For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వేసవిలో చర్మాన్ని కాపాడే చల్ల..చల్లని పదార్థాలు

|

Summer Skin Care Tips to Look Great
వేసవిలో వేడి చర్మాన్ని ప్రభావితం చేస్తుంది. చర్మం కమిలిపోవడం..స్నానం చేసిన గంటకే తాజాదనం తగ్గి శరీరం వడిలిపోయినట్లు అవడం..లాంటి సమస్యలు ఓన్నో అలాంటి వాటిని అదుపులో ఉంచి చర్మం తాజాదంన సంతరించుకునేలా చేయాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి.

చందనం: గంధం పొడిని పాలతో కలిపి వారానికి మూడు సార్లు ముఖానికి రాసుకుంటే చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. అదే జిడ్డు చర్మతత్వం ఉన్న వాళ్ళు గులాబీనీటిలో కలిపి వాడుకోవచ్చు. గంధం నూనెను రెండు చుక్కలు స్నానం చేసే నీటిలో వేసుకుని స్నానం చేస్తే శరీరం పరిమిళ భరితం అవుతుంది.

తాటి ముంజలు: ఈ కాలంలో విరివిగా లభించే వీటివల్ల కలిగే మేలు అంతా ఇంతా కాదు. దాహార్తిని తగ్గించి శరీరానికి చల్లదనాన్ని అందించడమే కాదు..అందానికీ ఎంతో మేలుచేస్తాయివి. కాలిన గాయాలకు, మచ్చలు, దద్దుర్లు వంటి సమస్యల్ని నివారించడానికి తాటిముంజల్లోని నీరు దివ్వౌషధంలా పనిచేస్తాయి. వీటిని తరచూ తినడమే కాదు పూత రూపంలోనూ వేసుకోవచ్చే లేత తాటిముంజుల్ని తీసుకుని గుజ్జులా చేసి అందులో కొద్దిగా పాలపొడి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా రాసుకుని కాసేపయ్యాక కడిగేయాలి. ఇలా తరచూ చేస్తుంటే చర్మం ప్రకాశవంతంగా మారుతుంది.

పుచ్చకాయ: దీన్ని ప్రతి రోజూ తింటే శరీరం చల్లగా ఉంటుంది. ఇందులో పీచుపదార్థం ఎక్కువ కాబట్టి శరీరంలోని మిలినాల్నీ వెలుపలికి వచ్చేస్తాయి. పుచ్చకాయను పెద్ద ముక్కలా తరిగి దాన్ని తేకెలో ముంచి ముఖానికి రాసుకుని రెండు నిమిషాలు మర్దన చేస్తే సరిపోతుంది. చర్మం తాజాగా మారుతుంది. అలాగే పుచ్చకాయ పలుచని ముక్కల్లా కోసి ముఖంపై అద్ది కొద్దిగా వేడిగా ఉన్న వస్త్రాన్ని కప్పి ఉంచాలి. రెండు నిమిషాలయ్యాక తీసేస్తే చర్మం సహజ కాంతిని సంతరించుకుంటుంది.

కీరదోస: దీన్ని ప్రతి రోజూ తింటే శరీరానికి పీచు పుష్కలంగా అందుతుంది. సల్ఫర్, పొటాసియం, బాకంప్లెక్స్ విటమిన్లు ఇందులో పుష్కలం. కీరతో కళ్లనే కాదు చర్మాన్నీ మెరిపంచవచ్చు. కీరదోసను తురిమి ముఖానికి అద్దినట్లు చేయాలి. మపదినిషాలయ్యాక తీసేయాలి. దీని వల్ల మరింత మేలు జరగాలంటే కొద్దిగా తేనె కూడా కలిపి పూతలా వేసుకోవచ్చు. కీరదోస రసాన్ని సున్ని పిండిలో కలిపి నలుగు పెట్టుకుంటే చర్మం అందంగా తయారవుతుంది.

కొబ్బరి బోండం: చర్మాన్ని, శిరోజాలను మెరిపించే సుగుణం ఈ నీటి సొంతం. ఈ కాలంలో ప్రతిరోజూ కొబ్బరినీటిలో ముంచిన దూదిని ముఖానికి రాసుకోవచ్చు. ఈ తర్వాత రెండు రెండు మూడు నిమిషాలు నెమ్మదిగా మర్తన చేస్తే నల్లగా మారిన చక్మం నిగారింపును సంతరించుకుని అందంగా తయారవుతుంది. అలాగే ముదురిన కొబ్బరి నుంచి తీసిన పాలతో చర్మాన్ని మర్దన చేసుకోవాలి. కాసేపయ్యాక కడిగేస్తే, చర్మం చాలా సున్నితంగా, కోమలంగా తయారవుతుంది.

సబ్జా గింజలు: శరీరానికి చల్లదనం అందించే ఈ గింజల వల్ల కలిగే మేలు అంతాఇంతా కాదు. కానీ చాలామందికి వీటినెలా ఉపయోగించాలో తెలియదు. ఒక గ్లాసు నీటిలో రెండు చెంచాల గింజల్ని వేసి నానబెట్టాలి. నాలుగైదు గంటలకు అవి నాని మెత్తగా మారి ఉబ్బుతాయి. ఆ గింజల్ని మరో గ్లాసు నీటిలో వేసుకుని కొద్దిగా పంచదార లేదా తేనె కలిపి తాగితే శరీరానికి ఎంతో చలువ. అలాగే ఈ గింజల్ని తేనెతో కలపి గుజ్జులా చేసి ముఖానికి రాసుకుని రెండు నిమిషాలు మర్దన చేయాలి. పదినిమిషాలై కొద్దిగా ఆరినట్లు అయ్యాక కడిగేసుకుంటే సరిపోతుంది. చర్మం అందంగా తయారవుతుంది.

English summary

Summer Skin Care Tips to Look Great...| వేసవిలో చలవనిచ్చే అలంకరణ...

Also eating a lot of fresh cool fruits and vegetables like watermelons, cucumbers etc will bring the natural glow to your skin. Drinking tender coconut water will help you to remain hydrated the natural way. Also you can splash water on your face or wash it frequently to remove dirt and grime that will result in a radiant you in summer and forever.
Story first published:Friday, June 1, 2012, 11:19 [IST]
Desktop Bottom Promotion