఏర్పడతాయి. ఇలాంటి వారు ఎండలోకి వెళ్ళే ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.
వేసవిలో ఇటువంటి చర్మ సంబంధిత సమస్యలతో పాటు, శరీరంలోని నీరు చెమటరూపంలో బయటకు పోవడం వల్ల శరీరంలోని నీటి శాతం, లవణ, ఖనిజాలు తగ్గిపోతాయి. ఫలితంగా చర్మం పొడిబారిపోయి, జీవం కోల్పోయినట్టుగా మారుతుంది. చివరకు డీహైడ్రేషన్ స్థితికి చేరుకుని చాలా ప్రమాదాలకు దారితీస్తుంది. అలాగే తరచుగా తలనొప్పి, వడదెబ్బ తగలడంతో ఎన్నో సమస్యలకు లోనవుతారు. కాబట్టి ఈ వేసవి కాలంలో కొన్ని జాగ్రత్తలు తీసుకొన్నట్లైతే ఎండ నుండి బయట పడవచ్చు.
1. వేసవిలో ప్రతి నిత్యం శరీర అవయవాలన్నీ శుభ్రంగా, పొడిగా ఉంచుకోవాలి. రెండు పూటలా స్నానం చేయాలి.
2. ముఖ్యంగా శరీరంలో ముడత పడే ప్రాంతాలు... అంటే పాదానికి, పాదపు వేళ్లకు మధ్యన ఉండే ప్రదేశాలు పొడిగా ఉంచుకోవాలి.
3. వదులుగా ఉండే దుస్తులు ధరించాలి. లో దుస్తులు, సాక్స్ లు సౌకర్యంగా ఉండాలి.
4. చెమట పట్టినప్పుడు దుర్వాసనలను నిరోధించే యాంటీ పెరిస్పెరెంట్స్ ఉపయోగించాలి.
5. ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. మంచినీళ్ళు, మజ్జిగ, కొబ్బరి నీళ్ళు, బార్లీ, సగ్గుబియ్యంతో చేసిన జావ, చెరుకు రసం వంటివి తీసుకోవచ్చు. బయట అమ్మే వాటిని తీసుకోకపోవడం మంచిది. రోడ్డుపై లభించే ఐస్ క్రీమ్ ల జోలికి కూడా పోవద్దు. పుచ్చకాయ తీసుకోవడం మంచిది. ఐస్ కలపకుండా ఉన్న పళ్ళ రసాలు తీసుకోవాలి.
6. ఎండకు అతిగా గురికాకూడదు, చెవుల్లోకి వేడిగాలి పోకుండా చూసుకోవాలి. బయటకు వెళ్లేటప్పుడు చెప్పులు తప్పకుండా ధరించాలి.



Click it and Unblock the Notifications