Latest Updates
-
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.!
అరటిపండులో దాగుంది అసలు సౌందర్యం...

1. బాగా మిగలమగ్గిన అరటిపండును గుజ్జుగా చేసి అందులో రెండు స్పూన్ల గట్టి పెరగు లేదా ఓట్స్ పొడి వేసి బాగా కలిపి ముఖం, మెడకు పట్టించి బాగా ఎండిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ చిట్కా వలన ముఖ సౌందర్యం రెట్టింపు అవుతుంది.
2. అరటిపండు గుజ్జులో ఒక టీస్పూన్ తేనె, లేదా ఒక టీస్పూన్ పచ్చిపాలు వేసి కలపి ముఖానికి పట్టించి బాగా ఆరనివ్వాలి. కొద్దిసేపటి గోరువెచ్చటి నీళ్ళతో ముఖం కడుక్కోవాలి. ఇలా ఒక నెలా పాటు క్రమం తప్పకుండా చేసినట్లైతే ముఖం మిలమిల మెరుస్తూ ఆరోగ్యంగా ఉంటుంది.
3. ముఖంలో మొటిమలతో బాధపడేవారికి అరటిపండు ఓ వరమనే చెప్పవచ్చు. బాగా పండిన అరటిపండును ఒక దానిని తీసుకుని మెత్తగా చిదిమి, ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే.. ఇన్ ఫెక్షన్ తో కూడిన మొటిమలలో ఉండే బ్యాక్టీరియాను అరటిపండులోని పొటాషియం హరించివేయటంతో అవి త్వరగా తగ్గిపోతాయి.
4. ముఖం మీద మచ్చలతో బాధపడేవారు అరటిపండు తొక్కతో మచ్చలున్న ప్రదేశంలో సున్నితంగా రుద్ది ఓ అరగంట తర్వాత ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. రోజూ మొత్తంమీద వీలైనన్నిసార్లు ఈ విధంగా చేసినట్లైతే మచ్చలు మాయం అవుతాయి.
5. పొడి చర్మం కలవారు అరటిపండు గుజ్జలు గుడ్డలోని తెల్లసొన, ఒక టేబుల్ స్పూన్ క్రీమ్ జత చేసి బాగా కలిపి ముఖం, మెడకు పట్టించి ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో కనీసం మూడు సార్లు చేసినట్టయితే మంచి ఫలితాన్ని పొందవచ్చు.....



Click it and Unblock the Notifications
