Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మహిళలకు వేసవి చర్మ సంరక్షణ చిట్కాలు....

1. బయటకు వెళ్లవలసిన పని ఉంటే ఉదయం 10 గంటలలోపు, సాయంత్రం 4 గంటల తరువాత మంచిది. తప్పనిసరి అయితే గొడుగు లేదా టోపి మహిళలయినా సిగ్గుపడక తప్పక ధరించాలి. 2. ఉల్లిపాయను, వాటర్ బాటిల్‌ను తమ బ్యాగ్‌లో ఉంచుకోవాలి.
3. బయటకు వెళ్ళేటప్పుడు సన్ స్క్రీన్ లోషన్ తప్పక ఉపయోగించాలి.
4. రోడ్డుప్రక్కన చవకగా ఎక్కడబడితే అక్కడ దొరికే జ్యూస్‌లు తాగొద్దు. చెరుకురసం అయినా సరే ఫ్రెష్ గా తీసింది, ఐస్ లేకుండా తీసుకుంటే ఫరవాలేదు. చవక జ్యూస్ లవల్ల గొంతు ఇన్ ఫెక్షన్స్, అలర్జీలు వస్తాయి.
5. ఉదయం అన్నం వార్చిన గంజిలో పల్చటి మజ్జిగ, ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు వేసి ఒక మట్టికుండలో పోసి ఉంచుకొని, కాఫీ, టీల బదులు త్రాగుతుంటే ప్రాణం హాయిగా ఉంటుంది.
6. అలాగే విటమిన్ ‘ఎ’, ‘సి’ ఎక్కువగా లభించే ఆకు కూరలు, క్యారట్, క్యారట్ జ్యూస్, బీన్స్, స్వీట్ పొటాటో, నిమ్మపండ్లు ఎక్కువగా తీసుకోవాలి. ఇవి మొటిమల నివారణకు, ఆరోగ్య లాభాలకు తోడ్పడతాయి.
7. చర్మ రక్షణ కోసం, ప్రతిరోజూ స్నానానికి కనీసం పదిహేను నిమిషాలు ముందయినా, ముఖం, మెడ, చేతులు పాదాలకు కొబ్బరినూనె రాసుకొని, నూనె ఇంకిన తరువాత సబ్బు బదులుగా సున్నిపిండి లేదా శనగపిండి వాడితే ఎండాకాలంలో సూర్యకిరణాల వేడికి కొద్దిగా నల్లబడిన మేని చాయను పైవిధంగా కాపాడుకోవచ్చు.
8. లస్సీ, కొబ్బరి బొండాలు, పళ్ల రసాలు మంచివి. ఆరంజ్, యాపిల్, బొప్పాయి తింటే ఆరోగ్యమైన చర్మం ఏర్పడుతుంది. లెమన్ జ్యూస్ మంచిది. ఇందులో సి విటమిన్ వుండి చర్మాన్ని ఇన్‌ఫెక్షన్ నుంచి కాపాడుతుంది. ఎక్కువగా టీ, కాఫీ త్రాగకూడదు. ఇంకా మజ్జిగ, వెన్నతీసిన పాలు ఒంటికి మంచిది. టిన్‌లలో పాక్‌చేసిన పండ్లు, కూరలు వాడకూడదు.



Click it and Unblock the Notifications